Viral: ఇన్‌స్టాగ్రామ్‌లో మీ రీల్ వైరల్ వైరల్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా.?
Viral: సోషల్ మీడియా కేవలం వినోదానికి మాత్రమే కాకుండా డబ్బులు సంపాదించే వేదికగా మారింది. రీల్స్ చేస్తూ డబ్బు సంపాదించే వారు చాలా మంది ఉన్నారు. అయితే మీరు అప్‌లోడ్ చేసే రీల్‌కి ఎక్కువ రీచ్ రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఎందుకు వైరల్ అవుతున్నాయి
ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వినోదం వరకే పరిమితం కావడం లేదు. వ్యక్తిగత బ్రాండ్ బిల్డింగ్, బిజినెస్ ప్రచారం, తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేరుకోవడం అన్నీ రీల్స్ ద్వారానే జరుగుతున్నాయి. కానీ కొన్ని రీల్స్ లక్షల వ్యూస్ తెచ్చుకుంటే, మరికొన్ని వేల వద్దే ఆగిపోతున్నాయి. దీని వెనుక ప్రధాన కారణాలు రీల్ లెంగ్త్, ప్రారంభంలో హుక్, కంటెంట్ ఫార్మాట్.
రీల్ కనీసం ఎన్ని సెకన్లు ఉండాలి?
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు అధికారికంగా కనీస సమయం అనే నిబంధన లేదు. 3 సెకన్ల రీల్ కూడా అప్‌లోడ్ చేయవచ్చు. కానీ 3 నుంచి 5 సెకన్ల రీల్స్ ఎక్కువగా కనిపించవు. అందుకే బెస్ట్ లెంగ్త్ 7 నుంచి 15 సెకన్లు. ఈ రేంజ్‌లో ఉన్న రీల్స్‌కు వాచ్ టైమ్ ఎక్కువగా వస్తుంది. వైరల్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ. కొత్తగా రీల్స్ చేయడం మొదలు పెట్టేవారు 10 నుంచి 15 సెకన్లతో ప్రారంభిస్తే మంచిది.
ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం ఏమి చూస్తుంది?
ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం ప్రధానంగా రెండు విషయాలు గమనిస్తుంది.
* యూజర్ ఎంతసేపు రీల్ చూస్తున్నాడు.?
* పూర్తిగా చూస్తున్నాడా లేదా.?
చిన్న రీల్స్‌లో చాలామంది పూర్తిగా చూస్తారు. కొన్ని సార్లు రీల్ మళ్లీ ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంది. దాంతో వాచ్ టైమ్ పెరుగుతుంది. ఈ కారణంగానే 7 నుంచి 15 సెకన్ల రీల్స్‌కు ఎక్కువగా పుష్ వస్తుంది. కానీ చిన్నదిగా ఉండటం ఒక్కటే సరిపోదు. ఆసక్తికరంగా ఉండాలి.
మొదటి 3 సెకన్లలో హుక్ ఎందుకు ముఖ్యం?
రీల్ ప్రారంభమైన మొదటి 2 నుంచి 3 సెకన్లలోనే ప్రేక్షకుడు నిర్ణయం తీసుకుంటాడు. చూడాలా లేదా స్క్రోల్ చేయాలా అన్నది అప్పుడే ఫిక్స్ అవుతుంది. అందుకే “హాయ్ ఫ్రెండ్స్”, పేరు చెప్పడం, లోగో చూపించడం లాంటి ఇంట్రోలు పెట్టకండి. దీనికి బదులుగా యూజర్లను ఏదైనా ప్రశ్న అడగండి, ఆశ్చర్యపరిచే విషయం చెప్పండి, చివరి రిజల్ట్‌ను మొదట చూపించండి, ఇలా చేస్తే ప్రేక్షకుడు ఆగి చూస్తాడు.
15 నుంచి 30 సెకన్ల రీల్స్ ఎప్పుడు చేయాలి?
మీ రీల్‌లో ఏదైనా నేర్పించడం ఉంటే, టిప్స్ ఇవ్వడం ఉంటే, చిన్న స్టోరీ చెప్పాలంటే 15 నుంచి 30 సెకన్లు సరైన టైమ్. ఈ లెంగ్త్‌లో స్కిన్ కేర్, ఫిట్నెస్, ఆన్‌లైన్ ఆదాయం ఐడియాలు, మోటివేషన్, చిన్న ట్యుటోరియల్స్ బాగా వర్క్ అవుతాయి. ప్రతి 2 నుంచి 3 సెకన్లకు ఒక విజువల్ మార్పు ఉండేలా చూసుకోవాలి. మధ్యలో బోరింగ్ అనిపించకుండా ఫాస్ట్‌గా ఉండాలి. లాంగ్ రీల్స్ మాత్రం కంటెంట్ నిజంగా బలంగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. డీప్ ట్యుటోరియల్స్, ప్రశ్నోత్తరాలు, వ్లాగ్స్‌కు అవి ఉపయోగపడతాయి.
రీల్ వైరల్ కావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
మొదటి 3 సెకన్లలో యూజర్ అట్రాక్ట్ అయ్యేలా ఏదైనా షాక్ ఇవ్వండి. టెక్స్ట్ తప్పకుండా పెట్టండి (చాలామంది సౌండ్ లేకుండా చూస్తారు). ప్రతి 2 నుంచి 3 సెకన్లకు ఫ్రేమ్ మారాలి. ఎప్పుడూ వర్టికల్ ఫార్మాట్ వాడండి. ట్రెండింగ్ ఆడియో లేదా క్లియర్ వాయిస్ ఓవర్ పెట్టండి. యాక్టివ్ టైమ్‌లో పోస్ట్ చేయండి.
