మూడు మైక్రోఫోన్లతో షియోమి కొత్త ఇయర్‌బడ్స్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 28 గంటల బ్యాకప్..
చైనా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమి తాజాగా ఫ్లిప్‌బడ్స్ ప్రోను చైనాలో లాంచ్ చేసింది. షియోమి ఫ్లిప్‌బడ్స్ ప్రో అనేది ట్రు వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, ఇందులో యాక్టివ్ వాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్‌సి) కూడా ఉంది. దీని డిజైన్ ప్రీమియం ఎయిర్‌పాడ్ లాంటిది.
ఇంకా డ్యూయల్ ట్రాన్స్పరెన్సీ మోడ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చింది. ఈ షియోమి ఫ్లిప్‌బడ్స్ ప్రో వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. వీటి ధర 799 చైనీస్ యువాన్ అంటే ఇండియాలో రూ.9,100. దీని సేల్ మే 21 నుండి చైనాలో ప్రారంభమవుతుంది. అయితే ఇండియాలో లభ్యత గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
షియోమి ఫ్లిప్‌బడ్స్ ప్రో స్పెసిఫికేషన్లు
షియోమి ఫ్లిప్‌బడ్స్ ప్రోలో 11 ఎంఎం సూపర్ డైనమిక్ డ్రైవర్ ఉంది. దీనిలో మూడు మైక్రోఫోన్లు ఉన్నాయి, ఇవి అడ్వాన్స్డ్ నాయిస్ క్యాన్సలేషన్ కి సపోర్ట్ చేస్తాయి. షియోమి ఇందులో క్వాల్‌కామ్ క్యూసిసి 5151 చిప్‌ను ఉపయోగించింది, ఇది స్పష్టమైన ఆడియోను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇంకా ఈ ఇయర్‌బడ్‌లు 40 డిబి వరకు డీప్ నాయిస్ తగ్గిస్తుందని, 99% వరకు బ్యాక్ గ్రౌండ్ నాయిస్ ఆపివేస్తుందని తెలిపింది.
దీనిలో డైలీ మోడ్, ఆఫీస్ మోడ్, ఎయిర్ ట్రావెల్ అనే మూడు మోడ్స్ ఉన్నాయి. డైలీ మోడ్ బయటి శబ్దాన్ని ఆపివేస్తుంది. మెరుగైన గేమింగ్ కోసం లో లాటెన్సి మోడ్ కూడా ఉంది. అంతేకాకుండా డ్యూయల్ డివైస్ స్మార్ట్ కనెక్షన్ ఫీచర్ కూడా అందించారు, అంటే మీరు ఒకేసారి రెండు డివైజెస్ కనెక్ట్ చేయవచ్చు.
కనెక్టివిటీ కోసం బ్లూటూత్ లో ఎనర్జీ, హెచ్‌ఎఫ్‌పి, ఎ 2 డిపి, ఎవిఆర్‌సిపి, ఎస్‌పిపిలతో బ్లూటూత్ వి5.2ను ఉంది. దీనికి క్వాల్కమ్ ఆప్ట్ఎక్స్ అడాప్టివ్ డైనమిక్ కోడెక్ ప్రోటోకాల్ కూడా ఉంది. కాల్స్ లేదా మ్యూజిక్ కంట్రోల్ కోసం టచ్ గెస్చర్స్, ఛార్జింగ్ కోసం యూఎస్‌బి టైప్-సి పోర్ట్ అందించారు.