శామ్‌సంగ్ కార్నివాల్ ఆఫర్: ఎం సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు.. కొద్దిరోజులే అవకాశం..
ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్‌సంగ్ నుండి వచ్చిన గెలాక్సీ ఎం సిరీస్ భారతదేశంలో లాంచ్ చేసి రెండేళ్లు పూర్తికావొస్తుంది. భారతదేశంలో గెలాక్సీ ఎం సిరీస్ రెండవ వార్షికోత్సవం సందర్భంగ కంపెనీ 'శామ్‌సంగ్ కార్నివాల్' ను నిర్వహిస్తుంది.
దీని కింద గెలాక్సీ ఎం సిరీస్ కొన్ని ఫోన్లపై రూ .1000 తగ్గింపును పొందువచ్చు. శామ్‌సంగ్ కార్నివాల్ ఆఫర్ అమెజాన్ ఇండియా, శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్ లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా కూడా పొందవచ్చు.
మీరు ఈ రెండు స్టోర్ల నుండి గెలాక్సీ ఎం సిరీస్‌ను కొనుగోలు చేస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుపై మీకు రూ .1000 క్యాష్‌బ్యాక్, ఇది కాకుండా మీరు పాత ఫోన్‌ను ఎక్స్ ఛేంజ్ చేసి కొత్త గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే మీకు రూ .1,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది.
ఈ ఆఫర్ గెలాక్సీ ఎం21, గెలాక్సీ ఎం31, గెలాక్సీ ఎం31ఎస్, గెలాక్సీ ఎం51 లకు వర్తిస్తుంది. ఈ ఆఫర్ మార్చి 9-12 నుండి పొందవచ్చు. మొత్తంమీద మీరు గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్‌లను కొనుగోలు చేస్తే మీకు మొత్తం రూ .2,000 తగ్గింపు లభిస్తుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం సిరీస్ భారతదేశంలో ఎంతో పాపులరిటీ పొందింది. ఈ సిరీస్ కింద శామ్‌సంగ్ గెలాక్సీ ఎం12 ఈ నెలలో భారత్‌లో లాంచ్ కానుంది. అంతకుముందు శామ్‌సంగ్ గెలాక్సీ ఎం12 వియత్నాంలో లాంచ్ అయింది. గెలాక్సీ ఎం12 గత సంవత్సరం ప్రారంభించిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎం11కి అప్‌గ్రేడ్ వెర్షన్.
లీక్ అయిన కొన్ని నివేదికల ప్రకారం శామ్‌సంగ్ గెలాక్సీ ఎం12 ధర భారత మార్కెట్లో రూ .12 వేల కంటే తక్కువగా ఉండొచ్చు. ఇది కేవలం లీకైన సమాచారం అయినప్పటికి కంపెనీ అధికారిక ధృవీకరణ చేయలేదు. లాంచ్ తేదీ గురించి కూడా శామ్‌సంగ్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.