MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Business
  • చాట్‌లోనే షాపింగ్, చెల్లింపులు ! ChatGPT UPI పైలట్ స్టార్ట్.. ఏంటో తెలుసా?

చాట్‌లోనే షాపింగ్, చెల్లింపులు ! ChatGPT UPI పైలట్ స్టార్ట్.. ఏంటో తెలుసా?

ChatGPT–UPI Pilot: భారత్ లో చాట్ జీపీటీ యూపీఐ (ChatGPT–UPI) పైలట్ ప్రారంభమైంది. యూజర్ల ఇప్పుడు చాట్ జీపీటీ ద్వారా నేరుగా షాపింగ్ చేసి, చెల్లింపులు చేయవచ్చు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 10 2025, 08:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫ్యూచర్ ఆఫ్ చాట్‌కామర్స్ : చాట్ జీపీటీతో షాపింగ్ + యూపీఐ పేమెంట్స్
Image Credit : Getty

ఫ్యూచర్ ఆఫ్ చాట్‌కామర్స్ : చాట్ జీపీటీతో షాపింగ్ + యూపీఐ పేమెంట్స్

భారతదేశం డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో పెద్ద ముందడుగు వేసింది. చాట్‌లోనే షాపింగ్ చేసి చెల్లింపులు చేసే చాట్ జీపీటీ యూపీఐ (ChatGPT–UPI) పైలట్ ప్రోగ్రామ్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా వినియోగదారులు ఇప్పుడు ఓపెన్ ఏఐ చాట్ జీపీటీలో వస్తువులను బ్రౌజ్ చేసి, ఆర్డర్ చేయడం, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

ఈ ప్రాజెక్ట్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), ఫిన్‌టెక్ సంస్థ రోజర్ పే (Razorpay), ఓపెన్ ఏఐ (OpenAI) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభ దశలో పరీక్షించేందుకు బిగ్ బాస్కేట్ (Bigbasket) మొదటి ఈ కామర్స్ సంస్థగా ఎంపికైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చాట్ జీపీటీ యూపీఐ పైలట్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి?
Image Credit : our own

చాట్ జీపీటీ యూపీఐ పైలట్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి?

ఈ పైలట్ ప్రోగ్రామ్‌లో వినియోగదారులు చాట్ జీపీటీ చాట్‌లోనే ఉత్పత్తులను వెతకవచ్చు, ధరలు పోల్చవచ్చు, ఆర్డర్ చేయవచ్చు. అక్కడే చెల్లింపులను యూపీఐ ద్వారా పూర్తి చేయవచ్చు. మొత్తం ప్రక్రియ ఒకే చాట్ విండోలో జరుగుతుంది. ఇది వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, డిజిటల్ కొనుగోళ్లను మరింత సులభతరం చేస్తుంది.

ఎన్పీసీఐ ప్రకారం, ఈ వ్యవస్థ యూపీఐ రియల్ టైమ్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి సురక్షితమైన, వేగవంతమైన ట్రాన్సాక్షన్ అనుభవాన్ని అందిస్తుంది.

35
ChatGPT–UPI Pilot: భాగస్వామ్య సంస్థలు
Image Credit : Asianet News

ChatGPT–UPI Pilot: భాగస్వామ్య సంస్థలు

ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ఎన్పీసీఐ, రోజర్ పే, ఓపెన్ ఏఐ సాంకేతిక భాగస్వామ్య సంస్థలుగా పనిచేస్తున్నాయి. చెల్లింపుల భాగంలో యాక్సిస్ బ్యాంకు, ఎయిర్ టెట్ పేమెంట్ బ్యాంకు భాగస్వామ్యంగా ఉన్నాయి. బిగ్ బాస్కేట్ వినియోగదారులు చాట్ జీపీటీలో ఉత్పత్తులను కొనుగోలు చేసే మొదటి ఈ కామర్స్ వేదికగా ఉంది.

ఓపెన్ ఏఐ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ ఆలివర్ జే (Oliver Jay) మాట్లాడుతూ.. “ఎన్పీసీఐ తో కలిసి పనిచేయడం మాకు ఆనందంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన చెల్లింపు వ్యవస్థ అయిన యూపీఐ సేవలను చాట్ జీపీటీలోకి తీసుకురావడంతో భవిష్యత్ డిజిటల్ వాణిజ్యానికి కొత్త దిశ చూపగలమని ఆశిస్తున్నాం” అని తెలిపారు.

45
చాట్ జీపీటీ యూపీఐ పైలట్ ఎలా పనిచేస్తుంది?
Image Credit : our own

చాట్ జీపీటీ యూపీఐ పైలట్ ఎలా పనిచేస్తుంది?

వినియోగదారులు చాట్ జీపీటీలో ఏవైనా ఉత్పత్తుల గురించి వివరాలు అడిగితే.. వివిధ ఆన్‌లైన్ స్టోర్ల నుండి ఉత్పత్తుల వివరాలు, ధరలు చూపిస్తుంది. మీకు కావాల్సిన బ్రాండ్, ధరలను పోల్చుకుని మీరు అక్కడే వాటిని కొనుగోలు చేయవచ్చు. అలాగే, యూపీఐ ద్వారా చెల్లింపులు జరపవచ్చు.

ఈ చెల్లింపులు రోజర్ పే అందించే మర్చంట్ ఇంటిగ్రేషన్ లేయర్ ద్వారా ప్రాసెస్ అవుతాయి. అంటే యూపీఐ రిజర్వ్ పే ఫీచర్ ద్వారా సురక్షితమైన చెల్లింపులు రియల్ టైమ్‌లో పూర్తవుతాయి.

55
వినియోగదారుల అనుమతితోనే చెల్లింపులు
Image Credit : gemini

వినియోగదారుల అనుమతితోనే చెల్లింపులు

ఈ ప్రోగ్రామ్‌లో ఏఐ ఏజెంట్లు వినియోగదారుల అనుమతితో మాత్రమే ట్రాన్సాక్షన్‌లు జరుపుతాయి. ఎన్పీసీఐ, రోజర్ పే భద్రతా ప్రోటోకాల్స్‌ను బలోపేతం చేశాయి. వినియోగదారుల డేటా లేదా చెల్లింపు వివరాలు చాట్ జీపీటీలో సేవ్ కాకుండా చర్యలు తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో మన డేటా బయటకు వస్తుందనే భయం లేదు.

ప్రస్తుతం ఈ ఫీచర్ పరిమితంగా కొద్దిమందికే అందుబాటులో ఉంది. పైలట్ ప్రోగ్రామ్ విజయవంతమైతే ఎన్పీసీఐ ఈ సేవలను మరిన్ని ఈ కామర్స్ వేదికలకు విస్తరించాలనే యోచనలో ఉంది.

బిగ్ బాస్కేట్ తర్వాత ఇతర కామర్స్, డిజిటల్ సేవా సంస్థలతో కలిసి ఈ ఫీచర్‌ను అందించే అవకాశం ఉంది. ఎన్పీసీఐ ఇప్పటికే IoT పరికరాల ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే ప్రాజెక్ట్‌పై పనిచేస్తోంది. ఇది స్మార్ట్‌వాచ్‌లు, కనెక్టెడ్ గ్యాడ్జెట్స్ వంటి పరికరాల్లో కూడా చాట్ జీపీటీ ద్వారా చెల్లింపులను సాధ్యమయ్యేలా చేస్తుంది. 

ఈ ఏఐ యూపీఐ మోడల్ భవిష్యత్తులో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లను పూర్తిగా ఆటోమేటెడ్ చేసే దిశగా ఒక పెద్ద ముందడుగు అవుతుందని ఎన్పీసీఐ పేర్కొంది. ఏఐ, యూపీఐ కలయికతో భారతీయ డిజిటల్ ఎకోసిస్టమ్ మరింత సమగ్రంగా, సులభంగా, భద్రంగా మారబోతోందని నిపుణులు చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇ-కామర్స్
కృత్రిమ మేధస్సు
భారత దేశం
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ లంచ్ బాక్స్ ఉంటే.. ఫుడ్ అస్స‌లు చ‌ల్లార‌దు. అదిరిపోయే ఎల‌క్ట్రిక్ లంచ్ బాక్స్‌
Recommended image2
Daily Investment: రోజుకు రూ.100 తో కోటీశ్వరులు కావొచ్చా? ఎక్స్‌పర్ట్ చెప్పిన సీక్రెట్ ప్లాన్ ఇదే
Recommended image3
యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు.? కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంటి.? అసలేం జరుగుతోంది.?
Related Stories
Recommended image1
రూ. 12,500 పెట్టుబడితో రూ. 40 లక్షల రాబడి.. అద్భుతమైన పోస్టాఫీసు పీపీఎఫ్ స్కీమ్‌
Recommended image2
Gold Rates: మూడు రోజుల్లోనే రూ.6000 పెరిగిన తులం బంగారం, బ్రేకులు ఎప్పుడు పడతాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved