MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • హుజురాబాద్: వరదల్లో చిక్కుకున్నవారి ఆకలిబాధను తీర్చి... మానవత్వం చాటుకున్న ఈటల

హుజురాబాద్: వరదల్లో చిక్కుకున్నవారి ఆకలిబాధను తీర్చి... మానవత్వం చాటుకున్న ఈటల

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరదనీరు ఇళ్లలోకి చేరి తీవ్ర అవస్థలు పడుతున్న జమ్మింకుంట వాసుల ఆకలిబాధ తీర్చారు మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్. 

1 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 07 2021, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

కరీంనగర్: గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో అయితే ఎడతెరిపి లేకుండా జోరువాన కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా రాత్రి నుండి భారీ వర్షం కురవడంతో రోడ్లపైకి వరదనీరు చేరింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సహాయ సహకారాలు అందించారు.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

జమ్మికుంట పట్టణంలో భారీ వర్షాలతో నీట మునిగిన హౌసింగ్ బోర్డు కాలనీలో ఈటల రాజేందర్ పర్యటించారు. వరద నీరు ఇండ్లలోకి చేరడంతో కొందరు కాలనీవాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లగా మిగతావారు అక్కడే బిక్కుబిక్కుమంటూ వరద నీటిలోనే వుండిపోయారు. 

34

ఇళ్లలోకి వర్షం చేరి సరుకులన్నీ తడిసిపోవడంతో వంట కూడా చేసుకునే పరిస్థితి లేక కాలనీవాసులు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మాజీ మంత్రి ఈటల వెంటనే తన సొంత డబ్బులతో అల్పాహారం వండించి హౌసింగ్ బోర్డ్ కాలనీవాసుల ఆకలి బాధను తీర్చారు.  

44

మరికొన్నిరోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఈటల సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని సూచించారు. 
 


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Recommended image2
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image3
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved