MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Anganwadi Jobs : తెలుగమ్మాయిలకు బంపరాఫర్, సొంతూళ్ళలోనే పోస్టింగ్ : పదో తరగతి అర్హతతో 14,236 ప్రభుత్వ ఉద్యోగాలు

Anganwadi Jobs : తెలుగమ్మాయిలకు బంపరాఫర్, సొంతూళ్ళలోనే పోస్టింగ్ : పదో తరగతి అర్హతతో 14,236 ప్రభుత్వ ఉద్యోగాలు

Telangana Jobs : తెలంగాణలో త్వరలోనే కొలువుల జాతర షురూ కానుంది.  కేవలం పదో తరగతి అర్హతతో ఏకంగా 14వేలకు పైగా భారీ ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ సిద్దమయ్యింది...అది కూడా సొంత ఊళ్లోనే పోస్టింగ్. ఇంతకూ ఆ ఉద్యోగాలేంటో తెలుసా?   

3 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 22 2025, 05:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Anganwadi Jobs 2025

Anganwadi Jobs 2025

Telangana : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చిన్నారుల కోసం నిర్వహిస్తున్న అంగన్వాడీలను మరింత బలోపేతం చేయడానికి రేవంత్ సర్కార్ సిద్దమయ్యింది. ఇందులో భాగంగానే అంగన్వాడీల్లో పిల్లల కేర్ టేకింగ్ తో పాటు గర్భిణి, బాలింత మహిళల సంరక్షణ, పోషకాహారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకోసం అంగన్వాడీల్లో సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు  ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 
 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడీల్లో ఇక సిబ్బంది లేరనే మాట వినిపించకూడదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పటికే అంగన్వాడీల్లో ఖాళీల వివరాలను సేకరించారు... అంతేకాదు ఉద్యోగాల భర్తీకి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కూడా అనుమతించింది. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా మెగా అంగన్వాడీ జాబ్స్ రిక్రూట్ మెంట్ చేపట్టేందుకు సిద్దమయ్యారు. 

తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారీగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల భర్తీ చేపట్టనున్నట్లు ఇప్పటికే పలుమార్లు మంత్రి సీతక్క స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు తీవ్ర కసరత్తు తర్వాత ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫైల్ మంత్రి వద్దకు చేరింది. ఆమె కూడా వెంటనే దానిపై సంతకం చేయడంతో ఇక ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవడమే మిగిలింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Anganwadi Jobs in Telangana

Anganwadi Jobs in Telangana

తెలంగాణలో కొలువుల జాతర ... అంగన్వాడీల్లో మెగా రిక్రూట్ మెంట్ : 

తెలంగాణలోని చాలా అంగన్వాడీల్లో ప్రస్తుతం సిబ్బంది కొరత ఉంది. చాలాచోట్ల టీచర్లు ఉంటే హెల్పర్ లేరు... హైల్పర్ ఉంటే టీచర్ ఉండరు. వచ్చే విద్యాసంవత్సరం ఇలాంటి పరిస్థితి ఉండకూడదని... పిల్లలు, గర్బిణి, బాలింత మహిళలు ఇబ్బందిపడకుండా ఉండేలా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది రేవంత్ సర్కార్. ఇందుకోసం ఇప్పటినుండే భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తోంది. 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14,236 ఉద్యోగాలను అంగన్వాడీల కోసం భర్తీ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో 6399 అంగ‌న్వాడీ టీచ‌ర్లు, 7837 అంగన్వాడీ హెల్ప‌ర్ల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాస్త ఆగాల్సివస్తోంది. ఎన్నికల కోడ్ ముగియగానే అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. 

అంగన్వాడీ ఉద్యోగాల భర్తీని జిల్లాల వారిగా చేపట్టనున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జిల్లాలవారిగా అంగన్వాడీల్లో ఖాళీల లిస్ట్ ను స్త్రీ, శిశు సంక్షేమశాఖ సిద్దంచేసింది... వీటి భర్తీకి త్వరలోనే కలెక్టర్లు నోటిఫికేషన్ విడుదలచేయనున్నారు. ఇందులోనే అర్హతలు, దరఖాస్తు, ఎంపిక ప్రక్రియ గురించి తెలియజేస్తారు. 
 

