ఐఫోన్ వాడుతున్నారా.. అయితే మీ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు.. అదేంటో తెలుసుకోండి..
మీరు పాత ఐఫోన్‌లో వాట్సాప్ ఉపయోగిస్తున్నారా అయితే ఈ వార్త మీకోసమే. రాబోయే రోజుల్లో వాట్సాప్ మీ ఫోన్ లో పనిచేయడం ఆపే అవకాశం ఉంది, ఎందుకంటే ఐఓఎస్ 9 ఉన్న ఐఫోన్లలో వాట్సాప్ ఇకపై పనిచేయదు.
ఆపిల్ స్మార్ట్ ఫోన్స్ ఐఓఎస్ 9 ఓఎస్‌తో ఉన్న ఐఫోన్లలో వాట్సాప్ అప్‌డేట్ నిలిపివేయనున్నట్లు డబ్ల్యూఏబెటాఇన్‌ఫో ఒక నివేదికలో తెలిపింది. ఈ నివేదిక ప్రకారం ఐఫోన్ లో వాట్సాప్ బీటా వెర్షన్ 2.21.50 తో ఇది నిర్ధారించింది. ఈ బీటా వెర్షన్ వినియోగదారులు తమ ఐఓఎస్ 9 ఐఫోన్‌లో వాట్సాప్‌ను ఉపయోగించడానికి వీలుండదు.
వాట్సాప్ ఐఫోన్ 4లో కూడా పనిచేయదు. ఇది కాకుండా ఐఫోన్ 5, 5 ఎస్, 5 సి యూజర్లు తమ ఫోన్‌లను అప్‌డేట్ చేయకపోతే వాట్సాప్ కొత్త వెర్షన్ వారి ఫోన్‌లలో పనిచేయడం ఆగిపోతుంది.
మరోవైపు వాట్సాప్ త్వరలో ఆర్కైవ్ చాట్ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది. ఇది కాకుండా యాప్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కూడా మార్చడానికి కంపెనీ కృషి చేస్తోందని చెబుతున్నారు. ఆర్కైవ్ చాట్ లో అన్ని నోటిఫికేషన్‌లు మ్యూట్ చేయబడతాయి.
అంతేకాకుండా వాట్సాప్ మల్టీడివైజ్ సపోర్ట్‌తో కూడా పనిచేస్తుందని కూడా నివేదించింది. యాప్ అప్ డేట్ తర్వాత మీరు ఒకే అక్కౌంట్ మల్టీ డివైజెస్ లో ఒకేసారి యాక్సెస్ చేయగలుగుతారు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ పని చేస్తుంది.