MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Real Estate : రూ.177 కోట్ల ధర పలికిన ఎకరం భూమి.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్

Real Estate : రూ.177 కోట్ల ధర పలికిన ఎకరం భూమి.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్

Hyderabad Real Estate: హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతోంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం భూమి ఏకంగా రూ.177 కోట్లు పలికింది. 7.67 ఎకరాల భూమిని MSN రియాల్టీ రికార్డు ధరకు సొంతం చేసుకుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 06 2025, 08:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Hyderabad Real Estate: రికార్డుల మోత మోగిస్తున్న భూముల ధరలు
Image Credit : AI Photo/Google Gemini

Hyderabad Real Estate: రికార్డుల మోత మోగిస్తున్న భూముల ధరలు

తెలంగాణలో భూములు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమీపంలో భూముల ధరలు కొత్త రికార్డులు నమోదుచేస్తున్నాయి. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూములను ప్రభుత్వం వేలం వేసింది. ఇక్కడ రికార్డు స్థాయికి ధరలు చేరాయి.

టీజీఐఐసీ (TGIIC) నిర్వహించిన ఈ వేలంలో ఎకరం భూమి విలువ రూ.177 కోట్లుగా పలకడం విశేషం. ఇది దక్షిణ భారతదేశంలో ఎప్పుడూ లేని అత్యధిక ధర కావడం గమనార్హం. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ భూముల ధరలు చర్చనీయాంశంగా మారాయి. మొత్తం 7.67 ఎకరాల భూమిని ఎంఎస్ఎన్ (MSN) రియాల్టీ సంస్థ 1,357 కోట్ల రూపాయల రికార్డు ధరకు కొనుగోలు చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
టీజీఐఐసీ భూముల వేలం ఎలా సాగిందంటే?
Image Credit : AI Photo/Google Gemini

టీజీఐఐసీ భూముల వేలం ఎలా సాగిందంటే?

వేలం ప్రారంభంలో టీజీఐఐసీ ఎకరాకు రూ.101 కోట్ల ప్రారంభ ధరను ప్రకటించింది. 18.67 ఎకరాలను రెండు పార్సెల్లుగా విభజించి, 11 ఎకరాలను ఒక భాగంగా, 7.67 ఎకరాలను మరొక భాగంగా వేలంలో పెట్టారు. ఈ వేలంలో గోద్రెజ్, సత్వా, హెటిరో, బ్రిగేడ్, మెయిల్, ఫ్రస్టేజ్ వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొన్నాయి. చివరికి ఎంఎస్ఎన్ రియాల్టీ 7.67 ఎకరాలను రికార్డు బిడ్ తో కొనుగోలు చేసింది.

34
హైదరాబాద్ భూములు రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాయి !
Image Credit : AI Photo/Google Gemini

హైదరాబాద్ భూములు రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాయి !

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో భూముల ధరలు రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నాయి. గతంలో కోకాపేట నియోపోలిస్‌లో ఒక్క ఎకరం భూమి రూ.100.75 కోట్ల రికార్డు ధర పలికింది. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. అయితే, ఇప్పుడు రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలం ఆ రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించింది. ఎఎస్ఎన్ రియాల్టీ దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ధరకు భూములను కొనుగోలు చేసిన సంస్థగా నిలిచింది.

44
లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్ ఎంఎస్ఎన్ రియాల్టీ
Image Credit : AI Photo/Google Gemini

లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్ ఎంఎస్ఎన్ రియాల్టీ

ఎంఎస్ఎన్ రియాల్టీ హైదరాబాద్‌లో లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసే ప్రముఖ సంస్థగా కొనసాగుతోంది. ఇది ఎంఎస్ఎన్ గ్రూప్ నుంచి 2024లో స్థాపించారు. నాణ్యత, డిజైన్, సుస్థిరతపై దృష్టి పెట్టి హై-ఎండ్ అపార్ట్‌మెంట్లను నిర్మించడం కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వన్ బై MSN ప్రాజెక్ట్ నియోపోలిస్‌లో వారి ఫస్ట్ అల్ట్రా లగ్జరీ రెసిడెన్స్ ప్రాజెక్ట్. ఇందులో విశాలమైన అపార్ట్‌మెంట్లు, ప్రీమియం సౌకర్యాలు, కమ్యూనిటీ హాస్పిటాలిటీ అందుబాటులో ఉంటాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
స్థిరాస్తి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
School Holidays : మరో నాల్రోజులే స్కూళ్ళు నడిచేది... మళ్లీ వరుస సెలవులు వస్తున్నాయ్
Recommended image2
Rain Alert : తుఫాను బీభత్సం.. ఇక్కడ అల్లకల్లోలం, భారీ వానలతో చిగురుటాకుల్లా వణికిపోతున్న ప్రాంతాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved