ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు, వీడియోలను ఈజీగా డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా సింపుల్ గా చేసెయ్యోచ్చు..
ఈ రోజుల్లో ఎవరితోనైనా కనెక్ట్ అవడానికి లేదా ఫాలో ఆవడానికి ఇన్‌స్టాగ్రామ్ చాలా మందికి ఒక బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ అనేది సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ అండ్ అప్లికేషన్, ఇందులో ఎవరైనా ఫోటోలు, వీడియోలను షేర్ చేయవచ్చు. ఇప్పటివరకు 100 కోట్ల మందికి పైగా ఈ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
చాలా మంది దీని ద్వారా డబ్బు కూడా సంపాదిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సెలెబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్‌తోనే కనెక్ట్ అవుతుంటారు అలాగే ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంటారు. ప్రజలు కూడా వారికి నచ్చిన వారి ఫోటోలను లేదా వీడియోలను లైక్ చేస్తుంటారు. అయితే చాలా మంది వాటిని డౌన్‌లోడ్ చేయడం గురించి ఆలోచిస్తుంటారు, కానీ చేయలేకపోతుంటారు, ఎందుకంటే వారికి డౌన్‌లోడ్ ఎలా తెలియదు కాబట్టి. ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ లేదా కంప్యూటర్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు, వీడియోలను సులభంగా డౌన్ లోడ్ చేయవచ్చు ఎలా అంటే ..?
ఆండ్రాయిడ్ మొబైల్‌లో
డౌన్‌లోడ్ గ్రామ్‌తో మీరు ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఫోటో లేదా వీడియోను డౌన్‌లోడ్ చేయాలనుకున్నా దాని లింక్(copy link)ను సేకరించి డౌన్‌లోడ్‌గ్రామ్ వెబ్‌సైట్‌కు వెళ్లి పేస్ట్ చేయండి దీంతో సులభంగా డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ గ్రామ్ అనేది ఒక వెబ్ సైట్.
ఇన్‌స్టాగ్రామ్ నుండి ఫోటోలు, వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి ఫాస్ట్‌సేవ్ యాప్ ఒక బెస్ట్ ఆప్షన్. దీనికోసం మీరు మొదట మీ ఇన్‌స్టాగ్రామ్ యాప్ నుండి ఫాస్ట్‌సేవ్‌ని ట్రాక్ చేసి అనుమతించాలి, ఆ తర్వాత మీరు ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు, వీడియోల లింక్‌లను సులభంగా కాపీ-పేస్ట్ చేయవచ్చు అలాగే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపిల్ కూడా.
కంప్యూటర్ నుండి కూడా ఇన్‌స్టాగ్రామ్ ఫోటో-వీడియోలను
మొబైల్ లాగానే మీరు ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు, వీడియోలను కంప్యూటర్ నుండి డౌన్‌లోడ్‌గ్రామ్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఫోటో లేదా వీడియో కావాలంటే దాని లింక్‌ని కాపీ చేసి, డౌన్‌లోడ్‌గ్రామ్ సైట్‌కు వెళ్లి బాక్స్‌లో పేస్ట్ చేయండి అంతే దీంతో ఈజీగా డౌన్‌లోడ్ అవుతుంది.
మీరు సేవ్-ఓ-గ్రామ్ ఉపయోగించి ఇన్‌స్టాగ్రామ్ నుండి ఫోటోలు, వీడియోలను కూడా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు మొదట మీ కంప్యూటర్‌లో సేవ్-ఓ-గ్రామ్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి. దీని తర్వాత మీరు ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు, వీడియోలను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.