అమెజాన్ ప్రైమ్ వీడియోకి పోటీగా నెట్‌ఫ్లిక్స్ రూ .299 కొత్త ప్లాన్.. ఈ ప్యాక్ ద్వారా లాభం ఏంటంటే..
భారతదేశంలోని ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ మొబైల్‌ప్లస్ అని పిలువబడే ఒక కొత్త ప్లాన్‌ను పరీక్షిస్తోంది. ఈ నెట్‌ఫ్లిక్స్ కొత్త మొబైల్ ప్లాన్ ధర 299 రూపాయలు. గత సంవత్సరం ప్రారంభంలో కూడా కంపెనీ రూ .199 మొబైల్ ప్లాన్‌ను ప్రారంభించింది, అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ 299 రూపాయల నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ ద్వారా మీకు ఏమి లభిస్తుందో తెలుసుకుందాం ....
నెట్‌ఫ్లిక్స్ రూ .299 ప్లాన్ ప్రయోజనాలు నెట్‌ఫ్లిక్స్ రూ .199 ప్లాన్‌కు భిన్నంగా ఉంటుంది. రూ. 199 ప్లాన్ తో కేవలం మొబైల్ లో మాత్రమే అక్సెస్ అవుతుంది. కానీ రూ .299 మొబైల్ ప్లస్ ప్లాన్ తో మీకు మొబైల్ తో పాటు కంప్యూటర్, మాక్, మాక్‌బుక్‌లో కూడా యాక్సెస్ లభిస్తుంది
ఈ ప్లాన్ లో కూడా మీరు హై-డెఫినిషన్ అంటే హెచ్‌డి వీడియో (720 పిక్సెల్స్) కంటెంట్ చూడవచ్చు. నెట్‌ఫ్లిక్స్ రూ.199 మొబైల్ ప్లాన్ కేవలం స్టాండర్డ్ డేఫినేషన్ లో మాత్రమే చూడటానికి అవకాశం ఇస్తుంది, అంటే 480 పిక్సెల్స్ వీడియో.
నెట్‌ఫ్లిక్స్ నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం భారతదేశ వినియోగదారులు ఇతర దేశాల కంటే ఎక్కువగా ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో
అమెజాన్ ప్రైమ్ వీడియోకి పోటీగా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లస్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ సంవత్సరం జనవరిలో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్లాన్ నెలకు రూ .89తో విడుదల చేసింది, అయితే ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లకు మాత్రమే. అలాగే ఇది కేవలం మొబైల్ ప్లాన్ మాత్రమే.
నెట్‌ఫ్లిక్స్ కొత్త రూ .299 ప్లాన్ గురించి కంపెనీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. నెట్‌ఫ్లిక్స్ గతంలో పోలాండ్‌లో ఈ ప్లాన్ ని పరీక్షించింది.