యూట్యూబ్ ఐఓఎస్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్.. ఇప్పుడు ఈ యాప్ మినీ ప్లేయర్‌గా..
లాంగ్ వేటింగ్ తర్వాత చివరకు ప్రపంచవ్యాప్తంగా ఐఓఎస్ యూజర్ల కోసం యూట్యూబ్ పిక్చర్ ఇన్ పిక్చర్ (పిఐపి) మోడ్‌ను విడుదల చేసింది. అయితే కొత్త అప్‌డేట్ ప్రస్తుతం యూట్యూబ్ ప్రీమియం వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.
ఈ అప్‌డేట్ తర్వాత ఐఓఎస్ వినియోగదారులు మినీ ప్లేయర్ అంటే పిఐపి మోడ్‌లో యూట్యూబ్ వీడియోలను చూడవచ్చు. ఈ సంవత్సరం జూన్‌లో గూగుల్ ఈ సదుపాయాన్ని ఐఓఎస్ యూజర్లకు తీసుకొచ్చింది.
పిఐపి మోడ్ ప్రయోజనాలు
పిఐపి మోడ్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు ఒక యాప్‌ని మినీ ప్లేయర్‌గా ఉపయోగించడం. ఉదాహరణకు, మీరు యూట్యూబ్‌లో వీడియోను చూస్తున్నప్పుడు మరొక యాప్‌లో పని చేయాల్సి వస్తే మీరు యూట్యూబ్‌ను మినిమైజ్ చేయవచ్చు. అంటే యూట్యూబ్ ఒక మినీ ప్లేయర్ లాగా ప్లే అవుతూ ఉంటుంది. 2018 నుండి అండ్రాయిడ్ వినియోగదారులకు పిఐపి మోడ్ అందుబాటులో ఉంది.
ఐఓఎస్ లో పిఐపి మోడ్‌ను ఎలా ఉపయోగించాలి
మొదటి విషయం ఏమిటంటే దీనిని ఉపయోగించడానికి మీరు యూట్యూబ్ కి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. దీని తర్వాత మీ ఐఫోన్ లో యూట్యూబ్ యాప్‌ను తెరిచి మీకు ఇష్టమైన వీడియో కోసం సెర్చ్ చేసి ప్లే చేయండి. ఆ తర్వాత పైకి స్వైప్ చేసి హోమ్ బటన్‌ని నొక్కండి. దీని తర్వాత వీడియో ఆటోమేటిక్ గా పిఐపి మోడ్‌లో ప్లే అవుతుంది.