హైదరాబాద్ లో ఈ ఏరియాల పేర్లు సేమ్ టు సేమ్ ... వింటే మీరూ కన్ఫ్యూజ్ అవడం ఖాయం
హైదరాబాద్ మహానగరంలో కొన్ని ఏరియాలు, కాలనీల పేర్లు ఒకేలా ఉండి చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. అలాంటి పేర్లేమిటో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్ లో పేర్ల కన్ఫ్యూజన్
Hyderabad : దేశంలోని అతిపెద్ద నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇది కేవలం తెలుగు ప్రజలకే కాదు దేశంలోని అన్నిరాష్ట్రాలవారికి ఈ మెట్రో సిటీ ఆతిథ్యం ఇస్తోంది. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్ ను ఆశ్రయించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది... దీంతో నగరం వేగంగా విస్తరిస్తూ కొత్తకొత్త కాలనీలు పుట్టుకువస్తున్నాయి. ఇప్పటికే నగరంలో ఒకేపేరుతో వెలిసిన కాలనీలు కొత్తగా వచ్చేవారినే కాదు ఏళ్ళుగా ఇక్కడే జీవిస్తున్నవారికి కన్ఫ్యూజ్ చేస్తున్నాయి... ఇప్పుడు ఈ కొత్త కాలనీలతో మరింత గందరగోళం ఏర్పడుతోంది.
హైదరాబాద్ లో ఇప్పటికే ఒకేపేరుతో రెండుమూడు ప్రాంతాలున్నాయి. అంతేకాదు కొద్ది తేడాతో ఒకేలా వుండే మరికొన్ని ఏరియాల పేర్లు ఉన్నాయి. ఇలాంటి ఏరియాల గురించి తెలుసుకోవడం ద్వారా కొంత కన్ఫ్యూజన్ తగ్గుతుంది. కాబట్టి హైదరాబాద్ లో ఒకేలా వుండే ఏరియాల పేర్లను ఇక్కడ తెలుసుకుందాం.
KNOW
హైదరాబాద్ లో ఒకేలా ఉండే ఏరియాలు
ఒకప్పుడు హైదరాబాద్ అంటే మూసి నది పరివాహక ప్రాంతమే. కానీ కాలక్రమేనా ఇది మహానగరంగా విస్తరించింది. తెలంగాణలోని 25 శాతం జనాభా (కోటిమందికి పైగా) కేవలం ఈ ఒక్క నగరంలోనే ఉంటున్నారంటే ఎంతపెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఇలా వేగంగా విస్తరించిన నగరంలో ఒకే పేరుతో కొన్ని ఏరియాలు, కాలనీలు వెలిసాయి.
హైదరాబాద్ లో ఈ ప్రాంతాల పేర్లు సేమ్ టు సేమ్
హైదరాబాద్ లో అమీర్ పేట అంటే తెలియనివారు ఉండరు... ఇదే పేరును పోలిన మీర్ ఖాన్ పేట్ కూడా నగరంలో ఉంది. ఇక దిల్ సుఖ్ నగర్ - దిల్ ఖుష్ నగర్, హయత్ నగర్ - హిమాయత్ నగర్, ప్రతాపసింగారం - బాటసింగారం, తుర్కయాంజాల్ - దేవరయాంజాల్, ఉప్పల్ - బోడుప్పల్, అంబర్ పేట - పెద్ద అంబర్ పేట్, హైదర్ నగర్ - హైదర్ గూడ పేర్లు కూడా కన్ఫ్యూజ్ చేస్తుంటాయి.
కొత్తపేట-కొత్తూరు, గడ్డి అన్నారం - తట్టి అన్నారం, లింగంపల్లి - బాగ్ లింగంపల్లి, నాంపల్లి - రాంపల్లి, ఆకులమైలారం - దండుమైలారం, శంకర్ పల్లి - శంకరంపేట్, చింతల్ - చింతల్ బస్తీ, ఉప్పుగూడ - ఉప్పరిగూడ ఏరియాల పేర్లు కూడా ఒకేలా ఉన్నాయి. మూసారాంబాగ్ - ముషీరాబాద్, గాజుల రామారం - బొమ్మల రామారం, బహదూర్ పురా - బహదూర్ పల్లి, బాలానగర్ - బాలాపూర్, బోయిన్ పల్లి - బోయిగూడ, చిలకానగర్ - చిలకలగూడ కూడా ఒకేలా ఉండే ఏరియాలు.
హైదరాబాద్ లో ఒకే పేరుతో రెండుమూడు ఏరియాలు
హైదరాబాద్ కోఠి పేరు తెలియనివారు ఉండరు. కానీ ఈ ప్రాంతానికి సమీపంలోనే కింగ్ కోఠి, రామ్ కోఠి ఏరియాలు ఉంటాయి. ఇక బండ్లగూడలు కూడా మూడు ఉన్నాయి. బేగంబజార్ - బేగంపేట్, రామ్ నగర్ - రామంతాపూర్, బొల్లారం - మచ్చబొల్లారం పేర్లు కూడా ఒకేలా ఉంటాయి.
ఇక హైదరాబాద్ లోని కొన్ని ఏరియాల పేర్లతో తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలున్నాయి. సంగారెడ్డిలో మల్లేపల్లి, కొండాపూర్ ఉన్నాయి... ఇవేపేర్లతో హైదరాబాద్ లో ప్రముఖ ఏరియాలున్నాయి. ఇలా పేర్లతో కన్ఫ్యూజ్ చేసే ఏరియాలు అనేకం ఉన్నాయి.
హైటెక్ సిటీ - ఫ్యూచర్ సిటీ
ఇప్పటికే హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఉంది... ఇప్పుడు రేవంత్ సర్కార్ ప్యూచర్ సిటీని నిర్మిస్తామంటోంది. ఈ పేరు ఇలాగే కొనసాగితే ఈ రెండింటిమధ్య కన్ఫ్యూజన్ ఏర్పడవచ్చు. ఇక గాంధీనగర్, అంబేద్కర్ నగర్ వంటిపేర్లతో ఉండే ఏరియాలు, కాలనీలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.