హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అలర్ట్.. ఆ రూట్‌లో అరగంట ఆలస్యంగా సర్వీసులు..
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అలర్ట్. హైదరాబాద్ మెట్రో కారిడార్ - 2 ( జూబ్లీ బస్ స్టేషన్- మహాత్మా గాంధీ బస్ స్టేషన్)లో రైళ్ల వేళల్లో తాత్కాలికంగా స్వల్ప మార్పులు చేసినట్టుగా ఎల్ అండ్ టీ అధికారులు ప్రకటించారు.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అలర్ట్. హైదరాబాద్ మెట్రో కారిడార్ - 2 ( జూబ్లీ బస్ స్టేషన్- మహాత్మా గాంధీ బస్ స్టేషన్)లో రైళ్ల వేళల్లో తాత్కాలికంగా స్వల్ప మార్పులు చేసినట్టుగా ఎల్ అండ్ టీ అధికారులు ప్రకటించారు. జీహెచ్ఎంసీ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రూట్‌లో ఉదయం సర్వీసులు అరగంటల ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం నగరంలో మెట్రో రైలు సేవలు ఉదయం 6 గంటలకు ప్రారంభం అవుతుండగా.. ఈ మార్గంలో మెట్రో రైళ్లు 6.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. జూన్ 30 నుండి జూలై 16 వరకు ఈ సవరించిన షెడ్యూల్ కొనసాగనుంది.
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో మెట్రో కారిడార్‌ను దాటే ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా ఈ మార్గంలో మెట్రో సర్వీసులు షెడ్యూల్‌ను సవరించారు. ఈ మేరకు ఎల్ అండ్ టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ కారిడార్‌లో ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సవరించిన షెడ్యూల్ దాదాపు రెండు వారాల పాటు అమలులో ఉంటుందని పేర్కొంది. అయితే మిగిలిన రూట్స్‌లో ఎలాంటి మార్పులు ఉండటం లేదు.