ప్రభాస్‌కు ఊరట.. ఇంటిని కూల్చవద్దన్న న్యాయస్థానం

First Published 4, May 2020, 5:26 PM

ప్రభాస్ ఇంటికి సంబంధించిన వ్యవహారం కొద్ది రోజులుగా కోర్టులో నలుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ప్రభాస్‌ ఇళ్లు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని మున్సిపల్ అధికారులు గతంలో ఈ ఇంటిని కూల్చేందుకు ప్రయత్నించారు.

<p style="text-align: justify;">హైదరాబాద్‌లోని రాయదుర్గం పరిధిలో ప్రభాస్‌కు ఓ ఇళ్లు ఉంది. 2083 గజాల్లో నిర్మించిన ఈ ఇంటిని నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేసినట్టుగా మున్సిపల్ అధికారులు వెల్లడించారు. అనుమతిలేని స్థలంలో ఇంటి నిర్మాణం చేయటం చట్ట వ్యతిరేకమన్న అధికారులు ఇళ్లు కూల్చేందుకు ప్రయత్నించారు. ఈ విషయంలో ప్రభాస్‌ కోర్టును ఆశ్రయించారు.</p>

హైదరాబాద్‌లోని రాయదుర్గం పరిధిలో ప్రభాస్‌కు ఓ ఇళ్లు ఉంది. 2083 గజాల్లో నిర్మించిన ఈ ఇంటిని నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేసినట్టుగా మున్సిపల్ అధికారులు వెల్లడించారు. అనుమతిలేని స్థలంలో ఇంటి నిర్మాణం చేయటం చట్ట వ్యతిరేకమన్న అధికారులు ఇళ్లు కూల్చేందుకు ప్రయత్నించారు. ఈ విషయంలో ప్రభాస్‌ కోర్టును ఆశ్రయించారు.

<p style="text-align: justify;">అయితే ప్రభాస్ వర్షన్‌ మరోలా ఉంది. స్థలం కొనే ముందు డాక్యుమెంట్లు పరిశీలించామని, ఆ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవన్న విషయం తమకు తెలియదని వెల్లడించారు. భారీ మొత్తం ఖర్చు పెట్టి ఇంటిని నిర్మించామని కాబట్టి ఇంటినీ కూల్చవద్దని కోర్టుకు విన్నవించారు.</p>

అయితే ప్రభాస్ వర్షన్‌ మరోలా ఉంది. స్థలం కొనే ముందు డాక్యుమెంట్లు పరిశీలించామని, ఆ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవన్న విషయం తమకు తెలియదని వెల్లడించారు. భారీ మొత్తం ఖర్చు పెట్టి ఇంటిని నిర్మించామని కాబట్టి ఇంటినీ కూల్చవద్దని కోర్టుకు విన్నవించారు.

<p style="text-align: justify;">ఇటీవల ప్రభాస్ తనను ఇంటిలోకి అనుమతించాలంటూ ఓ పిటీషన్ వేశాడు. అయితే మున్సిపల్‌ అధికారులు కూడా ప్రభాస్ బలవంతంగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పిటీషన్‌ వేయటంతో ఇరు వర్గాలకు&nbsp;కోర్టు కొన్ని సూచనలు చేసింది.</p>

ఇటీవల ప్రభాస్ తనను ఇంటిలోకి అనుమతించాలంటూ ఓ పిటీషన్ వేశాడు. అయితే మున్సిపల్‌ అధికారులు కూడా ప్రభాస్ బలవంతంగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పిటీషన్‌ వేయటంతో ఇరు వర్గాలకు కోర్టు కొన్ని సూచనలు చేసింది.

<p style="text-align: justify;">కోర్టు తాజా సూచనల ప్రకారం. ప్రభాస్ ఆ ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించకూడదు. అదే సమయంలో అధికారులు ఇంటిని కూల్చే ప్రయత్నం చేయకూదని తెలిపింది. కోర్టు తీర్పు వచ్చే వరకు ఇరు వర్గాలు సంయమనం పాటించాలన్న కోర్టు, ట్రయల్‌ కోర్టుకు కూడా కేసు విషయంలో కొన్ని సూచనలు చేసింది.</p>

కోర్టు తాజా సూచనల ప్రకారం. ప్రభాస్ ఆ ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించకూడదు. అదే సమయంలో అధికారులు ఇంటిని కూల్చే ప్రయత్నం చేయకూదని తెలిపింది. కోర్టు తీర్పు వచ్చే వరకు ఇరు వర్గాలు సంయమనం పాటించాలన్న కోర్టు, ట్రయల్‌ కోర్టుకు కూడా కేసు విషయంలో కొన్ని సూచనలు చేసింది.

loader