MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Telangana
  • TG20 Champions Hyderabad: టీజీ20 ఛాంపియన్ గా హైదరాబాద్‌.. హీరోలు వీరే

TG20 Champions Hyderabad: టీజీ20 ఛాంపియన్ గా హైదరాబాద్‌.. హీరోలు వీరే

TG20 Champions Hyderabad: ఉప్పల్‌ లో జరిగిన టీజీ20 గ్రాండ్ ఫైనల్‌లో ఖమ్మం ఏసెస్‌పై హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ ఘన విజయం సాధించి రూ.1 కోటి మెగా ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విక్టరీలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 13 2026, 01:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉప్పల్‌లో నెక్ట్స్ లెవెల్ ఫైట్.. కప్పు కొట్టిన హైదరాబాద్!
Image Credit : X/tg_governor

ఉప్పల్‌లో నెక్ట్స్ లెవెల్ ఫైట్.. కప్పు కొట్టిన హైదరాబాద్!

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఊహించని రేంజ్‌లో ప్లాన్ చేసిన సరికొత్త ‘టీజీ20’ లీగ్ మొదటి సీజన్ ముగిసింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన గ్రాండ్ ఫైనల్‌ పోరు నెక్ట్స్ లెవెల్‌లో సాగింది. టైటిల్ కోసం జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో అన్విత ఖమ్మం ఏసెస్ జట్టుపై హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ అదిరిపోయే విక్టరీ కొట్టింది. మెగా ట్రోఫీతో పాటు ఏకంగా రూ. 1 కోటి ప్రైజ్ మనీని హైదరాబాద్ టీమ్ తన అకౌంట్‌లో వేసుకుంది.

రన్నరప్ ఖమ్మం టీమ్‌కు రూ. 50 లక్షలు దక్కగా, 3వ, 4వ స్థానాల్లో నిలిచిన కరీంనగర్, రంగారెడ్డి జట్లకు చెరో రూ. 25 లక్షల ప్రైజ్ మనీ లభించింది. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈవెంట్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, హెచ్సీఏ సెక్రటరి జీవన్ రెడ్డి పాల్గొని ప్లేయర్లను అభినందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఖమ్మం భారీ స్కోరుకు బ్రేకులు.. హైదరాబాద్ బౌలర్ల మాస్ ప్లాన్
Image Credit : X/icsindiacricket

ఖమ్మం భారీ స్కోరుకు బ్రేకులు.. హైదరాబాద్ బౌలర్ల మాస్ ప్లాన్

టాస్ గెలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ కెప్టెన్ ఏమాత్రం ఆలోచించకుండా మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం ఏసెస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఖమ్మం టీమ్‌లో స్టార్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ మరోసారి సింహంలా సింగిల్‌గా పోరాడాడు. కేవలం 39 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో విరుచుకుపడి 65 పరుగులు చేశాడు. కొడిమల హిమతేజ (31 పరుగులు) తో కలిసి మికిల్ జైస్వాల్ నాలుగో వికెట్‌కు 94 పరుగుల సూపర్ పార్ట్‌నర్‌షిప్‌ను బిల్డ్ చేశాడు.

ఒక దశలో ఖమ్మం 180 ప్లస్ స్కోరు చేసేలా కనిపించినా.. హైదరాబాద్ బౌలర్ యశ్వీర్ గౌడ్ (3/17) తన మైండ్ బ్లోయింగ్ బౌలింగ్‌తో బ్రేకులు వేశాడు. అతనికి తోడుగా దేవ్ మెహతా (2/25), అజయ్ దేవ్ గౌడ్ (2/36) కూడా క్రూషియల్ వికెట్లు తీసి ఖమ్మంను 157 పరుగులకే లాక్ చేసేశారు.

35
కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్.. అభిరథ్ రెడ్డి ఆరెంజ్ క్యాప్ రికార్డ్
Image Credit : X/tg_governor

కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్.. అభిరథ్ రెడ్డి ఆరెంజ్ క్యాప్ రికార్డ్

158 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ టీమ్ ఎక్కడా టెన్షన్ పడకుండా, చాలా కూల్‌గా గేమ్ ప్లాన్ అమలు చేసింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి 48 పరుగులతో టీమ్‌కు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. ఈ టోర్నీలో అభిరథ్ రెడ్డి పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఒక దశలో క్రికెట్‌లో ఛాన్స్‌లు రాక అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకున్న అభిరథ్, ఈ లీగ్‌లో కెప్టెన్‌గా మారి టీమ్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. రంజీ ఎక్స్‌పీరియన్స్‌తో బౌలర్లను వాడుకున్న తీరు అద్భుతం. ఈ టోర్నీలో మొత్తం 4 హాఫ్ సెంచరీలు, ఒక అన్‌బీటెన్ సెంచరీ (101 నాటౌట్) తో 549 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ లీగ్‌లోనే హయ్యెస్ట్ ఫోర్లు (58), సిక్సర్లు (33) కొట్టిన రికార్డ్ కూడా అతనిదే.

45
మూడు క్యాచ్‌లు డ్రాప్.. ఖమ్మం కొంపముంచిన బ్లండర్స్
Image Credit : X/tg20official

మూడు క్యాచ్‌లు డ్రాప్.. ఖమ్మం కొంపముంచిన బ్లండర్స్

ఖమ్మం బౌలర్లు మ్యాచ్‌ను ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని తెగ ట్రై చేశారు. వేదరెడ్డి తన నాలుగు ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసి కట్టడి చేశాడు. కానీ, మ్యాచ్ స్టార్టింగ్‌లోనే ఖమ్మం ఫీల్డర్లు చేసిన మూడు క్యాచ్ డ్రాప్స్ ఆ జట్టు విజయావకాశాలను పూర్తిగా దెబ్బతీశాయి. లక్ కూడా తోడవడంతో హైదరాబాద్ బ్యాటర్లు షణ్ముఖ అశ్విన్ (36 పరుగులు), వైష్ణవ రెడ్డి (41 పరుగులు) పట్టుదలగా ఆడి టీమ్‌ను విక్టరీ లైన్ దాటించారు. హైదరాబాద్ టీమ్ కేవలం 17.3 ఓవర్లలోనే 158 పరుగుల టార్గెట్‌ను ఈజీగా ఛేజ్ చేసి కప్పును ముద్దాడింది.

55
పర్పుల్ క్యాప్ అజయ్ సొంతం.. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన యంగ్ స్టార్స్
Image Credit : X/tg20official

పర్పుల్ క్యాప్ అజయ్ సొంతం.. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన యంగ్ స్టార్స్

హైదరాబాద్ టీమ్ విక్టరీ వెనుక చాలా మంది అన్‌సంగ్ హీరోలు ఉన్నారు. బౌలింగ్‌లో అజయ్‌దేవ్‌ గౌడ్‌ ఏకంగా 21 వికెట్లు తీసి 'పర్పుల్ క్యాప్' విన్నర్‌గా నిలిచాడు. ఖమ్మం బౌలర్ వేద్ రెడ్డి (15 వికెట్లు) కంటే చాలా ఎక్కువ వికెట్లతో అజయ్ టాప్‌లో నిలిచాడు. అజయ్‌కు వాళ్ల నాన్నే కోచ్ కావడం విశేషం.

ఇక స్పిన్ ట్విన్స్ ప్రణవ్ వర్మ (12 వికెట్లు), షణ్ముఖ అశ్విన్ (10 వికెట్లు) పవర్‌ప్లేలోనే ప్రత్యర్థులను తిప్పేశారు. బ్యాటింగ్‌లో వైష్ణవ్ రెడ్డి ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో 195 పరుగులు చేసి, ఆరు సార్లూ నాటౌట్‌గా నిలిచి మిస్టర్ డిపెండబుల్ అనిపించుకున్నాడు. ఇండియా అండర్-19 ప్లేయర్ యశ్వీర్ గౌడ్ (5 వికెట్లు, 42 పరుగులు), అఖిల్ రాథోడ్ (8 వికెట్లు) కూడా తమ వంతు సపోర్ట్ ఇచ్చారు. మరో ఓపెనర్ సాయివికాస్ రెడ్డి (296 పరుగులు) క్వాలిఫయర్-1లో 27 బంతుల్లోనే 69 రన్స్ కొట్టి విధ్వంసం సృష్టించాడు. ఇలా అందరూ కలిసి కష్టపడ్డారు కాబట్టే.. హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ టీజీ20 బాద్‌షాలుగా నిలిచారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
క్రీడలు
క్రికెట్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: 3 రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
Recommended image2
ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
Recommended image3
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే
Related Stories
Recommended image1
Most Beautiful Football Stadiums: ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఫుట్‌బాల్ స్టేడియాలు ఇవే.. ఆఖరిదైతే నెక్స్ట్ లెవెల్ అంతే !
Recommended image2
Vaibhav Suryavanshi: ఇంగ్లండ్‌ టూర్‌లో వైభవ్ సూర్యవంశీ ఎందుకు ఫ్లాప్ అయ్యాడు? ఆ 67 సెంచరీల లెజెండ్ ఏమన్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved