Heavy Rains: దంచికొడుతున్న వానలు.. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్
Heavy rains: భారీ వర్షాల కారణంగా హిమాయత్‌సాగర్ నీటిమట్టం పెరిగింది. దీంతో మూసీ నదిలోకి నీటి విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే అధికారులు పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు చేశారు.

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం
హైదరాబాద్ నగరాన్ని ప్రస్తుతం భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొన్ని గంటలుగా కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. ముఖ్యంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడం నగర వాసులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది.
Near yousufguda pic.twitter.com/OpSevvUwVZ
— shankar ram (@shankarram63449) August 7, 2025
KNOW
హిమాయత్‌సాగర్ - ఉస్మాన్‌సాగర్ కు భారీ వరద నీరు
హైదరాబాద్‌కు నీటి మూలాధారంగా ఉన్న హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలు ఇప్పటికే నిండుకుండలాగా మారాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఈ రెండు జలాశయాల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది.
హిమాయత్‌సాగర్‌కు వరద ప్రవాహం పెరగడంతో, అధికారులు జల నిల్వను నియంత్రించేందుకు గేట్లు ఎత్తే నిర్ణయం తీసుకున్నారు. ఒక గేటును అడుగు మేర పైకి లేపి, మిగిలిన నీటిని మూసీ నదిలోకి విడుదల చేయనున్నారు.
#HyderabadRoads After Rains@balaji25_t@Hyderabadrains#kushaiguda#telanaganapic.twitter.com/1ehNegGsSv
— Vuppala Pranay (@pranay_vuppala) August 7, 2025
మూసీ పరివాహక ప్రాంతాలకు జీహెచ్ఎంసీ అలర్ట్
హిమాయత్‌సాగర్ గేట్లు తెరచి నీటి విడుదల జరిగే సమయంలో, మూసీ నదిలో నీటి ప్రవాహం గణనీయంగా పెరగనుంది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తత జారీ చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే 040-21111111 నంబర్‌కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు. వరద నీరు రోడ్ల మీదికి రావడం, లోతట్టు ప్రాంతాల్లోకి చేరే అవకాశం ఉన్నందున, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సహాయ చర్యలకు సిద్ధంగా అధికార యంత్రాంగం
హిమాయత్‌సాగర్ నుంచి నీటి విడుదల నేపథ్యంలో హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల రెవెన్యూ, GHMC, హైడ్రా పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. వరద పరిస్థితులను అంచనా వేస్తూ తక్షణ చర్యలు చేపట్టేలా యంత్రాంగం సిద్ధంగా ఉంది.
ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎటువంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే స్పందించేందుకు రెస్క్యూ టీంలు సిద్ధంగా ఉన్నాయి.
రానున్న గంటల్లో మళ్ళీ వర్షం.. రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్
ఇదిలా ఉండగా, వాతావరణశాఖ ప్రకారం రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు నల్గొండ, యాదాద్రి, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. గురువారం రాత్రి తర్వాత మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైనప్పుడు మాత్రమే బయటికి రావాలని అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్‌లో భారీ వర్షపాతం నమోదు
గత కొన్ని గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గచ్చిబౌలిలో 12.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఖాజాగూడలో 12, ఎస్‌ఆర్ నగర్‌లో 11, శ్రీనగర్ కాలనీలో 11.1, ఖైరతాబాద్‌లో 10.09, యూసుఫ్‌గూడలో 10.4, ఉప్పల్‌లో 10, బంజారాహిల్స్‌లో 9, నాగోల్‌లో 8.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
భారీవర్షాల నేపథ్యంలో సహాయం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు
- NDRF ఫోన్ నెం.8333068536
- ఐసీసీసీ 8712596106
- హైడ్రా ఫోన్ నెం.9154170992
- ట్రాఫిక్ 8712660600
- సైబరాబాద్ 8500411111
- రాచకొండ 8712662999
- TGSPDCL ఫోన్ నెం.7901530966
- RTC 9444097000
- GHMC ఫోన్ నె.8125971221
- HMWSSB 9949930003