Hyderabad Rain : ఏంటీ కుండపోత వర్షం... నగరంలో క్లౌడ్ బరస్ట్ జరుగుతోందా?
Rain Alert : హైదరాబాద్ లో అత్యంత భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలుప్రాంతాల్లో 100 సెంటిమీటర్లకు పైనే వర్షం కురిసినట్లు తెలుస్తోంది. దీంతో క్లౌడ్ బరస్ట్ ఏమైనా జరుగుతోందా? అన్న ఆందోళన మొదలయ్యింది.

హైదరాబాద్ లో కుండపోత వర్షం
Hyderabad Rains : రాజధాని నగరం హైదరాబాద్ లో ఒక్కసారిగా కుండపోత వర్షం మొదలయ్యింది. గురువారం ఉదయంనుండి ఉక్కపోత వాతావరణం ఉండగా సాయంత్రం సడన్ గా వర్షం మొదలయ్యింది. ఒక్కసారిగా ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా వర్షం కురవడంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. సరిగ్గా కార్యాలయాల నుండి ఉద్యోగులు ఇళ్లకు బయలుదేరే సమయంలో వర్షం మొదలవడంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్స్ మొదలయ్యాయి.
KNOW
హైదరాబాద్ ప్రజలారా.. బయటకు రాకండి
కుండపోత వర్షానికి ఈదురుగాలులు తోడయ్యాయి. దీంతో రోడ్లపైకి మోకాల్లోతు నీరు చేరడమే కాదు చెట్లకొమ్మలు విరిగిపడి ట్రాఫిక్ కు అంతరాయంగా మారాయి. అలాగే హోర్డింగ్స్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే పోలీసులు, జిహెచ్ఎంసి, హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా వర్షం దంచికొడుతుండటంతో ప్రజలు బయటకు రావద్దని... ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాదులో పెనుగాలులతో కుండపోత వర్షం
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, హిమాయత్‌నగర్, లక్డీకపూల్, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం.#Hyderabad#Rainspic.twitter.com/ssN8ZDIaf6— Sarita Avula (@SaritaAvula) August 7, 2025
ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్
నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్ పల్లి, హిమాయత్‌నగర్, లక్డీకపూల్, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, మాదాపూర్, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్, ఏఎంబీ, ఇనార్బిల్ మాల్, రాయదుర్గం, హైటెక్‌సిటీలో ప్రాంతాల్లో భారీ వర్షం ధాటికి రోడ్లపైకి నీరు చేరాయి... దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనదారులు వర్షంలో తడుస్తూనే ట్రాఫిక్ లో చిక్కుకుని తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
CLOUDBURST WARNING FOR HYDERABAD CITY ⚠️⛈️
My hands are shivering while I type this message. Few parts of Hyderabad City to get 80-100mm rains in 1hour, close to CLOUBURST INTENSITY. Please please STAY SAFE 🙏— Telangana Weatherman (@balaji25_t) August 7, 2025
క్లౌడ్ బరస్ట్ జరుగుతోందా?
నగరంలోని కొన్నిప్రాంతాల్లో 80 నుండి 100 మిల్లిమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ సూచనల అందించే తెలంగాణ వెదర్ మ్యాన్ ఎక్స్ వేదికన ప్రకటించారు. ఈ వర్షం కొనసాగే అవకాశం ఉందని... క్లౌడ్ బరస్ట్ పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. కాబట్టి ప్రజలు ఇళ్లనుండి బయటకు రావద్దని... జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చెరువులు, కాలువలు, నీటి ప్రవాహాల సమీపంలోని కాలనీవాసులు మరింత జాగ్రత్తగా ఉండాలని... ఈ భారీ వర్షం ధాటికి ప్లాష్ ప్లడ్స్ కు అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
FLASH FLOOD WARNING FOR HYDERABAD ⚠️⛈️
Since Hyderabad is having a CLOUBURST, lakes can suddenly get flooded. It's going to be extremely serious situation for Hyderabad next few hours. Prayers for everyone 🙏⚠️🙏🙏🙏🙏🙏🙏— Telangana Weatherman (@balaji25_t) August 7, 2025
వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హైడ్రా కమిషనర్‌కి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు… ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులంతా అప్రమత్తంగా ఉండాలని.... విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. హైదరాబాద్ లో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని... ప్రమాదకర పరిస్థితులంటే వెంటనే ప్రజలకు సహాయం అందించాలని సూచించారు.
అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
రానున్న రెండురోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని… తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
#HYDTPinfo#RainAlert
Due to a sudden downpour of #HeavyRainfall, water over flowing at Shaikpet Bridge ramp. @shotr_tlchowki in coordination with HYDRAA, clearing the obstruction and regulating the traffic. #HyderabadRains#MonsoonSeason2025#MonsoonSeason#TrafficUpdatepic.twitter.com/h0JcmCc4Kb— Hyderabad Traffic Police (@HYDTP) August 7, 2025