33
Anganwadi Teacher and Helper Jobs

Anganwadi Teacher and Helper Jobs

అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఉద్యోగాలకు అర్హతలు : 

అంగన్వాడీ ఉద్యోగాలకు కేవలం వివాహిత మహిళలే అర్హులు. అలాగే ఆ అంగన్వాడీ పరిధిలోని స్థిరనివాసం ఉండేవారినే ఎంపికచేస్తారు. పిల్లలతో పాటు గర్భిణి, బాలింత మహిళలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేందుకే స్ధానికులను అంగన్వాడీల్లో ఎంపిక చేస్తారు. 

విద్యార్హతల విషయానికి వస్తే ఇంటర్మీడియట్ లేదా పదో తరగతి చదివిన మహిళలకు ఈ ఉద్యోగాల్లో నియమిస్తారు. అంగన్వాడి టీచర్ కు ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు ఇంటర్మీడియట్ లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇక అంగన్వాడీ హెల్పర్ అయితే పదో తరగతి సరిపోతుంది. 

రిజర్వేషన్ ను బట్టి వయో పరిమితిని నిర్ణయిస్తారు. ఎస్సీ, ఎస్టిలకు 18 నుండి 35 ఏళ్లలోపు వయసు ఉండాలి. జనరల్, బిసి అభ్యర్థులకు 21 నుండి 35 ఏళ్లలోపు వయసు ఉండాలి. దివ్యాంగులు, ఇతర స్పెషల్ రిజర్వేషన్ వారికి వయో పరిమితిలో మరింత సడలింపు ఉంటుంది. 

అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసిన తర్వాత దరఖాస్తుకు సమయం ఇస్తారు. ప్రత్యేకంగా పోటీ పరీక్ష లేకుండానే విద్యార్హతల్లో సాధించిన మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఫైనల్ అభ్యర్థులను ఎంపికచేసే అవకాశం ఉంటుంది.

అంగన్వాడీ టీచర్లకు జీతం నెలకు రూ.12,500 నుండి 13,500 వరకు ఉంటుంది. హెల్పర్లకు నెల జీతం రూ.8,000 వరకు ఉంటుంది. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణతో పాటు ప్రభుత్వం ఇతర పనులను కూడా అంగన్వాడీలకు కేటాయిస్తుంది. ఇలా గ్రామాలు, పట్టణాల్లో విద్యాపరమైన వ్యవహారాల్లోనే కాదు పాలనపరమై వ్యవహారాల్లోనూ అంగన్వాడీలను ఉపయోగించుకుంటారు. 

అయితే అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన విధివిధానాలను నోటిఫికేషన్ లో పేర్కొనే అవకాశం ఉంది. అప్పుడు అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం, జీతభత్యాలు తదితర అంశాలపై పూర్తి క్లారిటీ వస్తుంది. గతంలో చేపట్టిన ఉద్యోగాల భర్తీ, ఇప్పుడు కొనసాగుతున్న అంగన్వాడీల వివరాల ఆధారంగా కొంత సమాచారాన్ని అందించగలిగాం. కానీ నోటిఫికేషన్ లో కొన్ని మార్పులు ఉండవచ్చు...గమనించగలరు.  


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
1st TEST • NZ vs IND 2026
Stumps
NZNZ
(45.0 ov) 368 & 119/2
INDIND
(166.0 ov)720/9
Day 4
Schedule ›
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad Bomb Threat: హైదరాబాద్‌లో 26/11 తరహా దాడి బెదిరింపు ఈమెయిల్.. పోలీసుల హై అలర్ట్
Recommended image2
హైద‌రాబాద్ న‌డిబొడ్డున 50 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఒక్కరోజులోనే రూ. 800 కోట్ల అమ్మ‌కాలు
Recommended image3
అసదుద్దీన్ ఓవైసీని ఓడించగలవా..: అమిత్ షాకు రేవంత్ రెడ్డి సవాల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved