MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. మరోవైపు సూపర్ ఎల్‌నినో, వడదెబ్బల ముప్పు !

Weather Update: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. మరోవైపు సూపర్ ఎల్‌నినో, వడదెబ్బల ముప్పు !

Weather Update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు మండుతున్నాయి.. మరోవైపు వానలు పడుతున్నాయి. భానుడి భగభగలతో పాటు నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 18 2026, 07:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డేంజర్ జోన్ లో తెలుగు రాష్ట్రాలు.. ఎల్‌నినో ఎఫెక్ట్ తో వానలు పడవా? అసలేమైంది?
Image Credit : Gemini

డేంజర్ జోన్ లో తెలుగు రాష్ట్రాలు.. ఎల్‌నినో ఎఫెక్ట్ తో వానలు పడవా? అసలేమైంది?

తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు చల్లని రుతుపవనాలు ఇటువైపు దూసుకొస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా రెండు క్రేజీ అప్‌డేట్స్ ఇచ్చింది. మనం అనుకున్నట్టే నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్నాయి, కానీ అదే టైంలో ఎండలు కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. మరి రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుంది?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న నైరుతి రుతుపవనాలు
Image Credit : Getty

గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న నైరుతి రుతుపవనాలు

ఎండల దెబ్బకు తట్టుకోలేక ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా అని వెయిట్ చేస్తున్న వాళ్లకు ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఆల్రెడీ అండమాన్ నికోబార్ దీవులను తాకేశాయి. అక్కడ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో ఇవి ఆగ్నేయ అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోకి మరింత విస్తరిస్తాయి.

అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 22 నుంచి 30 మధ్యలో, ముఖ్యంగా మే 26 నాటికి ఇవి కేరళను టచ్ చేస్తాయి. ఇక మన ఏపీ, తెలంగాణ విషయానికి వస్తే.. జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈసారి సాధారణం కంటే కాస్త ముందే వర్షాలు పడేలా సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

35
అలర్ట్.. సూపర్ ఎల్‌నినో షాక్
Image Credit : Asianet News

అలర్ట్.. సూపర్ ఎల్‌నినో షాక్

రుతుపవనాలు వస్తున్నాయనే సంతోషంతో పాటు సూపర్ ఎల్‌నినో భయం కూడా మొదలైంది. పసిఫిక్ మహాసముద్రంలో నీళ్లు బాగా వేడెక్కుతుండటంతో ఈ పరిస్థితి వస్తోందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇది మనకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే, జూన్, జూలై నెలల్లో మనకు పీక్స్‌లో వర్షాలు పడాలి.

కానీ ఈ ఎల్‌నినో ప్రభావం వల్ల పసిఫిక్ నుంచి వచ్చే వేడి గాలులు ఇండియా వైపు వస్తాయి. ఇవి తెలుగు రాష్ట్రాల్లోని తేమను లాగేస్తాయి. దీనివల్ల పడాల్సిన వర్షాలు పడకుండా డ్రై వెదర్ వచ్చే ప్రమాదం ఉంది. జూన్ మొదటి రెండు వారాలు వానలు పడినా, ఆ తర్వాత ఎల్‌నినో దెబ్బ కొట్టేలా ఉంది.

45
భగ్గుమంటున్న ఎండలు.. వడదెబ్బతో మరణాలు
Image Credit : iSTOCK

భగ్గుమంటున్న ఎండలు.. వడదెబ్బతో మరణాలు

వర్షాల సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతానికైతే రెండు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఈ వారమంతా ఎండలు భీభత్సంగా ఉండబోతున్నాయి. టెంపరేచర్స్ 40 నుంచి 45 డిగ్రీల వరకు టచ్ అవుతాయి. ఆల్రెడీ ఎండల తీవ్రతకు ఏపీలో నలుగురు, తెలంగాణలో పది మంది వడదెబ్బతో చనిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. మంగళవారం నాటికి దాదాపు 84 మండలాల్లో తీవ్ర వేడిగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

55
ఎక్కడెక్కడ వర్షాలు పడనున్నాయి?
Image Credit : Getty

ఎక్కడెక్కడ వర్షాలు పడనున్నాయి?

అయితే ఈ ఎండల మధ్యలోనే అక్కడక్కడా రిలీఫ్ ఇచ్చేలా ద్రోణి ప్రభావంతో జల్లులు పడనున్నాయి. మే 19 నుంచి 21 మధ్య కోస్తాంధ్రా, రాయలసీమ, యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, హిందూపురం ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది.

అలాగే, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఇక తెలంగాణలో చూస్తే సోమవారం పశ్చిమ తెలంగాణలో అక్కడక్కడా సాయంత్రం పూట చినుకులు పడొచ్చు. వెదర్ ఇలా క్రేజీగా మారబోతుండటంతో.. మే 18 నుంచి 22 వరకు మత్స్యకారులు ఎవరూ బంగాళాఖాతంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు ఇచ్చారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్
అమరావతి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Chaganti Amazed By The Children Wonderful Performance | Nara Lokesh | Asianet News Telugu
Recommended image2
Now Playing
ఈ ఏజ్ లో బాబుగారు ఎలా కష్టపడుతున్నారో చూడండి | Asianet News Telugu
Recommended image3
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న తుపాను.. జిల్లాల్లో కుండపోత వర్షాలు
Related Stories
Recommended image1
5 Best Scenic Places: సౌత్ ఇండియాలో లైఫ్‌లో ఒక్కసారైనా చూడాల్సిన టాప్ 5 సీనిక్ ప్లేసెస్ ఇవే !
Recommended image2
IPL 2026 Playoff: ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన బెంగళూరు.. పంజాబ్ కొంపముంచిన ఓటమి, చెన్నైకి బూస్ట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved