MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైదరాబాద్ లో అప్పుడే నీటి కష్టాలు.. తక్కువ ధరలో వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకోండిలా..

హైదరాబాద్ లో అప్పుడే నీటి కష్టాలు.. తక్కువ ధరలో వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకోండిలా..

సమ్మర్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో నీటికష్టాలు పెరిగిపోతాయి… ఇప్పుడు అదే పరిస్థితి. వచ్చే ఏప్రిల్ లో కేవలం జలమండలి ట్యాంకర్ల కోసమే రోజుకు 10000 బుకింగ్స జరిగే అవకాశాలున్నాయట.. ఇక ప్రైవేట్ ట్యాంకర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 

3 Min read
Author : Arun Kumar P
Published : Mar 30 2026, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్ లో నీటికొరత
Image Credit : AI Generated

హైదరాబాద్ లో నీటికొరత

హైదరాబాద్.. ప్రపంచ పటంలో ఐటీ హబ్‌గా, చారిత్రక నగరంగా వెలుగొందుతున్న మహానగరం. కానీ ప్రతి ఏటా వేసవి కాలం వస్తుందంటే చాలు, ఈ మహానగరం గొంతు ఎండుతుంది. పెరుగుతున్న జనాభా, అస్తవ్యస్తమైన పట్టణీకరణ, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల హైదరాబాద్ తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు 'సరస్సుల నగరం'గా పిలవబడిన ఈ ప్రాంతం, నేడు ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం ఆందోళనకరం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఈ ప్రాంతాల్లో నీటి దందా..
Image Credit : AI

ఈ ప్రాంతాల్లో నీటి దందా..

హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో వేసవిలో నీటి సమస్యలు ఉంటాయి. కానీ బడాబాబులు, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ వంటి ప్రాంతాల్లో నీటి సమస్య మరీ ఎక్కువ. అందుకే ఈ ప్రాంతాల్లో ట్యాంకర్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఫిబ్రవరిలోనే నీటి కొరత ప్రారంభం అయ్యింది... ఇక మార్చి, ఏప్రిల్, మే, జూన్ లలో ఇది తారాస్థాయికి చేరుతుంది. ఈ నాలుగు నెలలు ట్యాంకర్లకు ఫుల్ గిరాకి.

ప్రైవేట్ వ్యక్తులు చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో బోర్లు వేసి నీటి దందా సాగిస్తున్నారు. ఇలా ఒక్క ట్యాంకర్ తో అక్రమంగా నీటితో వ్యాపారం చేస్తూ వేసవిలో రోజుకు రూ.10 నుండి రూ.20 వేల వరకు సంపాదిస్తున్నారు. ఇలా కొందరు పదుల సంఖ్యలో ట్యాంకర్లను కలిగివున్నారు. వాటర్ ట్యాంకుకు రూ.2 నుండి 4 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఒక్క ట్యాంకర్ రోజుకు నాలుగైదు వాటర్ ట్యాంకులు అమ్మినా చాలు.. నెలకు లక్షల ఆదాయం.

Related Articles

Related image1
హైదరాబాద్ కు 50 కి.మీ దూరంలో మరో కూకట్ పల్లి.. ఇక్కడ రూ.40-50 లక్షలకే ఇండిపెండెంట్ హౌస్, భవిష్యత్ లో అయితే కోట్లు..!
Related image2
New Income Tax Rules : హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఏప్రిల్ 1 నుంచి ఇవి మారబోతున్నాయి !
35
జలమండలి వాటర్ ట్యాంక్ ఎలా బుక్ చేసుకోవాలి..
Image Credit : Getty

జలమండలి వాటర్ ట్యాంక్ ఎలా బుక్ చేసుకోవాలి..

ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల దందా ఇలా ఉంటే జలమండలి (HMWSSB) కి కూడా బుకింగ్స్ పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజువారి వాటర్ ట్యాంకర్ బుకింగ్స్ భారీగానే ఉంటున్నాయి.. వచ్చేనెల ఏప్రిల్ లో డిమాండ్ మరింత పెరిగి ఏప్రిల్ లో రోజుకు 10,000 బుకింగ్స్ జరుగుతాయని అంచనా వేస్తున్నారు.

జలమండల వాటర్ ట్యాంకర్ల ద్వారా స్వచ్చమైన నీటిని సరఫరా చేస్తాం.. కాబట్టి వీటినే వాడాలని జలమండలి అధికారులు నగరవాసులను సూచిస్తున్నారు. ఈ వాటర్ ట్యాంకర్స్ ను 155313 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయడం లేదా అధికారిక వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని చెబుతున్నారు. జలమండలి మొబైల్ యాప్ ద్వారా ట్యాంకర్ బుక్ చేసుకోవచ్చు.

45
నీటి కొరతకు ప్రధాన కారణాలు
Image Credit : Getty

నీటి కొరతకు ప్రధాన కారణాలు

హైదరాబాద్ నీటి సమస్యకు ప్రధాన కారణం భూగర్భ జల మట్టాలు పడిపోవడం. నగరంలోని చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురై కాంక్రీట్ జంగిల్‌గా మారడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా పోయింది. దీనికి తోడు, కృష్ణా, గోదావరి నదుల నుండి నీటిని తరలించే ప్రక్రియలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు, పైపులైన్ల లీకేజీలు సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. అపార్ట్‌మెంట్ సంస్కృతి పెరగడంతో విపరీతంగా బోర్లు వేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం తగ్గడం లేదా అకాల వర్షాలు కురవడం కూడా రిజర్వాయర్లలో నీటి నిల్వపై ప్రభావం చూపుతోంది.

ఈ నీటి కొరత కేవలం దాహానికే పరిమితం కాకుండా సామాజిక జీవనంపై కూడా ప్రభావం చూపుతోంది. మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు నీటి ట్యాంకర్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. సమయానికి నీరు అందక గృహిణులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ సంస్థలు, ఇతర పరిశ్రమలు కూడా నీటి నిర్వహణ కోసం భారీగా వెచ్చిస్తున్నాయి. నీటి కోసం గల్లీల్లో జరిగే గొడవలు సామాజిక అశాంతికి దారితీస్తున్నాయి. ఇది పరోక్షంగా నగర ఆర్థిక వ్యవస్థపై, ప్రజల జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

55
ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి..
Image Credit : Getty

ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి..

గత ప్రభుత్వం 'మిషన్ భగీరథ' వంటి పథకాల ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించే ప్రయత్నం చేసింది... అయినా పెరుగుతున్న అవసరాలకు అది సరిపోవడం లేదు. నగరంలోని పురాతన చెరువులను పునరుద్ధరించడం, మూసీ నదిని శుద్ధి చేయడం వంటి చర్యలు వేగవంతం కావాలి. కేవలం ప్రభుత్వమే కాకుండా, పౌరులలో కూడా బాధ్యత పెరగాలి. ప్రతి ఇంట్లో 'వర్షపు నీటి ఇంకుడు గుంతలు' (Rainwater Harvesting) ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసుకోవాలి. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవడం ఒక సామాజిక బాధ్యతగా గుర్తించాలి.

నీరు ప్రాణాధారం. రాబోయే తరాలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి స్వచ్ఛమైన నీరు, పర్యావరణం. హైదరాబాద్‌ను నీటి కష్టాల నుండి గట్టెక్కించాలంటే శాస్త్రీయమైన నీటి యాజమాన్య పద్ధతులు అవసరం. రీసైక్లింగ్ చేసిన నీటిని ఉద్యానవనాలకు, పరిశ్రమలకు వాడటం ద్వారా తాగునీటిపై ఒత్తిడి తగ్గించవచ్చు. పాలకుల చిత్తశుద్ధి, ప్రజల సహకారం తోడైతేనే 'విశ్వనగరం'గా ఎదిగే క్రమంలో హైదరాబాద్ తన దాహాన్ని తీర్చుకోగలదు. మన చేతుల్లో ఉన్న నీటి చుక్కను కాపాడుకుంటేనే, రేపటి తరం సురక్షితంగా ఉంటుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
హైదరాబాద్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
స్టేజి పైన డాన్స్ ఇరగదీసిన మల్లా రెడ్డి కోడలు Malla Reddy Daughter-In-Law Preethi Reddy MASS Dance
Recommended image2
Now Playing
NTR Trust 5K Run:ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5కెరన్ నారా భువనేశ్వరి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu
Recommended image3
Parking Rules: రోడ్డుపై బండి పార్క్ చేస్తే ఇక అమ్మేస్తారు జాగ్రత్త.. తెలంగాణలో కొత్త పార్కింగ్ రూల్స్!
Related Stories
Recommended image1
హైదరాబాద్ కు 50 కి.మీ దూరంలో మరో కూకట్ పల్లి.. ఇక్కడ రూ.40-50 లక్షలకే ఇండిపెండెంట్ హౌస్, భవిష్యత్ లో అయితే కోట్లు..!
Recommended image2
New Income Tax Rules : హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఏప్రిల్ 1 నుంచి ఇవి మారబోతున్నాయి !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved