MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • అనిరుధ్, కావ్య పెళ్ళికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడో రివీల్ చేసిన తెలంగాణ సీఎం

అనిరుధ్, కావ్య పెళ్ళికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడో రివీల్ చేసిన తెలంగాణ సీఎం

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవించంద్రన్, వ్యాపార కుటుంబానికి చెందిన కావ్య మారన్ పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే వీరి పెళ్లి విందు గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఆసక్తికర అప్ డేట్ ఇచ్చింది.

3 Min read
Author : Arun Kumar P
Published : Oct 17 2026, 08:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అనిరుధ్ కావ్య పెళ్లిపై తెలంగాణ సీఎంవో అప్ డేట్
Image Credit : X/Telangana CMO

అనిరుధ్-కావ్య పెళ్లిపై తెలంగాణ సీఎంవో అప్ డేట్

సినీ సంగీత ప్రపంచంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో తెలుగు టీం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ గా తెలుగువారికి సుపరిచితమైన కావ్య మారన్ ను అతడు పెళ్లాడబోతున్నాడు. వీరి పెళ్లి వార్త ఇటు సినీరంగంలో, అటు క్రీడా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి వివాహంపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా... తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయం చేసిన ప్రకటనతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. వీరి వివాహ రిసెప్షన్ ఎప్పుడు జరగనుందో తెలంగాణ సీఎంవో వెల్లడించింది.

అనిరుధ్-కావ్య పెళ్ళి విందు ఎప్పుడు, ఎక్కడ?

అనిరుధ్, కావ్య వివాహ పనులు మొదలయ్యాయి.... రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ స్వయంగా ప్రముఖులను కలిసి కూతురు పెళ్లి విందుకు రావాలని ఆహ్వానాలు అందిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ లతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ నేత కేటీఆర్ లకు ఆహ్వానం అందించారు.

అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్ నవంబర్ 21న చెన్నైలో జరగనుంది. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి కళానిధి మారన్, కావేరి మారన్ దంపతులు స్వయంగా వెళ్లి తమ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మారన్ దంపతులు, రేవంత్ దంపతులను కలిసిన ఫొటోలు, వీడియోలను సీఎంవో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాటితో పాటు చెన్నైలో నవంబర్ 21న వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. దీంతో ఈ వేడుక తేదీపై అధికారిక స్పష్టత వచ్చింది.

Sun Group Chairman Shri Kalanithi Maran and his wife, Smt. Kavery Maran, met Hon’ble Chief Minister Shri A. Revanth Reddy at his residence in Jubilee Hills and invited him to the wedding reception of their daughter, Kavya Maran.

The wedding reception of Kavya Maran and Anirudh Ravichander is scheduled to be held in Chennai on November 21.

#KalanithiMaran #KavyaMaran

— Telangana CMO (@TelanganaCMO) October 16, 2026

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పీఎం మోదీ, సీఎం విజయ్, బిఆర్ఎస్ లీడర్ కేటీఆర్‌కు కూడా ఆహ్వానం
Image Credit : X/Tamilnadu CMO

పీఎం మోదీ, సీఎం విజయ్, బిఆర్ఎస్ లీడర్ కేటీఆర్‌కు కూడా ఆహ్వానం

తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా కళానిధి మారన్ దంపతులు కలిశారు. హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసానికి వెళ్లి తమ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ దంపతులకు వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రిని విజయ్ ని కూడా అనిరుధ్, కావ్య పెళ్ళికి ఆహ్వానించారు మారన్ దంపతులు. కొందరు సినీ, వ్యాపార ప్రముఖులకు కూడా ఇప్పటికే ఈ పెళ్లి విందుకు పిలుపు అందింది. కాబట్టి సినీ, క్రికెట్, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది.

34
గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్?
Image Credit : Instagram

గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్?

అనిరుధ్, కావ్య మారన్ వివాహం గ్రీస్‌లో జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్ 10 లేదా 11న అక్కడ వివాహ వేడుక నిర్వహించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. వధూవరుల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రైవేట్ వేడుకగా పెళ్లి జరగవచ్చని సమాచారం. ఆ తర్వాత చెన్నైలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల కోసం భారీ స్థాయిలో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

అయితే గ్రీస్‌లో వివాహం జరిగే తేదీ, స్థలం, వేడుకల వివరాలను అనిరుధ్ లేదా కావ్య మారన్ కుటుంబసభ్యులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇలా పెళ్లిపై క్లారిటీ లేకున్నా నవంబర్ 21న రిసెప్షన్ ఉంటుందని తెలంగాణ సీఎంవో ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది.

44
ఎవరీ అనిరుధ్ రవిచందర్?
Image Credit : Instagram

ఎవరీ అనిరుధ్ రవిచందర్?

కేవలం తమిళనాడు కాదు ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడిగా అనిరుధ్ రవిచందర్ గుర్తింపు పొందారు. 2012లో విడుదలైన 3 సినిమాలోని ‘వై దిస్ కొలవెరి డి’ పాటతో ఆయన దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఆ పాటకు లభించిన ఆదరణతో యువ సంగీత దర్శకుడిగా ఆయన పేరు మారుమోగింది. ఆ తర్వాత విక్రమ్, జైలర్, జవాన్ వంటి సినిమాలకు అందించిన సంగీతంతో మరింత గుర్తింపు సంపాదించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది.

ఎవరీ కావ్య మారన్?

కావ్య మారన్ సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల కుమార్తె. ఆమె సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ జట్టుకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. మ్యాచ్‌ల సమయంలో స్టేడియంలో కనిపిస్తూ క్రికెట్ అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు... మరీముఖ్యంగా తెలుగువారికి దగ్గరయ్యారు. క్రికెట్‌పై ఆసక్తి, జట్టు నిర్వహణలో ఆమె పాత్ర కారణంగా ఐపీఎల్ అభిమానులకు కావ్య సుపరిచితురాలు. మరోవైపు ఆమె కుటుంబం మీడియా, టెలివిజన్, వినోద రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

సినీ, క్రికెట్ అభిమానుల్లో పెరిగిన ఆసక్తి

అనిరుధ్‌కు సినీ సంగీత అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉండగా, కావ్య మారన్ ఐపీఎల్ అభిమానులకు సుపరిచితురాలు. ఈ ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారన్న వార్తతో రెండు రంగాలకు చెందిన అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. గతంలో వీరిద్దరి సంబంధంపై అనేక ఊహాగానాలు వచ్చినప్పటికీ, ఇప్పుడు వివాహ రిసెప్షన్ తేదీపై తెలంగాణ సీఎంవో ప్రకటన వెలువడటంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. నవంబర్‌లో జరగనున్న వివాహ వేడుకలు, చెన్నై రిసెప్షన్‌కు హాజరయ్యే ప్రముఖుల వివరాలపై తదుపరి రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Bathukamma Songs: యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న టాప్ 5 బతుకమ్మ పాటలు ఇవే
Recommended image2
Hyderabad : హైదరాబాద్‌లో అంతరిక్షం నుండి కనిపించేంత భారీ చెత్తకొండలా..! ఎక్కడున్నాయో తెలుసా?
Recommended image3
హైదరాబాద్‌లో ఫ్లాట్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. భారీ తగ్గింపును ఇస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు
Related Stories
Recommended image1
Anirudh Kavya Wedding: అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్.. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ఎక్కడో తెలుసా? వాహ్‌
Recommended image2
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved