ట్విటర్‌కు కేంద్రం గట్టి వార్నింగ్.. తక్షణమే నిబంధనలు పాటించాలి లేదంటే చర్యలు తప్పవు..
మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫార్మ్ ట్విట్టర్, భారత ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. కొత్త ఐటీ నిబంధనలను పాటించాలని మరోసారి గట్టిగా ఆదేశించింది. అయితే గతంలోనే ఇందుకు సమయం ఇచ్చినప్పటికీ ట్విట్టర్ కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను పూర్తిగా అమలు చేయలేదని భారత ప్రభుత్వం వెల్లడించింది.
ట్విట్టర్ నోడల్ కాంటాక్ట్ పర్సన్, గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించట్లేదని భారత ప్రభుత్వం పదేపదే చెబుతుండగా, మరోవైపు కొత్త నిబంధనలను అమలు చేశానని ట్విట్టర్ ఢీల్లీ హైకోర్టుకు తెలిపింది. ఈ నియామకం మే 28న జరిగినట్లు వెల్లడించింది.
కొత్త మార్గదర్శకాలు మే 26 నుంచి అమల్లోకి వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. వీటిని పాటించటానికి సోషల్ మీడియా సంస్థలకు ఇచ్చిన 3 నెలల వ్యవధి ముగిసిన తరువాత కూడా ట్విట్టర్ భారతదేశంలో చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ పర్సన్, గ్రీవెన్స్ ఆఫీసర్లను నియమించలేదు.
ఈ నోటీసు తర్వాత కూడా ట్విట్టర్ కొత్త నిబంధనను అమలు చేయకపోతే దానిపై చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విటర్ ఖాతాకు బ్లూటిక్ తొలగింపు వివాదం తరువాత తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
twitter verification