నాడు ఒకే పార్టీ, ఇప్పుడిలా:పోచారంపై ఏనుగు పట్టు సాధించేనా?
తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే వ్యూహంతో కాంగ్రెస్ జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. బీఆర్ఎస్ లో బలమైన అభ్యర్ధులపై గట్టిపోటీ ఇచ్చే అభ్యర్ధులను బరిలోకి దింపుతుంది.
నాడు ఒకే పార్టీ, ఇప్పుడిలా:పోచారంపై ఏనుగు పట్టు సాధించేనా?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని బరిలోకి దింపింది కాంగ్రెస్. పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డిలు గతంలో ఇద్దరూ ఒకే పార్టీలో కొనసాగారు.
నాడు ఒకే పార్టీ, ఇప్పుడిలా:పోచారంపై ఏనుగు పట్టు సాధించేనా?
బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1994 నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఈ దఫా ఓడించాలని ఏనుగు రవీందర్ రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపింది.
నాడు ఒకే పార్టీ, ఇప్పుడిలా:పోచారంపై ఏనుగు పట్టు సాధించేనా?
2004లో పోచారం శ్రీనివాస్ రెడ్డిని బాజిరెడ్డి గోవర్ధన్ ఓడించారు.ఈ ఒక్క దఫా ఏ ఎన్నికల్లో కూడ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓడిపోలేదు. 2014లో కేసీఆర్ మంత్రివర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి పదవిని చేపట్టారు.
నాడు ఒకే పార్టీ, ఇప్పుడిలా:పోచారంపై ఏనుగు పట్టు సాధించేనా?
2018 ఎన్నికల్లో కేసీఆర్ రెండోసారి అధికారాన్ని చేపట్టారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఈ దఫా స్పీకర్ పదవి దక్కింది.మరోసారి బాన్సువాడ నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగారు. బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డిపై ఈ దఫా ఏనుగు రవీందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది.
నాడు ఒకే పార్టీ, ఇప్పుడిలా:పోచారంపై ఏనుగు పట్టు సాధించేనా?
ఇదే జిల్లాలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఏనుగు రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా గతంలో విజయం సాధించారు.2004, 2009,2014 ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి ఏనుగు రవీందర్ రెడ్డి విజయం సాధించారు.
నాడు ఒకే పార్టీ, ఇప్పుడిలా:పోచారంపై ఏనుగు పట్టు సాధించేనా?
2018 ఎన్నికల్లో మరోసారి ఇదే స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి సురేందర్ రెడ్డి చేతిలో ఏనుగు రవీందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఏనుగు రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. బీజేపీ తీరుపై అసంతృప్తితో ఏనుగు రవీందర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. ఎల్లారెడ్డి కాకుండా బాన్సువాడ నుండి రవీందర్ రెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్టు కేటాయించింది.
నాడు ఒకే పార్టీ, ఇప్పుడిలా:పోచారంపై ఏనుగు పట్టు సాధించేనా?
తెలంగాణ ఉద్యమ సమయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డిలు బీఆర్ఎస్ లో ఉన్నారు. 2018 వరకు వీరిద్దరూ ఒకే పార్టీలో కొనసాగారు. బాన్సువాడ నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై రవీందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.
నాడు ఒకే పార్టీ, ఇప్పుడిలా:పోచారంపై ఏనుగు పట్టు సాధించేనా?
ఒక్కసారి మినహా బాన్సువాడ నుండి ఓటమి చెందని నేతగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి రికార్డు ఉంది. ఈ ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధిస్తారా, ఏనుగు రవీందర్ రెడ్డి చరిత్ర సృష్టిస్తారా డిసెంబర్ 3న తేలనుంది.