MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ

Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ

Heavy Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ఈ సాయంత్రం మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంట తెలుసా?

3 Min read
Author : Arun Kumar P
| Updated : Jun 20 2026, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇక తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Image Credit : Gemini AI

ఇక తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు

Heavy Rains : దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే 15 రోజులు అవుతోంది... అంటే వర్షాకాలం మొదలైనట్లే. అయినా ఇప్పటివరకు సరైన వర్షాలు లేవు... ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి... అడపాదడప జల్లులు కురవడమే తప్ప భారీ వర్షాలు కురిసింది లేదు. ఇప్పటికే ఎల్ నినో ఎఫెక్ట్ తో వర్షపాతం తక్కువగానే ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.. దీనికి తగ్గట్లుగానే ఆరంభంలోనే వర్షాలు కురవకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వానలను నమ్ముకుని వర్షాధార పంటలు వేసేందుకు సిద్దమైన రైతులు వానచినుకుల కోసం ఆకాశంవైపు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకుంటాయనే చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నేడు తెలంగాణలో భారీ వర్షాలు...
Image Credit : Gemini

నేడు తెలంగాణలో భారీ వర్షాలు...

ఇవాళ (జూన్ 20, శనివారం) రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుంటాయని హెచ్చరించారు. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఒకటి రెండుచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోయినా సాయంత్రానికి ఆకాశం మేఘాలతో నిండిపోతుందని... రాత్రంతా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు.

ఇక రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే.. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండలు కొనసాగుతాయని వెదర్ మ్యాన్ తెలిపారు. సాయంత్రం సమయంలో చిరుజల్లులు మొదలై రాత్రంతా కొనసాగుతాయని... అక్కడక్కడ మోస్తరు వర్షాలుంటాయని వెల్లడించారు. ఇలా ఈ వీకెండ్ లో వర్షాలు కురుస్తూ నగరమంతా ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.

JUNE 20, 2026 THUNDERSTORMS ALERT ⚠️ 

Today will be MASSIVE DAY for Central, South TG 

Scattered INTENSE THUNDERSTORMS and HEAVY RAINS ahead in Sangareddy, Vikarabad, Rangareddy, Medak, Siddipet, Mahabubnagar, Wanaparthy, Nagarkurnool, Narayanpet, Nalgonda, Yadadri - Bhongir,…

— Telangana Weatherman (@balaji25_t) June 19, 2026

Related Articles

Related image1
Now Playing
Hyderabad Heavy Rains: అమరావతి సంగతి దేవుడెరుగు ముందు హైదరాబాద్ మునిగిపోతుంది | Asianet News Telugu
Related image2
IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే
35
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెదర్ రిపోర్ట్...
Image Credit : X/Hyderabad Traffic Police

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెదర్ రిపోర్ట్...

హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా ఇవాళ సాయంత్రం వర్షాలు మొదలవుతాయని ప్రకటించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలతో నిండివుంటుంది... సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు (గంటకు 30-40 కి.మీ వేగంతో) వీస్తూ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయట. శివారు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరిలో కూడా ఇదే వాతావరణ పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

1200 यूटीसी पर आधारित तेलंगाना का 7-दिवसीय पूर्वानुमान (रात) और शाम का अनुमान 2030 बजे IST पर जारी किया गया /7-day forecast(NIGHT) and Evening Inference of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :19-06-2026 pic.twitter.com/0BRCp0QuvA

— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) June 19, 2026

45
తెలంగాణలో అత్యధిక వర్షపాతం ఇక్కడే...
Image Credit : Gemini AI

తెలంగాణలో అత్యధిక వర్షపాతం ఇక్కడే...

నిన్న (జూన్ 19, శుక్రవారం) తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు... సంగారెడ్డి, రంగారెడ్డితో పాటు హైదరాబాద్ లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడ్డాయి. మరి అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 10 ప్రాంతాలు ఇవే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ - 89.3 మిల్లీమీటర్లు, చుంచుపల్లిలో 66.8 మి.మీ, టేకుపల్లెలో 57 మి.మీ, లక్ష్మీదేవిపల్లిలో 50.5 మి.మీ, ఎల్లందు - 43.8 మి.మీ వర్షం కురిసింది. ఇక ఖమ్మం జిల్లా వేంసూరు - 65.3 మి.మీ, మహబూబాబాద్ జిల్లా గార్లలో 42 మి.మీ, ములుగు జిల్లా తాడ్వాయిలో 41.5 మి.మీ, భూపాలపల్లిలో 33.8 మి.మి వర్షపాతం నమోదయినట్లు TGDPS (తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటి) ప్రకటించింది.

55
నేడు ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు
Image Credit : Gemini AI

నేడు ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలు యాక్టివ్ గా మారడంతో పాటు ఏపీ మీదుగా ఓ ద్రోణి కొనసాగుతోందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. వీటి ప్రభావంతో నేడు (జూన్ 20, శనివారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించంది. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడొచ్చని APSDMA వెల్లడించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Recommended image2
Now Playing
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్
Recommended image3
Now Playing
CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో విద్యార్థులకుసీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్| Asianet Telugu
Related Stories
Recommended image1
Now Playing
Hyderabad Heavy Rains: అమరావతి సంగతి దేవుడెరుగు ముందు హైదరాబాద్ మునిగిపోతుంది | Asianet News Telugu
Recommended image2
IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved