Aadhaar Card: ఇంట్లో ఉండే ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవచ్చు.. కరెంట్ బిల్ ఉంటే చాలు
Aadhaar online update: వేరే ప్రాంతానికి ఫిష్ట్ అయితే చాలా మంది ఆధార్‌లో అడ్రస్ మార్చుకుంటున్నారు. అడ్రస్ మార్పునకు సంబంధించి ఎలాంటి పరిమితులు లేవని తెలిసిందే. అయితే ఇంట్లో ఉంటూనే ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవచ్చని మీకు తెలుసా.?

ఆధార్ డీటైల్స్ అప్‌డేట్
మీరు కొత్తగా ఇల్లు మారారా? లేక వేరే చోటుకి షిఫ్ట్ అయ్యారా? ఇప్పుడు ఆధార్ కార్డ్‌లో పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి వివరాలను మార్చుకోవడం చాలా సులభం. యూఐడీఏఐ ఆధార్ సర్వీస్‌లను పూర్తిగా డిజిటల్‌గా మార్చి, ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా ఇంట్లో కూర్చొని అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది.
KNOW
దీంతో కలిగే లాభాలు ఏంటంటే..
పేపర్ల అవసరం తగ్గింపు: పాన్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్ వంటి ప్రభుత్వ ఐడీ ప్రూఫ్ ఉంటే చాలు.
అద్దెకు ఉన్నవారికి సౌలభ్యం: రెంట్ అగ్రిమెంట్ లేకపోయినా కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు వంటి డాక్యుమెంట్లతో అడ్రస్ ప్రూఫ్ ఇవ్వవచ్చు.
మొబైల్ యాప్ సదుపాయం: UIDAI త్వరలోనే QR కోడ్‌తో కూడిన కొత్త డిజిటల్ ఆధార్ యాప్‌ను విడుదల చేయనుంది. ఈ యాప్‌లో మాస్క్డ్ ఆధార్ ఆప్షన్ కూడా ఉంటుంది, కాబట్టి ప్రతిసారి ఆధార్ జిరాక్స్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఆన్‌లైన్‌లో ఆధార్ అడ్రస్ ఎలా అప్‌డేట్ చేసుకోవాలి
* ఇందుకోసం ముందుగా myAadhaar పోర్టల్‌కి వెళ్లండి https://myaadhaar.uidai.gov.in లాగిన్ అవ్వండి
* మీ ఆధార్ నంబర్ నమోదు చేసి, OTP ద్వారా లాగిన్ అవ్వాలి.
* ‘అప్‌డేట్ డెమోగ్రాఫిక్స్’ ఆప్షన్ ఎంచుకోండి
* అడ్రస్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి డీటైల్స్ ఎంచుకోవచ్చు.
* కొత్త అడ్రస్ నమోదు చేయండి
* ఇంగ్లీష్, స్థానిక భాషలో ఎంటర్ చేయాలి.
* సపోర్టింగ్ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయండి.
* పాన్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్ లేదా కరెంట్ బిల్లు వంటి ప్రూఫ్ అప్‌లోడ్ చేయాలి.
* సబ్మిట్ చేసి రిక్వెస్ట్ నెంబర్ తీసుకోండి.
* ఈ నెంబర్ ద్వారా స్టేటస్ ట్రాక్ చేయవచ్చు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
డిజిటల్ ఆధార్ ప్రయోజనాలు
* ఎప్పుడైనా మొబైల్ ద్వారా ఆధార్ షేర్ చేయగల సౌకర్యం.
* KYC కోసం మాస్క్డ్ ఆధార్ పంపే ఆప్షన్.
* ఫిజికల్ జిరాక్స్ అవసరం లేకుండా డిజిటల్ QR కోడ్ స్కాన్‌తో వెరిఫికేషన్.
* సెక్యూరిటీ ఎక్కువ, డేటా ప్రైవసీ మెరుగ్గా ఉంటుంది.
ఫ్రీ అప్‌డేట్ ఆఫర్ – జూన్ 2026 వరకు అవకాశం
UIDAI ప్రకటించిన ప్రకారం, 14 జూన్ 2026 వరకు myAadhaar పోర్టల్‌లో అడ్రస్ అప్‌డేట్ ఫ్రీగా చేసుకోవచ్చు. తర్వాత ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేసి ఉంటే, ఇప్పుడే ఈ ఫ్రీ సదుపాయాన్ని ఉపయోగించుకోండి.