ఈ బాతు ప్రతి నెలా రూ.3 లక్షలు సంపాదిస్తుందట.. టిక్‌టాక్‌లో కూడా భలే ఫాలోయింగ్..
సాధారణంగా మనుషులు ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలా అని కలల కంటుంటారు, మరికొందరు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు పెంపుడు జంతువులు లేదా పక్షులు మనుషుల కోసం కూడా పనిచేస్తాయని విన్నారా... అవును.. నిజమే..
ఒక అమెరికన్ మహిళకు ప్రతి సంవత్సరం 50వేల డాలర్లు అంటే రూ. 37,12,420 సంపాదించే బాతు ఉంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బాతు టిక్‌టాక్ స్టార్ కూడా అంతేకాదు టిక్‌టాక్‌లో 2.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఈ బాతు పేరు ముంచ్‌కిన్ దీని యజమాని పేరు క్రిస్సీ ఎల్లిస్.
ముంచ్‌కిన్‌కి డంకిన్ డక్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్ కూడా ఉంది. మంచ్‌కిన్‌ను పెంచిన మహిళ న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడుతూ పెన్సిల్వేనియాలో ఒకే ఒక్క ఫాస్ట్ ఫుడ్ చైన్ ఉంది అదే డంకిన్ డోనట్స్. ఈ స్టోర్ కి పేరు డంకిన్ డక్స్ నుండి వచ్చింది. అయితే ముంచ్‌కిన్ వీడియోలు ఎప్పటికప్పుడు భారీగా వైరల్ అవుతున్నాయి.
16 సంవత్సరాల వయస్సు నుండి పెంపుడు జంతువులను పెంచడం తనకు చాలా ఇష్టం అని క్రిస్సీ ఆలిస్ తెలిపింది. అయితే ఆమె తన పెంపుడు జంతువులతో ప్రతిచోటుకి వెళ్ళేది. ఈ కారణంగా స్కూల్లో ఆమెని పిల్లలు ఆటపట్టించేవారు. దీంతో విసిగిపోయిన క్రిస్సీ ఆలిస్ ముంచ్‌కిన్ కోసం ఒక ఛానెల్‌ని సృష్టించింది. డబ్బులు సంపాదించడానికి ఆమె కిరాణా దుకాణంలో వారానికి 40 గంటలు పని చేయాల్సి వచ్చేది అయితే ఇప్పుడు కేవలం అరగంటలో డంకిన్ డక్స్ ఛానెల్ ద్వారా అంతకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నానని క్రిస్సీ ఎల్లిస్ పేర్కొంది.
డంకిన్ డక్స్ కి చాలా స్పాన్సర్ పోస్ట్‌లను వస్తున్నాయి. అంతేకాకుండా మంచి మొత్తంలో ఫండ్స్ కూడా ఉన్నాయి. ప్రతి నెలా క్రిస్సీ ఆలిస్ డంకిన్ డక్స్ టిక్‌టాక్ ఖాతా నుండి 4,500 డాలర్లు అంటే దాదాపు రూ. 3,33,972 సంపాదిస్తుందట. కొన్నిసార్లు బోరింగ్ మీ అతిపెద్ద బలంగా మారుతుందని, ప్రజలు మీతో ప్రేమలో పడతారని క్రిస్సీ ఎల్లిస్ చెప్పారు.