Rediffmail login: రెడ్డిఫ్ మెయిల్ అంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది, ఇందులో ఎలా లాగిన్ చేయవచ్చాంటే ?
ఈ రోజుల్లో ఎవరైనా ఇమెయిల్ గురించి మాట్లాడినట్లయితే నాలుకపై వచ్చే మొదటి పేరు Gmailఅని వస్తుంది. అయితే డిజిటల్ ప్రపంచంలో జిమెయిల్ కాకుండా ఎన్నో ఇతర ఇమెయిల్ సేవలు కూడా ఉన్నాయి, వాటి సహాయంతో కూడా మీరు ఇమెయిల్‌లు పంపవచ్చు. వాటిలో RediffMail ఒకటి. మీరు దాని గురించి వినకపోతే ఆది ఎలా పని చేస్తుంది, అందులో ఎలా లాగిన్ అవ్వాలి మొదలైన వాటిని తెలుసుకుందాం..
అక్కౌంట్ ఇలా క్రియేట్ చేయవచ్చు
Rediffmailలో అక్కౌంట్ క్రియేట్ చేయడం చాలా సులభం. దీని కోసం మీరు Rediffmail వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఇక్కడ మీరు క్రియేట్ న్యూ అకౌంట్ పై క్లిక్ చేయాలి. దీని తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, అందులో మీరు మీ వివరాలను ఎంటర్ చేయాలి. అక్కడ మీ పూర్తి పేరు, అడిగిన సమాచారం అందించాలి. మీరు మీ ఆప్షన్ ప్రకారం యూజర్ పేరును సెలెక్ట్ చేసుకోవచ్చు.
మీరు సెలెక్ట్ చేసుకున్నా యూజర్ పేరుతో ఎలాంటి యూజర్ ఇప్పటికే లేనట్లయితే ఇక్కడ చూపిస్తుంది. యూజర్ పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. అలాగే పుట్టిన తేదీ, మొబైల్ నంబర్‌తో పాటు దేశం, నగరానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత అక్కౌంట్ క్రియేట్ అవుతుంది.
ఇలా లాగిన్ చేయవచ్చు
మీకు rediffmailలో అక్కౌంట్ ఉంటే మీరు చాలా సులభంగా లాగిన్ చేయవచ్చు. దీని కోసం మీరు మీ ఇమెయిల్ ఐడిని యూజర్ ఐడిలో ఎంటర్ చేయాలి. దీని తర్వాత మీరు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అవ్వవచ్చు ఇంకా మీ స్నేహితులకు ఇమెయిల్ పంపవచ్చు. అదనంగా, మీరు మీ ఇన్‌బాక్స్‌కు వచ్చే ఇమెయిల్‌లను కూడా చెక్ చేయవచ్చు.