డాల్బీ ఆడియోతో శామ్‌సంగ్ గెలాక్సీ ఎ32 స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలు మీకోసం..
శామ్‌సంగ్ ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎ32ను భారత్‌లో లాంచ్ చేసింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎ32 స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎ సిరీస్ వస్తున్న కొత్త ఫోన్. గెలాక్సీ ఎ32లో 90 హెర్ట్జ్ డిస్‌ప్లే ఉంది.అంతేకాకుండా క్వాడ్ కెమెరా సెటప్ కూడా దీనిలో అందించారు. గెలాక్సీ ఎ32 స్మార్ట్ ఫోన్ గతంలో గ్లోబల్ మార్కెట్ రష్యా, యు.కెలో 4జి ఇంకా 5జి కనెక్టివిటీతో విడుదల చేశారు, అయితే శామ్సంగ్ ఇండియా ఈ ఫోన్‌లో 5జి కనెక్టివిటీని అందించలేదు.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 32 ధర
శామ్‌సంగ్ గెలాక్సీ ఎ32 ప్రారంభ ధర రూ .21,999, అంటే ఈ ధర వద్ద మీకు 6 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఈ ఫోన్ బ్లాక్, వైట్, నీలం, వైలెట్ కలర్ వేరియంట్‌లో కొనుగోలు చేయవచ్చు. శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్, రిటైల్ స్టోర్, ఇతర ఇ-కామర్స్ సైట్లు అందుబాటులో ఉంది. అంతేకాదు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుతో రూ .2,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 32 4జి స్పెసిఫికేషన్లు
శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 32 4జికి 6.4 అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ సూపర్ ఏఎంఓఎల్‌ఈడి ఇన్ఫినిటీ యు నాచ్ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌కు మీడియాటెక్ హెలియో జి80 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్ తో 128 జిబి స్టోరేజ్ అందించారు, వీటిని మెమరీ కార్డ్ సహాయంతో 1 టిబి వరకు పెంచుకోవచ్చు.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 32 4జి కెమెరా
కెమెరా గురించి చెప్పాలంటే శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 32లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్ కెమెరా, దీని ఎపర్చరు ఎఫ్ / 1.8 ఉంది. రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మూడవ లెన్స్ 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కెమెరా, నాల్గవ లెన్స్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో శామ్‌సంగ్ 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చింది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 32 4జి బ్యాటరీ
బ్యాటరీ ఇంకా కనెక్టివిటీ గురించి చెప్పాలంటే దీనిలో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు, ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ కోసం ఫోన్‌లో యుఎస్‌బి టైప్ సి పోర్ట్ అందించారు. ఫోన్ బరువు 184 గ్రాములు. ఫోన్‌లో డిస్ ప్లే పై ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.