MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • వాట్సాప్ ఈ 5 సీక్రెట్ ఫీచర్ల గురించి మీకు తెలుసా ! వీటితో చాటింగ్ మరింత ఫన్నీగా ఈజీగా..

వాట్సాప్ ఈ 5 సీక్రెట్ ఫీచర్ల గురించి మీకు తెలుసా ! వీటితో చాటింగ్ మరింత ఫన్నీగా ఈజీగా..

ఇన్స్టంట్ మెసేజింగ్ ఫ్లాట్ ఫార్మ్ వాట్సాప్ యూజర్లకు మెరుగైన అనుభవం కోసం ఒకటి కంటే ఎక్కువ ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. చాలా మందికి  వాట్సాప్ లోని కొన్ని సీక్రెట్  ఫీచర్స్ గురించి తెలియదు, ఇవి కొద్ది మందికి  మాత్రమే  తెలుసు. ఈ ఫీచర్స్  మీ చాట్ లేదా మెసేజింగ్ అనుభవాన్ని సులభతరం చేస్తాయి. అయితే ఈ 5 సీక్రెట్  ఫీచర్స్ గురించి తెలుసుకుందాం...

2 Min read
Author : Ashok Kumar
| Updated : Jun 16 2023, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

1.ప్రైవేట్ మెసేజ్ ఫీచర్
వాట్సాప్‌లో గ్రూప్ చాట్ కొనసాగుతున్నప్పుడు మీరు చాలాసార్లు ఎవరికైనా  మెసేజ్ వ్యక్తిగతంగా రిప్లయ్ ఇవ్వాలనుకుంటే దీని కోసం మీరు 'రిప్లయ్ ప్రయివేట్' ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందుకు మీరు రిప్లయ్ ఇవ్వాలనుకుంటున్న మెసేజ్  నొక్కి పట్టుకోండి. తరువాత పైన కుడివైపు మూలలో ఉన్న 3 చుక్కల పై నొక్కి, రిప్లయ్ ప్రైవేట్‌  నొక్కండి. ఇప్పుడు మీరు సులభంగా ప్రైవేట్‌గా రిప్లయ్  ఇవ్వవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

2. ఆడియో క్లిప్‌ను స్టేటస్‌లో  
వాట్సాప్ తాజా వెర్షన్ అద్భుతమైన వాయిస్ నోట్స్ ఫీచర్‌ని తీసుకొచ్చింది. మీరు మీ స్టేటస్ లో వాయిస్ క్లిప్‌ని పెట్టుకోవచ్చు. వాయిస్ స్టేటస్  క్రియేట్ చేయడానికి WhatsApp స్టేటస్  ట్యాబ్‌పై నొక్కండి. ఇప్పుడు కింద కుడి మూలలో పెన్సిల్ సింబల్ పై నొక్కండి. తరువాత మైక్రోఫోన్ సింబల్ నొక్కి మీ వాయిస్‌ని రికార్డ్ చేయండి. ఇప్పుడు ఫోటో స్టోరీ లాగా షేర్ చేయండి. మీరు కేవలం 30 సెకన్ల ఆడియోను మాత్రమే షేర్ చేయవచ్చని గుర్తుంచుకోండి.
 

35

3. నంబర్ సేవ్ లేకుండా చాట్ 
మీరు రోజూ తెలియని వ్యక్తులతో వాట్సాప్ చాట్ చేస్తుంటే మీరు నంబర్‌ను సేవ్ చేయకుండానే వారితో చాట్ చేయవచ్చు. దీని కోసం మీరు ఆ నంబర్‌కు సంబంధించిన వాట్సాప్ లింక్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత దానితో చాట్ ఓపెన్ అవుతుంది. ఉదాహరణకు, మీరు +919876543210 నంబర్‌తో చాట్ చేయాలనుకుంటున్నారని అనుకుందాం, ఆపై మీరు https://wa.me/919876543210 URLని సందర్శించడం ద్వారా చాట్ చేయవచ్చు.

45

4. హోమ్ స్క్రీన్‌కి WhatsApp చాట్ 
మీరు Android యూజర్ అయితే, WhatsAppలో మీ హోమ్‌స్క్రీన్‌కి చాట్ షార్ట్‌కట్‌ని పెట్టుకోవచ్చు. ఇందుకు WhatsAppలో ఏదైనా చాట్ తెరవండి. ఇప్పుడు దాని షార్ట్ కట్ క్రియేట్ చేయడానికి పైన కుడి మూలలో ఉన్న మెనుపై నొక్కండి. ఇప్పుడు మోర్ అప్షన్స్ కి  వెళ్లి, 'యాడ్ షార్ట్‌కట్' సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 'యాడ్ షార్ట్‌కట్' బటన్‌ను నొక్కితే షార్ట్ కట్  క్రియేట్ అవుతుంది.
 

55

5. ఎవరికీ కనిపించకుండా ప్రొఫైల్ ఫోటో 
మీరు మీ ప్రొఫైల్ ఫోటోను ఎవరైనా  చూడొద్దు అనుకుంటే  దానికి ఒక ట్రిక్ WhatsAppలో కూడా ఉంది. ముందుగా వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'ప్రైవసీ' విభాగాన్ని క్లిక్  చేయండి. ఇప్పుడు 'ప్రొఫైల్ ఫోటో'పై నొక్కండి. 'మై కాంటాక్ట్స్' లేదా 'మై కాంటాక్ట్స్ మినహా' అప్షన్స్  ఎంచుకోండి. మీరు మీ ప్రొఫైల్ ఫోటోను చూడొద్దు అనుకుంటున్నా కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి అయిపోతుంది.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
WhatsApp Tips : మీ వాట్సాప్ మెసేజెస్ మరింత స్టైలిష్‌గా కనిపించాలా? ఈ సింపుల్ టిప్స్ తో అద్భుతాలు చేయొచ్చు
Recommended image2
kitchen gadgets: వంటగదికి అవసరమైన అద్భుతమైన కిచెన్ గ్యాడ్జెట్స్ ఇవిగో, ధర చాలా తక్కువ
Recommended image3
Flipkart Sale: రూ.8,999లకే 5G ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మొబైళ్లపై పిచ్చెక్కిపోయే ఆఫర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved