MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైదరాబాద్, విజయవాడ వాసులకు బిగ్ అలర్ట్ ... ఈ హోటల్స్ లో తిన్నారో అంతేసంగతి..!

హైదరాబాద్, విజయవాడ వాసులకు బిగ్ అలర్ట్ ... ఈ హోటల్స్ లో తిన్నారో అంతేసంగతి..!

Hyderabad : మీరు ఇంటి ఫుడ్ కాకుండా హోటల్ ఫుడ్ ఎక్కువగా తింటుంటారా..? మురీముఖ్యంగా ఈ హైవేలపై గల హోటల్స్ లో తింటుంటారా? అయితే మీకు ఈ విషయం తెలియాల్సిందే. 

3 Min read
Arun Kumar P
Published : Nov 03 2025, 09:15 PM IST| Updated : Nov 03 2025, 09:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బయటి ఫుడ్ తింటున్నారా..? అయితే మీ ఆరోగ్యం జాగ్రత్త
Image Credit : X/cfs_telangana

బయటి ఫుడ్ తింటున్నారా..? అయితే మీ ఆరోగ్యం జాగ్రత్త

Hyderabad : ప్రస్తుతం ఇంట్లో వండుకుని తినడం తక్కువ... హోటల్స్ ఫుడ్ తెచ్చుకుని తినడం ఎక్కువైపోయింది. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ఎంట్రీతో నగరవాసుల అహార అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. గతంలో హోటల్ కి వెళితే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసేది... దీన్నిబట్టి అక్కడ తినాలా వద్దా అనేది నిర్దారించుకునేవారు. ఇప్పుడలాకాదు... ఆ హోటల్ ఎలా ఉంటుందో తెలీదు? అహారం ఎక్కడ, ఎలా వండుతున్నారో తెలీదు? ఎలాంటి పదార్థాలు వాడుతున్నారో తెలీదు?... రుచిగా ఉంటేచాలు ఆహా ఓహో అంటూ లొట్టలేసుకుని తింటుంటాం... చాలా గొప్ప హోటల్ అంటూ రేటింగ్ కూడా ఇస్తుంటాం.

అయితే ప్రస్తుతం కొన్ని హోటళ్లలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలియజేసే ఘటన వెలుగుచూసింది. కొన్ని హోటల్స్ లో పాడయిపోయిన పదార్థాలు, దుర్గంద భరిత డ్రైనేజి కంపు మధ్య చాలా అపరిశుభ్రమైన కిచెన్ లో అహార పదార్థాలను రెడీచేసి ఇస్తున్నట్లు ఫుడ్ సెప్టీ అధికారులు గుర్తించారు. ఇలా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారితో పాటు మరికొన్ని హైవేలపై గల హోటల్స్ బాగోతం బైటపడింది.

25
హోటళ్లపై ఫుడ్ సెప్టీ దాడులు
Image Credit : X/cfs_telangana

హోటళ్లపై ఫుడ్ సెప్టీ దాడులు

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు నిత్యం చాలామంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటివారు నగర శివారులోనో లేదంటే హైవేలపై వెలిసిన హోటల్స్ లో ఫుడ్ టేస్ట్ చేస్తుంటారు... ఫ్యామిలీ, ప్రెండ్స్ తో సొంతవాహనాల్లో వెళ్ళేవారు అయితే తప్పకుండా ఆగుతారు. ఇలా ప్రజలు ఎక్కువగా ఆగే ప్రముఖ హైవే హోటల్స్ లో తెలంగాణ ఫుడ్ సేప్టీ అధికారులు దాడులు నిర్వహించారు.

@cfs_telangana taskforce in a major enforcement drive inspected 12 highway food outlets along NH-65 (Hyderabad–Vijayawada), NH-163 (Warangal–Hyderabad) & NH-44 (Kurnool–Hyderabad) covering Sangareddy, Warangal & Jogulamba Gadwal districts.

At M/s The Hotel NH-9 (The Palace… pic.twitter.com/FP4Vfl8mtd

— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) November 1, 2025

Related Articles

Related image1
Food Delivery: గాలి పీల్చినందుకు కూడా ట్యాక్స్ వేస్తారేమో.. స్విగ్గీ, జొమాటో తీరుపై నెటిజ‌న్ల కామెంట్స్
Related image2
Food: ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..!
35
హైదరాాబాద్ శివారులోని ఈ ఫేమస్ హోటల్లో ఇదీ పరిస్థితి..
Image Credit : X/cfs_telangana

హైదరాాబాద్ శివారులోని ఈ ఫేమస్ హోటల్లో ఇదీ పరిస్థితి..

