మరికొద్ది రోజులలో రియల్‌మీ మెగా ఈవెంట్.. స్మార్ట్ టీవీ-ఫోన్‌లతో లేటెస్ట్ ప్రాడెక్ట్స్ లాంచ్..
చైనా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ రియల్‌మీ మరోసారి మెగా ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. సెప్టెంబర్ 24న జరగబోయే రియల్‌మీ ఈవెంట్లో రియల్‌మీ నార్జో 50 సిరీస్, రియల్‌మీ బ్యాండ్ 2, రియల్‌మీ స్మార్ట్ టీవీ నియో లాంచ్ చేయనుంది.
ఈ ఈవెంట్ కోసం కంపెనీ మీడియా ఆహ్వానాలను కూడా ప్రారంభించింది. నార్జో 50 సిరీస్ కింద రెండు స్మార్ట్‌ఫోన్‌లు విడుదల చేయనుంది, ఇందులో రియల్‌మీ నార్జో 50, రియల్‌మీ నార్జో 50 ప్రో ఉన్నాయి. లీకైన నివేదికలో రెండు ఫోన్‌లు కాకుండా రియల్‌మీ నార్జో 50ఏ కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది.
రియల్‌మీ నార్జో 50 సిరీస్, స్మార్ట్ బ్యాండ్, స్మార్ట్ టీవీ లాంచ్ సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ చేయనున్నారు. ఈ ఈవెంట్ వర్చువల్ గా నిర్వహించనున్నారు. రియల్‌మీ నార్జో 50 సిరీస్‌లో గ్రాఫిక్స్ కోసం ఏఆర్‌ఎం మాలి జి52 జిపియూతో 12ఎన్‌ఎం మీడియా టెక్ హీలియో జి85 ప్రాసెసర్ లభిస్తుంది.
అంతేకాకుండా, రియల్‌మీ నార్జో 50 సిరీస్‌లో 6000mAh బ్యాటరీ ఇచ్చారు, దీనితో 53 గంటల బ్యాటరీ స్టాండ్‌బై క్లెయిమ్ చేయబడింది. బ్యాటరీకి సంబంధించి 8 గంటల నిరంతర గేమింగ్ క్లెయిమ్ చేసింది. ఫోన్‌తో సూపర్ పవర్ సేవింగ్ మోడ్ కూడా అందుబాటులో ఉంటుంది.
ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్స్ తో ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. రెండవ లెన్స్ 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్, మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మాక్రో. సూపర్ నైట్‌స్కేప్ మోడ్ కూడా కెమెరాతో వస్తుంది. వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే ఫోన్‌తో రాబోతుంది.
రియల్‌మీ బ్యాండ్ 2 స్పెసిఫికేషన్లు
రియల్‌మీ బ్యాండ్ 2 పెద్ద డిస్‌ప్లేతో వస్తుంది. ఈ బ్యాండ్ ని ఇటీవల మలేషియాలో పరిచయం చేసింది. ఈ బ్యాండ్ 50 ప్రొఫెషనల్ డయల్ ఫెసెస్ తో 1.4-అంగుళాల టచ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ బ్యాండ్‌లో హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకింగ్ కోసం సెన్సార్ ఇచ్చారు. ఈ బ్యాండ్‌తో 90 స్పోర్ట్స్ మోడ్‌లు వస్తాయి. ఇంకా 204mAh బ్యాటరీ లభిస్తుంది, అలాగే 12 రోజుల బ్యాకప్ ఉంటుందని కంపెనీ పేర్కొంది.