జూలై 23న రియల్‌మీ నుండి కొత్త లేటెస్ట్ ప్రాడెక్ట్స్ లాంచ్.. ఇండియాల్లో వీటి ధర, ఫీచర్స్ తెలుసుకోండి..
చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ రెండు కొత్త ఉత్పత్తులను వచ్చే వారం భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. ఇందులో రియల్‌మీ వాచ్ 2 ప్రో, రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2 నియో ఉన్నాయి. జూలై 23న కంపెనీ కొత్త స్మార్ట్‌వాచ్, కొత్త వైర్‌లెస్ బడ్స్ విడుదల చేయబోతోంది.
ఈ రెండు ఉత్పత్తులు అమెజాన్ ఇండియా ద్వారా అందుబాటులో రానున్నాయి, కాబట్టి రియల్‌మీ వాచ్ 2 ప్రో, రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2 నియో అమెజాన్ నుండి మాత్రమే విక్రయించనున్నారు. రియల్‌మీ వాచ్ 2 ప్రో, రియల్‌మే బడ్స్ వైర్‌లెస్ 2 నియోను కొద్ది రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టారు. మే నెలలో రియల్‌మీ వాచ్ 2 ప్రోని ఇంతకు ముందు మలేషియాలో, రియల్‌మే బడ్స్ వైర్‌లెస్ 2 నియోని శ్రీలంకలో ప్రారంభించారు.
మలేషియాలో శ్రీలంకలో వాచ్ 2 ప్రో ధర సుమారు రూ .5,300 కాగా, శ్రీలంకలో రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2 నియో ధర సుమారు రూ .3,000. భారతీయ మార్కెట్లో కూడా ఈ ఉత్పత్తులను ఒకే ధరతో తీసుకురవొచ్చు. రియల్‌మీ వాచ్ 2 ప్రో బ్లాక్ అండ్ గ్రే స్ట్రాప్‌లలో లభిస్తుండగా, రియల్‌మే బడ్స్ వైర్‌లెస్ 2 బ్లూ, కండి ఎల్లో కలర్స్‌లో లభిస్తుంది.
రియల్‌మీ వాచ్ 2 ప్రో ఫీచర్స్
రియల్‌మీ వాచ్ 2 ప్రోలో 1.75-అంగుళాల టచ్ కలర్ డిస్ ప్లే, బ్యాటరీకి సంబంధించి 14 రోజుల బ్యాకప్, 24 గంటల హార్ట్ రేట్ మానిటరింగ్ ఫీచర్ ఇచ్చారు. ఇది బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, స్లీప్ డిటెక్షన్ వంటి చాలా ఫీచర్స్ తో వస్తుంది. దీనిలో 90 స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి, ఇందులో అవుట్ డోర్ రన్నింగ్, ఫుట్‌బాల్, యోగా, క్రికెట్ వంటి మోడ్‌లు కూడా ఉన్నాయి. వాటర్ రిసిస్టంట్ కోసం దీనికి IP68 రేటింగ్ లభించింది.
రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2 నియో ఫీచర్లు
దీనిలో 11.2 ఎంఎం బేస్ బూస్ట్ డ్రైవర్ ఉంది. అంతేకాకుండా బ్యాటరీకి సంబంధించి 17 గంటల బ్యాకప్‌ను క్లెయిమ్ చేసింది. ఛార్జింగ్ చేసిన 10 నిమిషాల్లో 120 నిమిషాల ప్లేబ్యాక్ లభిస్తుందని పేర్కొంది. దీన్ని రెండు గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఛార్జింగ్ కోసం యూఎస్‌బి టైప్-సి పోర్ట్ ఇచ్చారు. ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) ఈ బడ్స్‌లో సపోర్ట్ చేస్తుంది. వాటర్ రిసిస్టంట్ కోసం IPX4 రేటింగ్‌ను పొందింది.