ఇలా హైదరాబాద్ శివారులో ముంబై హైవే NH 65 పై గల ప్యాలస్ హోటల్ పై అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సంగారెడ్డి సమీపంలో రుద్రారం దగ్గర్లోని ఈ హోటల్లో నిత్యం వందలాది మంది ఆగుతుంటారు... ఎంతో ఇష్టంగా అక్కడ ఆహారం తింటుంటారు. కానీ ఈ హోటల్ నిర్వహకులు కస్టమర్ల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని... కిచెన్ లో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఫుడ్ సేప్టీ అధికారులు గుర్తించారు.

బొద్దింకలు, ఎలుకలతో కూడిన కిచెన్ లో ఎలాంటి మూతలు, లేబుల్స్ లేకుండానే అహార పదార్థాలు ఉన్నాయి... పాడయిపోయిన అహార పదార్థాలను కూడిన ఫుడ్ సేప్టీ అధికారులు గుర్తించారు. అలాగే కిచెన్ మురుగునీటి వ్యవస్థ మూసుకుపోయి పరిస్థితి దారుణంగా ఉందని... ఆ దుర్గందభరిత, అపరిశుభ్ర వాతావరణంలో వంటలు వండి కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు గుర్తించారు. 

ఇక శాఖాహారం, మాంసాహార పదార్ధాలన్నింటికి ఒకేదగ్గర వండుతున్నట్లు గుర్తించారు. అహారం రుచిగా, కలర్ ఫుల్ గా ఉండేందుకు సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ప్యాలస్ హోటల్ పై కేసు నమోదు చేశారు... అహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 ప్రకారం హోటల్ లైసెన్స్ రద్దు చేశారు. అంతేకాదు 107 కిలోలకు పైగా పాడయిపోయిన రొయ్యలు, ఫిష్, చికెన్, గోబి ప్రై వంటికి అక్కడికక్కడే పడేశారు.

45
ఈ హైవే హెటల్స్ ఇదీ పరిస్థితి...
Image Credit : X/cfs_telangana

ఈ హైవే హెటల్స్ ఇదీ పరిస్థితి...

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాదు జాతీయ రహదారి NH-65 (హైదరాబాద్-విజయవాడ), NH-163 (హైదరాబాద్-వరంగల్), NH-44 (హైదరాబాద్-కర్నూల్) లపై గల హోటల్స్ పై ఫుడ్ సెప్టీ టాస్క్ ఫోర్స్ దాడులు చేసింది. ఇలా మొత్తం 12 హోటళ్లపై దాడులు జరిపినట్లు ఫుడ్ సేప్టీ కమీషన్ ఎక్స్ వేదికన ప్రకటించింది. ఈ హోటల్స్ లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియజేసే ఫోటోలను కూడా విడుదల చేశారు.

55
ఈ హోటల్స్ తో దారుణ పరిస్థితులు
Image Credit : X/cfs_telangana

ఈ హోటల్స్ తో దారుణ పరిస్థితులు

NH-44 పై గల తాజ్ ప్యాలస్ హోటల్, అతిథి 44 డ్రైవ్ ఇన్, లైపాక్షి రెస్టారెంట్... NH-65 పై గల మినర్వా, వివేరా, సంగం హోటల్ ఉత్సవ్, ఒరిస్సా దాబా... NH-163 పై గల ది ఫోర్ట్ ఫుడ కోర్ట్, హోటల్ వివేరాలపై కూడా ఫుడ్ సెప్టీ దాడులు నిర్వహించింది. ఇక్కడ అపరిశుభ్రమైన కిచెన్, పాడయిపోయిన అహార పదార్ధాలు, ప్రమాదకరమైన ఆయిల్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ హోటళ్ల నుండి 7 సాంపిల్స్ తీసుకుని పరీక్షల కోసం పంపించినట్లు... 8 రకాల అంశాలపై నోటిసులు జారీ చేసినట్లు ఫుడ్ సెప్టీ అధికారులు ప్రకటించారు. ఇకపై కూడా తమ దాడులు కొనసాగుతాయని… ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా హోటల్లో పరిస్థితులు, అహార పదార్థాలు ఉంటే వదిలిపెట్టబోమని హెచ్చరించారు అధికారులు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
ఆహారం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved