అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ:తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్
తెలంగాణ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఈ దిశగా కార్యాచరణను మరింత ముమ్మరం చేసింది.
అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ:తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది.ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపిక కోసం ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకముందే అభ్యర్థులను ప్రకటించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ పార్టీ నాయకత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.
అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ:తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్
కర్ణాటక ఫార్మూలాను కూడ తెలంగాణలో అమలు చేయాలని ఆ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయంతో పాటు సర్వేల ద్వారా అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. గెలుపు గుర్రాలనే అభ్యర్ధులుగా ప్రకటించనున్నారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహిస్తుంది. సర్వే ఆధారంగా టిక్కెట్లను కేటాయించనున్నారు
అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ:తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. కేరళకు చెందిన ఎంపీ మురళీధరన్ చైర్మెన్ గాకమిటీని నియమించింది. బాబా సిద్దిఖ్, జిగ్నేష్ మేవానీలకు ఈ కమిటీలో స్థానం కల్పించింది. ఈ కమిటీలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను నియమించింది. అయితే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం అవకాశం దక్కలేదు.
అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ:తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు దఫాలు ఆ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. వచ్చే దఫా అధికారాన్ని దక్కించుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది.దరిమిలా ఈ దఫా ఎన్నికలను కాంగ్రెస్ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది
అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ:తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఆ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపింది.ఈ జోష్ ను కొనసాగించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ దిశగానే కాంగ్రెస్ నాయకత్వం వ్యూహలను సిద్దం చేస్తుంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని బీఆర్ఎస్ లోని అసంతృప్తులతో పాటు ఇతర పార్టీల్లోని కీలక నేతలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గాలం వేస్తుంది. ఈ మేరకు ఎన్నికల వ్యూహకర్త సూచనల మేరకు పార్టీలో చేరికలపై ఆ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది.రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఫోకస్ పెట్టారు. తెలంగాణపై కూడ సోనియాగాంధీ కేంద్రీకరించారు. ఇటీవల జరిగిన ఖమ్మం సభ జరిగిన తీరుతెన్నులను కూడ ఆమె ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.