MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Heat Wave Warning : తెలుగు ప్రజలారా జాగ్రత్త... ఈ జిల్లాల్లో ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు, రెడ్ అలర్ట్

Heat Wave Warning : తెలుగు ప్రజలారా జాగ్రత్త... ఈ జిల్లాల్లో ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు, రెడ్ అలర్ట్

Heat Wave Warning : అసలైన ఎండాకాలం ఇప్పుడే ప్రారంభమయ్యింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇకపై 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏఏ జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయో తెలుసా..? 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 10 2026, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఇకపై ఎండలు పీక్స్...
Image Credit : X/APSDMA

ఇకపై ఎండలు పీక్స్...

Heat Wave Warning : ఎండాకాలం మొదలైనప్పటి నుండి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదయ్యాయి... కానీ ఇకపై ఇలా ఉండదంటున్నాయి ఇరురాష్ట్రాల వాతావరణ శాఖలు. తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా ఇదే చెబుతున్నారు.. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చిందంటున్నారు. ఏప్రిల్ 12 నుండి 22 వరకు ఎండలు పీక్స్ లో ఉంటాయని... అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
ఈ తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్..
Image Credit : X/Telangana Weatherman

ఈ తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్..

ఏప్రిల్ 12 నుండి తెలంగాణవ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈస్ట్, నార్త్ తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని... ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరకుంటుందని హెచ్చరించారు. పలు జిల్లాలకు రెడ్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాలు మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఇది నగరవాసులకు కాస్త ఊరటనిచ్చే అంశం.

Related Articles

Related image1
Weather Report: ఇంకా రెండో రోజులే.. ఏప్రిల్ 10 త‌ర్వాత చుక్క‌లు ఖాయం. హెచ్చ‌రిస్తోన్న వాతావార‌ణ శాఖ
Related image2
Weather Report: ఊపిరి పీల్చుకోండి.. వ‌చ్చే 4 రోజులు వ‌ర్షాలు. ఈ ప్రాంతంలో మాత్రం ఉరుములు, మెరుపులు
37
ఎండలతో పొంచివున్న ప్రమాదం..
Image Credit : Getty

ఎండలతో పొంచివున్న ప్రమాదం..

ఇకపై తెలంగాణలో వర్షాలుకురిసే అవకాశాలు తక్కువని వెదర్ మ్యాన్ తెలిపారు. ఎండలు ప్రమాదకరంగా మారే అవకాశాలుంటాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని... మధ్యాహ్నం సమయంలో ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో చిన్నారులు, ముసలివారు జాగ్రత్తగా ఉండాలని వెదర్ మ్యాన్ సూచించారు.

47
ఇవాళ్టి నుండే మండిపోనున్న ఎండలు..
Image Credit : Gemini

ఇవాళ్టి నుండే మండిపోనున్న ఎండలు..

హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలంగాణలో ఎండలు మండిపోతాయని హెచ్చరించింది... ఆసక్తికర విషయం ఏంటంటే వెదర్ మ్యాన్ ఏప్రిల్ 12 నుండి ఎండలు మండిపోతాయంటే వాతావరణ శాఖ ఇవాళ్టి (శుక్రవారం) నుండి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయంటోంది. ఈ నాలుగురోజులు (ఏప్రిల్ 10,11,12,13) ఏకంగా 41 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటోంది. 

ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్,మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధిక ఎండలు నమోదవుతాయని హెచ్చరిస్తోంది... ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మిగతా జిల్లాల్లో కూడా 36 నుండి 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయట... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ.

57
గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఎక్కడో తెలుసా..?
Image Credit : Getty

గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఎక్కడో తెలుసా..?

ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఇవాళ (ఏప్రిల్ 10, శుక్రవారం) ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పల్నాడు జిల్లా క్రోసూరు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 42.2°C గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. 

67
అత్యధిక వర్షపాతం ఇక్కడే..
Image Credit : Gemini AI

అత్యధిక వర్షపాతం ఇక్కడే..

తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. వీటి ప్రభావంతో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి... ఇవి మరికొద్దిరోజులు కొనసాగే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది. తూర్పుగోదావరి(జి) పైడిమెట్టలో 44మిమీ, కాకినాడ(జి) డి.పోలవరంలో 37.7మిమీ వర్షపాతం నమోదైందని తెలిపారు.

77
ఈ జిల్లాల్లో వర్షాలు...
Image Credit : ANI

ఈ జిల్లాల్లో వర్షాలు...

ద్రోణి ప్రభావంతో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలకు అవకాశం కూడా ఉన్నాయంటోంది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఎండతీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచిస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad: గుడ్ న్యూస్.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్.. ఈ ప్రాంతాలన్ని మారిపోతాయి !
Recommended image2
Weather Update: ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు.. మరోపక్క మండే ఎండలు.. ఎల్లో అలర్ట్ !
Recommended image3
Heat Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు.. ఇక ఉద్యోగులకూ సెలవులే సెలవులు
Related Stories
Recommended image1
Weather Report: ఇంకా రెండో రోజులే.. ఏప్రిల్ 10 త‌ర్వాత చుక్క‌లు ఖాయం. హెచ్చ‌రిస్తోన్న వాతావార‌ణ శాఖ
Recommended image2
Weather Report: ఊపిరి పీల్చుకోండి.. వ‌చ్చే 4 రోజులు వ‌ర్షాలు. ఈ ప్రాంతంలో మాత్రం ఉరుములు, మెరుపులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved