MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Vaibhav Suryavanshi: ఇంగ్లండ్‌ టూర్‌లో వైభవ్ సూర్యవంశీ ఎందుకు ఫ్లాప్ అయ్యాడు? ఆ 67 సెంచరీల లెజెండ్ ఏమన్నారంటే?

Vaibhav Suryavanshi: ఇంగ్లండ్‌ టూర్‌లో వైభవ్ సూర్యవంశీ ఎందుకు ఫ్లాప్ అయ్యాడు? ఆ 67 సెంచరీల లెజెండ్ ఏమన్నారంటే?

Vaibhav Suryavanshi: ఐపీఎల్ లో దుమ్మురేపే ఆటతో ప్రపంచ క్రికెట్ టో వైభవ్ సూర్యవంశీ సంచలనం రేపాడు. ఆ తర్వాత టీమిండియా లో కూడా చోటు దక్కింది. అయితే, ఇంగ్లండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. దీనిపై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 13 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వైభవ్ సూర్యవంశీ ఫ్లాప్ షో.. సీక్రెట్ బద్దలు కొట్టిన టీమ్ ఇండియా మాజీ ఓపనర్
Image Credit : stockPhoto

వైభవ్ సూర్యవంశీ ఫ్లాప్ షో.. సీక్రెట్ బద్దలు కొట్టిన టీమ్ ఇండియా మాజీ ఓపనర్

భారత క్రికెట్‌లో మోస్ట్ టాలెంటెడ్ ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లండ్ పర్యటన అస్సలు కలిసి రాలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో ఈ యంగ్ బ్యాటర్ దారుణంగా ఫ్లాప్ అయ్యాడు. ఈ సిరీస్‌లో వరుసగా అవకాశాలు వచ్చినా వాటిని వైభవ్ ఉపయోగించుకోలేకపోయాడు. దీంతో ఐదో మ్యాచ్‌లో అతడిని పక్కన పెట్టాల్సి వచ్చింది. అసలు ఇంత హైప్ ఉన్న ప్లేయర్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు? దీని వెనుక ఉన్న కారణాలను డొమెస్టిక్ క్రికెట్‌లో ఏకంగా 67 సెంచరీలు బాదిన టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఓపెన్‌గా మాట్లాడారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మూడు మ్యాచ్‌ల్లోనూ నిరాశే
Image Credit : Getty

మూడు మ్యాచ్‌ల్లోనూ నిరాశే

ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి రెండో, మూడో, నాలుగో మ్యాచ్‌ల్లో ఆడే ఛాన్స్ దక్కింది. కానీ, ఇంగ్లండ్ పిచ్‌లపై మనోడు అస్సలు నిలదొక్కుకోలేకపోయాడు. మాంచెస్టర్, నాటింగ్‌హామ్, బ్రిస్టల్‌లో జరిగిన మ్యాచ్‌లలో వైభవ్ వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. పవర్‌ప్లేలో భారీ హిట్టింగ్ చేయాల్సిన ఓపెనర్ ఇలా వరుసగా ఫెయిల్ అవ్వడంతో.. సౌతాంప్టన్‌లో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్‌లో వైభవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి డ్రాప్ చేశారు. అతడి ప్లేస్‌లో సంజూ శాంసన్‌కు టీమ్‌లో చోటు ఇచ్చారు.

Related Articles

Related image1
India T20 Squad: సూర్య ఈజ్ బ్యాక్.. ఆర్‌సీబీ ఛాంపియన్ కెప్టెన్‌కు వైస్ కెప్టెన్ పదవి.. మైండ్ బ్లోయింగ్ ఇండియన్ టీమ్
Related image2
Earthquake: విశాఖను వణికించిన భూకంపం.. ఏపీ, తెలంగాణలో ఏయే ప్రాంతాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి?
36
సెలక్టర్లు తొందరపడ్డారు: వసీం జాఫర్
Image Credit : vaibhav sooryavanshi instagram

సెలక్టర్లు తొందరపడ్డారు: వసీం జాఫర్

వైభవ్ సూర్యవంశీ ఫ్లాప్ అవ్వడంపై వసీం జాఫర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వైభవ్‌ను టీమ్‌లోకి తీసుకోవడంలో సెలక్టర్లు చాలా తొందరపడ్డారని జాఫర్ అన్నాడు. "మీడియాలో వైభవ్ గురించి విపరీతమైన చర్చ నడిచింది. అతడి ఆటను చూడటానికి అభిమానులు కూడా బాగా ఎగ్జైట్ అయ్యారు. కానీ, నా ఉద్దేశంలో వైభవ్‌ను తీసుకురావడంలో మనం కాస్త తొందరపడ్డాం. నిజానికి నేను మొదటి నుంచి చెప్తున్నట్లే.. ఐదు మ్యాచ్‌ల్లోనూ సంజూ శాంసన్‌తోనే ముందుకు వెళ్లాల్సింది" అని జాఫర్ చెప్పుకొచ్చాడు.

46
మీడియా హైప్‌లో కొట్టుకుపోయాం
Image Credit : X/@InqalabNewsIN

మీడియా హైప్‌లో కొట్టుకుపోయాం

యంగ్ ప్లేయర్లకు ఛాన్సులు ఇచ్చేటప్పుడు కాస్త టైమ్ ఇవ్వాలని జాఫర్ సూచించాడు. "నేనైతే టీమ్ కాంబినేషన్‌ను అస్సలు మార్చేవాడిని కాదు. వైభవ్ తన టైమ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది. ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని వాడుకోవాల్సింది. అతను ఇంకా చాలా చిన్న పిల్లాడు. టీమ్‌తో కలిసి ట్రావెల్ చేస్తూ, బయట కూర్చుని మ్యాచ్‌లు చూస్తూ కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కానీ, మనం మీడియా హైప్‌లో కొట్టుకుపోయినట్లు అనిపించింది. వైభవ్ ఆడనప్పుడల్లా బయట గట్టిగా చర్చ జరిగేది. ఒకవేళ సంజూ ఫామ్‌లో లేడు అని మీకు పక్కాగా అనిపిస్తేనే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ, వైభవ్‌ను తొందరగా టీమ్‌లోకి తెచ్చేశారనేది నా ఫీలింగ్" అని జాఫర్ విమర్శించాడు.

56
జింబాబ్వే టూర్‌కు సంజూ దూరం
Image Credit : Instagram/vaibhav_sooryavanshi09

జింబాబ్వే టూర్‌కు సంజూ దూరం

ఇంగ్లండ్ సిరీస్ ముగిసిన తర్వాత భారత్ జూలై 23 నుంచి జింబాబ్వేలో పర్యటించనుంది. హరారే లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ మళ్లీ యాక్షన్‌లోకి రానున్నాడు. అయితే, జింబాబ్వే టూర్‌కు సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై వసీం జాఫర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సంజూ శాంసన్‌కు ఇంగ్లండ్ సిరీస్‌లో తక్కువ ఛాన్సులు ఇవ్వడమే కాకుండా, నెక్స్ట్ సిరీస్ నుంచి పక్కన పెట్టడం ఏంటని ప్రశ్నించాడు. ప్రస్తుతం సంజూ భారత్ తరఫున కేవలం టీ20 ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడని, అలాంటప్పుడు అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

66
వరల్డ్ కప్ ప్లాన్స్‌లో సంజూ ఉంటాడా?
Image Credit : Getty

వరల్డ్ కప్ ప్లాన్స్‌లో సంజూ ఉంటాడా?

"వైభవ్‌కు మూడు మ్యాచ్‌లు ఇచ్చి, ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్‌లో మళ్లీ సంజూ శాంసన్‌ను పిలిచారు. సంజూ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. కట్ చేస్తే.. ఇప్పుడు జింబాబ్వే సిరీస్ నుంచి అతడిని తీసేశారు. ఇది నాకు చాలా వింతగా అనిపించింది. ఎందుకంటే సంజూ కచ్చితంగా ఆడాలని అనుకుని ఉంటాడు. అతను ఎలాగూ ఒకే ఫార్మాట్ ఆడుతున్నాడు కాబట్టి అతనికి వరుసగా అవకాశాలు ఇవ్వాలి. సంజూ శాంసన్ ఒక పక్కా మ్యాచ్ విన్నర్. నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ ప్లాన్స్‌లో అతను కచ్చితంగా ఉంటాడని నేను నమ్ముతున్నాను. కానీ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నన్ను నిజంగా షాక్‌కు గురిచేశాయి" అని వసీం జాఫర్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
India T20 Squad: సూర్య ఈజ్ బ్యాక్.. ఆర్‌సీబీ ఛాంపియన్ కెప్టెన్‌కు వైస్ కెప్టెన్ పదవి.. మైండ్ బ్లోయింగ్ ఇండియన్ టీమ్
Recommended image2
Team India: ఇంగ్లాండ్ లో టీమిండియా అట్టర్ ప్లాప్.. భారత్ ఓటమికి మెయిన్ రీజన్స్ ఇవే
Recommended image3
Team india: కెప్టెన్ శ్రేయస్‌కు తిక్క రేగింది.. టీమిండియా వరుస ఓటములపై లైవ్‌లోనే సీరియస్
Related Stories
Recommended image1
India T20 Squad: సూర్య ఈజ్ బ్యాక్.. ఆర్‌సీబీ ఛాంపియన్ కెప్టెన్‌కు వైస్ కెప్టెన్ పదవి.. మైండ్ బ్లోయింగ్ ఇండియన్ టీమ్
Recommended image2
Earthquake: విశాఖను వణికించిన భూకంపం.. ఏపీ, తెలంగాణలో ఏయే ప్రాంతాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved