MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • మెదక్ లో త్వరలోనే ప్రియాంక గాంధీ సభ: బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న కాంగ్రెస్

మెదక్ లో త్వరలోనే ప్రియాంక గాంధీ సభ: బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న కాంగ్రెస్

త్వరలోనే  మెదక్ లో  కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో   సభను  ఏర్పాటు  చేయాలని  ఆ పార్టీ భావిస్తుంది.  రెండు  రోజుల్లో  ఈ విషయమై  స్పష్టత  వచ్చే అవకాశం ఉంది.    

2 Min read
Author : narsimha lode
Published : May 21 2023, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మెదక్ లో ప్రియాంక గాంధీ సభ

మెదక్ లో ప్రియాంక గాంధీ సభ

కర్ణాటక  రాష్ట్రంలో  విజయం సాధించిన కాంగ్రెస్  పార్టీ తెలంగాణపై  ఫోకస్ పెట్టింది.  తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కూడా  రెండు దఫాలు  అధికారానికి ఆ పార్టీ దూరంగా  ఉంది. దీంతో  ఈ ఏడాది చివర్లో  జరిగే అసెంబ్లీ ఎన్నికలపై   కాంగ్రెస్  పార్టీ నాయకత్వం  కేంద్రీకరించింది.  

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
మెదక్ లో ప్రియాంక గాంధీ సభ

మెదక్ లో ప్రియాంక గాంధీ సభ

తెలంగాణలో  అధికారాన్ని దక్కించుకోనేందుకు  అనుసరించాల్సిన వ్యూహాలపై  కాంగ్రెస్  పార్టీ  ఫోకస్ పెట్టింది.   రాష్ట్రంలో  మరోసారి ప్రియాంకగాంధీ సభను  ఏర్పాటు  చేయాలని  ఆ పార్టీ  భావిస్తుంది.  జూన్  చివరి వారం లేదా  జూలై  మొదటి వారంలో  ప్రియాంక గాంధీ సభను ఏర్పాటు  చేయాలని కాంగ్రెస్  పార్టీ ప్లాన్  చేస్తుంది.    సోమవారంనాడు  జరిగే  పీసీసీ సమావేశంలో  ఈ విషయమై  చర్చించనున్నారు.

36
మెదక్ లో ప్రియాంక గాంధీ సభ

మెదక్ లో ప్రియాంక గాంధీ సభ

indira gandhiగతంలో మెదక్ ఎంపీ స్థానం నుండి ఇందిరాగాంధీ విజయం సాధించారు.  అయితే  అదే జిల్లాలో  ప్రియాంక గాంధీ సభను  ఏర్పాటు చేయాలని  కాంగ్రెస్ నాయకత్వం  భావిస్తుంది. ఈ నెల  8వ తేదీన  కర్ణాటక  అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని  ప్రియాంక గాంధీ  హైద్రాబాద్ కు వచ్చారు.  హైద్రాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో   యూత్ డిక్లరేషన్ ను  ప్రకటించారు.  

46
మెదక్ లో ప్రియాంక గాంధీ సభ

మెదక్ లో ప్రియాంక గాంధీ సభ

రానున్న  రోజుల్లో బీసీ  డిక్లరేషన్  ను  కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది.   బీజేపీ నేతలు  రెండు  రోజుల క్రితం  బీసీ డిక్లరేషన్ ను  ప్రకటించారు.   తెలంగాణ రాష్ట్రంలో  బీసీ  ఓటర్లు  ఆయా పార్టీల గెలుపు ఓటముల్లో కీలకంగా వ్యవహరిస్తారు. దీంతో  బీసీలను  తమ వైపునకు తిప్పుకొనేందుకు  పార్టీలు  ప్రయత్నాలు  ప్రారంభించారు.

56
మెదక్ లో ప్రియాంక గాంధీ సభ

మెదక్ లో ప్రియాంక గాంధీ సభ

సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన  కాగ్రెస్ యువ సంఘర్షణ సభలో  యూత్ డిక్లరేషన్ లోని ముఖ్యాంశాలను  రేవంత్ రెడ్డి వివరించారు.  యూత్ డిక్లరేషన్ లో  తాము ఇచ్చిన అమలు చేయకపోతే   కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  కూల్చివేయాలని  ప్రియాంక గాంధీ కోరారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే  యూత్ డిక్లరేషన్ ను అమలు  చేస్తామని  ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  యువతకు  ఏం చేయనున్నారో  యూత్ డిక్లరేషన్ లో  కాంగ్రెస్ ప్రకటించింది.

66
మెదక్ లో ప్రియాంక గాంధీ సభ

మెదక్ లో ప్రియాంక గాంధీ సభ

ప్రియాంకగాంధీ  ద్వారా బీసీ డిక్లరేషన్ ను  కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదు.   తెలంగాణ రాష్ట్రంలో  ఎన్నికలకు  ఆరు మాసాల సమయం ఉంది.   ఎన్నికల షెడ్యూల్ నాటికే  అన్ని వర్గాలకు  ఏం  చేయనున్నామో  కాంగ్రెస్ పార్టీ  ప్రకటించనుంది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
Recommended image2
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?
Recommended image3
Now Playing
Big Twist In Johny Master Case : జానీ మాస్టర్ కేసుపై లాయర్ అల్లం నాగరాజు ఊహించని ట్విస్ట్ ??
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved