సూపర్ ఆమోలెడ్ డిస్ ప్లేతో రియల్‌మీ 8 సిరీస్ వచ్చేసింది.. ఫీచర్స్, ధర పూర్తి వివరాలు మీకోసం..
చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తాజాగా 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో లాంచ్ చేసింది. రియల్‌మీ 8 సిరీస్ లో రెండు ఫోన్‌లు ఉన్నాయి, అయితే ఇవి గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన రియల్‌మీ 7 సిరీస్ కి అప్ గ్రేడ్ వెర్షన్లు. రియల్‌మీ 8 సిరీస్ ఫోన్‌లలో ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాడ్ కెమెరా సెటప్ ఉన్నాయి.
రియల్‌మీ 8 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .17,999, రియల్‌మీ 8 ప్రో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .19,999. ఈ ఫోన్‌లను బ్లాక్, బ్లూ రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ టాప్ వేరియంట్ అంటే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ .16,999. '
ఈ ఫోన్ సైబర్ బ్లాక్ మరియు సైబర్ సిల్వర్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. రియల్‌మీ 8 సిరీస్ సెల్ ఈ రోజు అంటే మార్చి 25 మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మీ వెబ్‌సైట్ లేదా అన్ని స్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది. 9W ఇంకా 12Wలలో లభించే స్మార్ట్ బల్బులను కూడా రియల్‌మీ విడుదల చేసింది. రియల్‌మీ స్మార్ట్ బల్బ్ 9 వాట్ల ధర 799 రూపాయలు, 12 వాట్ల ధర 999 రూపాయలు.
రియల్‌మీ 8 ప్రో స్పెసిఫికేషన్లు
రియల్‌మీ 8 ప్రోలో ఆండ్రాయిడ్ 11 రియల్‌మీ యుఐ 2.0, 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, టచ్ రేటు 180 హెర్ట్జ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 720 జి ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం అడ్రినో 618 జిపియు, 8 జిబి ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్, 128 జిబి స్టోరేజ్ లభిస్తాయి, వీటిని మెమరీ కార్డ్ సహాయంతో పెంచుకోవచ్చు.
రియల్‌మీ 8 ప్రో
కెమెరా గురించి చెప్పాలంటే ఫోన్‌లో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రైమరీ లెన్స్ 108 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ ఐసోసెల్ హెచ్‌ఎం 2 దాని ఎపర్చరు ఎఫ్ / 1.88. రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ కెమెరా, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరా, నాల్గవది 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరా, ఉన్నాయి. సెల్ఫీ కోసం, ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 ఫ్రంట్ కెమెరా లభిస్తుంది, దీని ఎపర్చరు f/2.45 కలిగి ఉంటుంది.
రియల్‌మీ 8 ప్రో బ్యాటరీ
కనెక్టివిటీ గురించి చూస్తే ఇందులో డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, 4 జి, బ్లూటూత్ వి5.0 , జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్ లో 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది 50W సూపర్ డర్ట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌తో పాటు 65W ఫాస్ట్ ఛార్జర్ కూడా బాక్స్‌లో లభిస్తుంది. ఫోన్ బరువు 176 గ్రాములు.
రియల్‌మీ 8 స్పెసిఫికేషన్లు
రియల్‌మీ 8 లో ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యుఐ 2.0, 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఫోన్‌లో మీడియాటెక్ హెలియో జి 95 ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం మాలి-జి 76 ఎంసి 4 జిపియు ఉన్నాయి. ఫోన్ లో 8 జీబీ ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్ ఇంకా 128 జిబి వరకు స్టోరేజీ పొందుతుంది, వీటిని మెమరీ కార్డ్ సహాయంతో పెంచవచ్చు.
రియల్‌మీ 8
కెమెరా గురించి చూస్తే ఫోన్‌లో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, వీటిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్ ఎపర్చరు ఎఫ్ / 1.79. రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్. మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, నాల్గవది 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెల్ఫీ కెమెరా, ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 ఫ్రంట్ కెమెరా లభిస్తుంది, ఇది ఎపర్చరు f / 2.45 ఉంటుంది.
రియల్‌మీ 8 బ్యాటరీ
కనెక్టివిటీ గురించి మాట్లాడితే దీనికి డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, 4 జి, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇది కాకుండా, ఫోన్‌లో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, 30W సూపర్‌డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌తో పాటు, 65W ఫాస్ట్ ఛార్జర్ కూడా బాక్స్‌లో లభిస్తుంది. ఫోన్ బరువు 177 గ్రాములు.