ఈఎస్ఐలో మరో నాలుగు వైద్యసేవలు.. ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
First Published Dec 12, 2020, 3:59 PM IST
కోవిడ్ సంక్షోభ సమయంలో ఈ.ఎస్.ఐ.సి., హైదరాబాద్ అందించిన సేవలు ప్రశంసనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఈ.ఎస్.ఐ.సి హైదరాబాద్ లో నాలుగు సరికొత్త వైద్య సేవలు, సదుపాయాలను ప్రారంభించిన కిషన్ రెడ్డి మాట్లాడారు.

నవ భారత నిర్మాణంలో భాగంగా ప్రధానినరేంద్రమోదీ నేతృత్వంలో అనేక ఆరోగ్య సంరక్షణ పథకాలకు రూపకల్పన చేసి, సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, ఐదు లక్షల ఆరోగ్య భీమా సదుపాయం గల ఆయుష్మాన్ భారత్ ఒక గొప్ప పథకం అని, దీని ద్వారా దేశంలో ఎక్కడయినా కార్పొరేట్ వైద్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. మార్కెట్ ధర కంటే, 50% నుండి 90% తక్కువ ఖర్చుతో ఔషధాలను అంధించే జన ఔషధీ కేంద్రాల వ్యవస్థ, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, మిషన్ ఇంధ్ర దనుష్ మొదలైన పథకాలు ప్రజలకు గొప్ప వరమని మంత్రి పేర్కొన్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?