MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • MLA Sri Ganehsh: హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌ పై దాడికి యత్నం

MLA Sri Ganehsh: హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌ పై దాడికి యత్నం

MLA Sri Ganehsh: హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై దాడి యత్నం జరిగింది. దుండగులు కాన్వాయ్‌ను అడ్డుకుని గన్‌మెన్‌ల వెపన్స్‌ లాక్కొనేందుకు ప్రయత్నించారు. 

2 Min read
Mahesh Rajamoni
Published : Jul 21 2025, 12:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బోనాల పండ‌గ వేళ హైదరాబాద్‌లో ఉలిక్కిపడే ఘటన
Image Credit : Instagram/mla_sriganesh

బోనాల పండ‌గ వేళ హైదరాబాద్‌లో ఉలిక్కిపడే ఘటన

హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఈ ఘటన ఆదివారం తార్నాకాలోని ఆర్టీసీ హాస్పటల్ సమీపంలో చోటు చేసుకుంది. దాదాపు 50 మంది దుండగులు ఎమ్మెల్యే కాన్వాయ్‌ని వెంబడిస్తూ, వాహనంపైకి దూసుకువచ్చారు.

25
ఎమ్మెల్యే శ్రీగ‌ణేష్ గన్‌మెన్‌ వెపన్స్‌ లాక్కొనే ప్రయత్నం
Image Credit : Instagram/mla_sriganesh

ఎమ్మెల్యే శ్రీగ‌ణేష్ గన్‌మెన్‌ వెపన్స్‌ లాక్కొనే ప్రయత్నం

ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకున్న దుండగులు, గన్‌మెన్‌ చేతిలో ఉన్న వెపన్స్‌ను లాక్కొనే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని గన్‌మెన్‌లు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కారు డోర్లు తెరిచేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ స‌మ‌యంలో ఎమ్మెల్యే శ్రీగణేష్‌ తన కారులోంచి బయటకు రాకుండా ఉన్నాన‌ని తెలిపారు.

బ్రేకింగ్ న్యూస్

కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

హోమ్ మంత్రి రేవంత్ పాలనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకే రక్షణ కరువు

తార్నాకలోని ఆర్టీసీ హాస్పటల్ సమీపంలో వాహనంపై దూసుకు వచ్చిన సుమారు 50 మంది దుండగులు

అడ్డుకోబోయిన గన్‌మెన్‌ల చేతిలో నుంచి… pic.twitter.com/xFjJJDHvbA

— Telugu Scribe (@TeluguScribe) July 20, 2025

Related Articles

Related image1
School Holidays : స్కూళ్ల‌కు వ‌రుస‌ సెలవులు
Related image2
Make Reel And Win 15000: రీల్స్ చేస్తే డబ్బులు ఇస్తాం.. ప్రభుత్వం బంపర్ ఆఫర్.. డిజిటల్ ఇండియా కాంటెస్ట్ వివరాలు మీకోసం
35
పోలీసులు ఆశ్రయించిన ఎమ్మెల్యే శ్రీ గ‌ణేష్
Image Credit : Instagram/mla_sriganesh

పోలీసులు ఆశ్రయించిన ఎమ్మెల్యే శ్రీ గ‌ణేష్

ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే తన కాన్వాయ్‌ నుంచి బయటికి రాకుండా ఉన్నట్టు చెప్పారు. అనంతరం దుండగుల బారి నుంచి తప్పించుకుని ఆయన 200 మీటర్ల దూరంలోని ఓస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌ (OU PS)కి చేరుకుని అధికారికంగా ఫిర్యాదు చేశారు.

45
బోనాల జాతరకు వెళ్తుండగా దాడికి యత్నం
Image Credit : Instagram/mla_sriganesh

బోనాల జాతరకు వెళ్తుండగా దాడికి యత్నం

ఈ ఘటన మాణికేశ్వర్ నగర్ ప్రాంతంలో బోనాల జాతరకు వెళ్తుండగా చోటుచేసుకుంది. బోనాల వేడుకల కోసం వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాన్వాయ్‌ వద్ద దుండగులు దూకుడుగా వచ్చి.. వారిని  అడ్డుకుని దాడికి యత్నించారు. ఇది రాష్ట్రంలో రాజకీయంగా ఉద్రిక్తతలకు దారితీయొచ్చని అధికారులు భావిస్తున్నారు.

55
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
Image Credit : Instagram/mla_sriganesh

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ఎమ్మెల్యే శ్రీగణేష్ ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, ఘటనాస్థలానికి చేరుకున్న ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పోలీసులు కేసును నమోదు చేశారు. ఎవరు, ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారన్న విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. దగ్గరలోని సీసీ టీవీ ఫుటేజీలు సేకరిస్తున్నారు. ఇంకా ఎవరూ అరెస్టు కాలేదు. పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
రాజకీయాలు
పోలీసు భద్రత

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
Recommended image2
Now Playing
KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu
Recommended image3
Now Playing
CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Related Stories
Recommended image1
School Holidays : స్కూళ్ల‌కు వ‌రుస‌ సెలవులు
Recommended image2
Make Reel And Win 15000: రీల్స్ చేస్తే డబ్బులు ఇస్తాం.. ప్రభుత్వం బంపర్ ఆఫర్.. డిజిటల్ ఇండియా కాంటెస్ట్ వివరాలు మీకోసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved