పెద్ద బ్యాటరీ, ఎక్సినోస్ 850 ప్రాసెసర్ తో శామ్‌సంగ్ కొత్త స్మార్ట్ ఫోన్.. అతితక్కువ ధరకే అందుబాటులోకి..
ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్‌సంగ్ కొత్త గెలాక్సీ ఎం12 లాంచ్ తేదీని ప్రకటించింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం12 స్మార్ట్ ఫోన్ మార్చి 11న ఇండియాలో లాంచ్ కానుంది. అమెజాన్‌తో పాటు శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. గత నెలలో శామ్సంగ్ గెలాక్సీ ఎం12 వియత్నాంలో విడుదల చేశారు. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 12 అనేది గత సంవత్సరం లాంచ్ చేసిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎం11కి అప్‌గ్రేడ్ వెర్షన్.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 12 స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ ఓఎస్ బేస్డ్ వన్ యుఐ కోర్, 720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్, 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్ ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో టిఎఫ్‌టి ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే అందించారు. ఈ శామ్‌సంగ్ ఫోన్‌లో ఎక్సినోస్ 850 ప్రాసెసర్, 3/4/6 జిబి ర్యామ్ తో 32/64/128 జిబి స్టోరేజ్ ఉన్నాయి. వీటిని మెమరీ కార్డ్ సహాయంతో 1 టిబి వరకు పెంచుకోవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ ఎం 12 కెమెరా
కెమెరా గురించి చెప్పాలంటే దీనికి నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ కెమెరా 48 మెగాపిక్సెల్స్ తో ఎపర్చరు ఎఫ్ / 2.0 ఉంది. రెండవ లెన్స్ 5 మెగాపిక్సెల్స్ కెమెరాతో అల్ట్రా వైడ్ దీని ఎపర్చరు f/2.2. మూడవ లెన్స్ కెమెరా 2 మెగాపిక్సెల్ డేప్త్ సెన్సార్, నాల్గవది 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కెమెరా అందించారు. ఫోన్‌లో సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎం 12 బ్యాటరీ
ఈ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ గురించి చెప్పాలంటే దీనికి 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉంటాయి. ఫోన్ పవర్ బటన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. దీనిలో 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. 4జి నెట్‌వర్క్‌లో 58 గంటల బ్యాకప్ క్లెయిమ్ చేయబడింది. ఫోన్ బరువు 221 గ్రాములు. ప్రస్తుతానికి ఇండియాలో ఈ ఫోన్ ధర గురించి అధికారిక సమాచారం లేదు, కాని దీని ధర రూ .12,000 కంటే తక్కువగా ఉంటుందని లీక్ అయిన కొన్ని నివేదికలో పేర్కొన్నారు.