ఏప్రిల్‌లో రెండోసారి :థాయ్‌లాండ్ లో చీకోటి గ్యాంబ్లింగ్ దందా
థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న చీకోటి ప్రవీణ్ సహా 93 మందిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. థాయ్ లాండ్ లో రెండోసారి గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా చీకోటి ప్రవీణ్ గ్యాంగ్ పోలీసులకు చిక్కింది.
చీకోటి ప్రవీణ్ కుమార్
థాయ్‌లాండ్ లో గ్యాంబ్లింగ్ ఆడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 93 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాకు చెందిన డిసౌజా అనే వ్యక్తి ఈ విషయమై థాయ్‌లాండ్ పోలీసులకు మెయిల్ పంపారు. దీంతో థాయ్ లాండ్ పోలీసులు రంగంలోకి దిగారు. థాయ్ లాండ్ లోని హోటల్ లో గ్యాంబ్లింగ్ ఆడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 93 మందిని థాయ్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
చీకోటి ప్రవీణ్ కుమార్
థాయ్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఏపీ రాష్ట్రంలోని నెల్లూరు, గుడివాడకు చెందిన సుమారు 20 మంది ఉన్నారని సమాచారం. మరో వైపు థాయ్ లాండ్ పోలీసుల అదుపులో ఉన్నవారిలో మిగిలినవారంతా హైద్రాబాద్ కు చెందినవారుగా గుర్తించారు.
చీకోటి ప్రవీణ్ కుమార్
ఈ ఏడాది ఏప్రిల్ 11 నుండి 16వ తేదీ వరకు థాయ్ లాండ్ లోని ఏషియా హోటల్ లో గ్యాంబ్లింగ్ నిర్వహించాడు. ఈ సమయంలో రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున థాయ్ లాండ్ కు తీసుకెళ్లారని ప్రచారం సాగుతుంది. ఈ సమయంలో థాయ్ లాండ్ పోలీసులకు చిక్కకుండా చీకోటి ప్రవీణ్ గ్యాంగ్ ఇండియాకు చేరుకుంది. అయితే ఏప్రిల్ 27 నుండి మే 1వ తేదీ వరకు ఏషియా హోటల్ లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న సమయంలో అక్కడి పోలీసులు వీరిని పట్టుకున్నారు. .
చీకోటి ప్రవీణ్ కుమార్
ప్రస్తుతం థాయ్ లాండ్ పోలీసుల అదుపులో ఉన్నవారిలో ఎక్కువ మంది గతంలో చీకోటి ప్రవీణ్ తో కలిసి నేపాల్ తో పాటు ఇతర దేశాల్లో కూడా గ్యాంబ్లింగ్ ఆడినవారేనని తెలుస్తుంది.
చీకోటి ప్రవీణ్ కుమార్
చీకోటి ప్రవీణ్ కుమార్ ను గతంలో ఈడీ అధికారులు ప్రశ్నించారు. చీకోటి ప్రవీణ్ కుమార్ నిర్వహించిన కేసినో లో హవాలా రూపంలో డబ్బులు చేతులు మారినట్టుగా ఈడీ అనుమానిస్తుంది. ఈ విషయమై ఈడీ అధికారులు విచారించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు అన్ని సమాధానాలు చెప్పినట్టుగా చీకోటి ప్రవీణ్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే.
చీకోటి ప్రవీణ్ కుమార్
ఇండియా, విదేశాల్లో కేసినోకు అనుమతి ఉన్న చోటే తాను ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్టుగా చీకోటి ప్రవీణ్ కుమార్ గతంలో మీడియాకు తెలిపారు. థాయ్ లాండ్ లో పోలీసులకు చిక్కిన వారిలో వ్యాపారులు, రాజకీయ నేతలు కూడా ఉన్నారనే సమాచారం సాగుతుంది.