సోషల్ మీడియా యూజర్లకు షాకింగ్.. ఇండియాలో 3 లక్షలకు పైగా వాట్సప్ ఖాతాలపై నిషేధం.. ఎందుకంటే ?
ఈ రోజుల్లో సోషల్ మీడియా అక్కౌంట్ ప్రొఫెషనల్స్ నుండి సాధారణ ప్రజల వరకు అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సోషల్ మీడియా అక్కౌంట్ ఉపయోగిస్తున్నారు. ఇందులో భారతదేశంలో దాదాపు 55 కోట్ల మంది ప్రజలు వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారు. ఇతర కంపెనీలలాగే భారత ప్రభుత్వ కొత్త ఐటి చట్టం వాట్సప్‌లో అమలులోకి వచ్చింది.
ఈ చట్టం ప్రకారం, అన్ని సోషల్ మీడియా కంపెనీలు ప్రతి నెల వాట్సప్ వినియోగదారుల భద్రతా నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలి. తాజాగా వాట్సప్ నెలవారీ వినియోగదారు భద్రతా నివేదికను విడుదల చేసింది, ఈ సంవత్సరం జూన్-జూలై మధ్య మూడు మిలియన్లకు పైగా అంటే సుమారు మూడు లక్షలకు పైగా వాట్సాప్ ఖాతాలు నిషేధించింది. ఈ ఖాతాలపై చర్య ఎందుకు తీసుకుందో తెలుసా ?
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను సురక్షితంగా ఉంచడానికి అలాగే దుర్వినియోగం చేయకుండా ఉండడానికి ఈ చర్య తీసుకున్నట్లు వాట్సప్ తెలిపింది. జూన్ - జూలై 2021 మధ్య సుమారు 30 లక్షల 27 వేల ఖాతాలు నిషేధించింది. గ్రీవెన్స్ ఆఫీసర్‌కు వచ్చిన ఫిర్యాదుల తర్వాత ఈ ఖాతాలు ఆటోమేటిక్ టూల్ ద్వారా ప్రాసెస్ చేయబడింది.
ఈ కాలంలో వినియోగదారులు ఫిర్యాదు చేసిన 316 ఖాతాలు బ్లాక్ చేయబడ్డాయి ఇంకా 73 ఖాతాలు పూర్తిగా నిషేధించింది. 46 రోజుల్లో ఈ ఖాతాలపై ఈ చర్య తీసుకోబడింది . ఈ 46 రోజుల్లో 594 ఫిర్యాదులు వాట్సప్ వినియోగదారుల నుండి స్వీకరించగా వాటిలో 316 ఖాతాలను నిషేధించాలని డిమాండ్ చేశారు.
భద్రతా కారణాల వల్ల ఈ ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని గుర్తించడానికి ఆటోమేటిక్ టూల్ ఉందని వాట్సాప్ చెబుతోంది. మీకు ఏదైనా వాట్సప్ ఖాతా గురించి ఫిర్యాదు ఉంటే మీరు wa@support.whatsapp.com కి మెయిల్ చేయవచ్చు లేదా మీరు యాప్ నుండే ఖాతాను బ్లాక్ చేయవచ్చు లేదా రిపోర్ట్ చేయవచ్చు. కొత్త ఐటి చట్టం ప్రకారం, 33.3 మిలియన్ కంటెంట్‌పై చర్య తీసుకున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. ఈ చర్య జూన్ 16 నుండి జూలై 31 మధ్య జరిగింది.