MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పిడుగులు, ఈదురుగాలులతో ఈ జిల్లాల్లో అల్లకల్లోలమే

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పిడుగులు, ఈదురుగాలులతో ఈ జిల్లాల్లో అల్లకల్లోలమే

Weather Updates : ఎండాకాలంలో ఈ వర్షాలేంట్రా బాబు..! ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజల అభిప్రాయమిదే. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో రాబోయే రోజుల్లోనూ వర్ష బీభత్సం తప్పేలా లేదు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 03 2026, 04:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Image Credit : Meta AI

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Weather Updates : తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదిలిపెట్టడంలేదు. చలికాలంలోనూ వర్షాలు కురిశాయి.. ఇప్పుడు వేసవిలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో మరికొద్దిరోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే సమయంలో కొన్నిచోట్ల మండుటెండలు కూడా కొనసాగుతున్నాయి. ఇలా ఎండావానలతో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు
Image Credit : Getty

ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు

ఆంధ్ర ప్రదేశ్ లో ఎండలతో పాటు వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ (ఏప్రిల్ 3, శుక్రవారం) సాయంత్రం రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలుంటాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని APSDMA హెచ్చరించింది.

35
ఏపీకి పిడుగులు, ఈదురుగాలుల ప్రమాదం...
Image Credit : ANI

ఏపీకి పిడుగులు, ఈదురుగాలుల ప్రమాదం...

ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలతో పాటు పిడుగుల ప్రమాదం పొంచివుందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. అలాగే గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలున్నాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వర్షాలు కురిసే సమయంలో పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచిస్తున్నారు.

45
ఏపీలో మండిపోతున్న ఎండలు..
Image Credit : Getty

ఏపీలో మండిపోతున్న ఎండలు..

ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలతో పాటు ఎండలు కూడా మండిపోతున్నాయి. రాష్ట్రంలో రానున్న రెండురోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని... కొన్నిచోట్ల 42-43°C వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని APSDMA హెచ్చరించింది. రేపు (ఏప్రిల్ 04, శనివారం) 54 మండలాల్లో తీవ్రవడగాలులు,16 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఎల్లుండి (ఏప్రిల్ 05, ఆదివారం) 41 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

55
తెలంగాణలో వర్షాలు...
Image Credit : ANI

తెలంగాణలో వర్షాలు...

తెలంగాణలో కూడా వర్షాలు కొనసాగుతాయని... రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. (ఏప్రిల్ 03, 04 శుక్ర, శనివారం) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదే సమయంలో ఎండల తీవ్రత కూడా ఉంటుంది.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
వాతావరణం
హైదరాబాద్
విశాఖపట్నం
విజయవాడ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image2
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image3
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Related Stories
Recommended image1
IMD Rain Alert : ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం.. ఈ జిల్లాల్లో డేంజర్ వానలు, బిఅలర్ట్
Recommended image2
Weather Report: బ‌య‌ట‌కు వ‌చ్చే ముందు జాగ్ర‌త్త‌.. ఈరోజు పిడుగుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved