డ్యూయల్ ఫ్లాష్ లైట్ సెల్ఫి కెమెరాతో వివో సరికొత్త వేరియంట్.. ఇప్పుడు అదిరిపోయే కలర్లో...
చైనా టెక్నాలజి కంపెనీ వివో తాజాగా వి సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో వివోవి21 కొత్త వేరియంట్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. వివోవి21 ని ఇప్పుడు నియాన్ స్పార్క్ కలర్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది.
వివో వి21 నియాన్ స్పార్క్ కలర్ వేరియంట్ అన్ని ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుండి రూ .29,990 కి కొనుగోలు చేయవచ్చు. వివో వి21ని ఈ ఏడాది ఏప్రిల్‌లో భారతీయ మార్కెట్లో మొదట ప్రవేశపెట్టరు. వివో వి21 5జి మీడియాటెక్ డైమెన్సిటీ 800 యు ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది.
వివో వి21 5జి
వివో వి 21 5జి స్పెసిఫికేషన్‌లు చూస్తే ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఉంది. అంతేకాకుండా 6.44-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ AMOLED డిస్‌ప్లేతో 1080x2404 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉంది. డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 90Hz. MediaTek Dimensity 800U ప్రాసెసర్ ఫోన్‌లో ఇచ్చారు. 8 జిబి ర్యామ్, 256జిబి స్టోరేజ్ అందించారు. ఫోన్‌లో 3 జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంది.
వివో వి21 5జి కెమెరా
ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను ఇచ్చింది, దీనిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్ తో ఎపర్చరు f/1.79, రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మాక్రో ఉన్నాయి. బ్యాక్ కెమెరాలతో పాటు ఎల్‌ఈడి ఫ్లాష్ లైట్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్ ఉంటుంది. సెల్ఫీ కోసం 44 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది, దీని ఎపర్చరు f/2.0ఉంది. ఫ్రంట్ కెమెరాతో డ్యూయల్ ఫ్లాష్ లైట్ అందించారు
వివో వి21 5జి బ్యాటరీ అండ్ కనెక్టివిటీ
ఈ ఫోన్‌లో 5జి, 4జి ఎల్‌టిఈ, వై-ఫై, బ్లూటూత్ వి5.1, జిపిఎస్ / ఏ-జిపిఎస్, యూఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫోన్ 4000mAhబ్యాటరీతో లస్తుంది, అలాగే 33W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చారు.