ఫోన్ చార్జింగ్ షేరింగ్ ఫీచర్ తో గూగుల్ లేటెస్ట్ ఫోన్.. ఇప్పుడు స్వంత ప్రాసెసర్‌తో లాంచ్..
గత కొద్దిరోజులుగా లీక్ రిపోర్ట్స్ తరువాత గూగుల్(google) రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో ఆఫ్ పిక్సెల్ సిరీస్‌ను విడుదల చేసింది. పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో కోసం గూగుల్ స్నాప్‌చాట్‌తో భాగస్వామ్యంచేసుకుంది. ఇప్పుడు ఈ రెండు ఫోన్‌లలో 'క్విక్ ట్యాప్ టు స్నాప్' ఫీచర్ ఇచ్చారు. ఈ ఫీచర్ సహాయంతో పిక్సెల్ ఫోన్‌ల వినియోగదారులు స్నాప్‌చాట్ (Snapchat)కోసం షార్ట్‌కట్ మోడ్‌ను పొందుతారు.
అలాగే ఆగ్మెంట్ రియాలిటీ (AR) బైక్ విడిగా అందుబాటులో ఉంటుంది. పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో ఫోన్‌లలో మ్యాజిక్ ఎరేజర్ అనే టూల్ ఉంది, దీని సహాయంతో ఏదైనా ఫోటోలో ఉన్న ఆన్ వాంటెడ్ సబ్జెక్ట్ తొలగించవచ్చు. పిక్సెల్ 6 , పిక్సెల్ 6 ప్రో పిక్సెల్ ఫోన్‌లలో గూగుల్ సొంత ప్రాసెసర్‌ని ఉపయోగించింది, దీనికి టెన్సర్ అని పేరు పెట్టారు. దీనికి మెరుగైన కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్ ఉంది.
పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో ధర
పిక్సెల్ 6(pixel 6) ప్రారంభ ధర $ 599 డాలర్లు అంటే దాదాపు రూ. 45,000, పిక్సెల్ 6 ప్రో ప్రారంభ ధర $ 899 అంటే సుమారు రూ. 67,500. పిక్సెల్ 6 కిండా కోరల్, సోర్టా సీఫోమ్, స్టార్మి బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది, అయితే పిక్సెల్ 6 ప్రో క్లౌడీ వైట్, సోర్టా సన్నీ, స్టార్మి బ్లాక్ షేడ్స్‌లో లభిస్తుంది. భారతదేశంలో రెండు ఫోన్‌ల లభ్యత గురించి ప్రస్తుతం సమాచారం లేదు.
పిక్సెల్ 6 స్పెసిఫికేషన్‌లు
గూగుల్ పిక్సెల్ 6 లో ఆండ్రాయిడ్ 12 ఉంది. ఇంకా డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఇచ్చారు వాటిలో ఒకటి ఇ-సిమ్. 6.4-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఓఎల్‌ఈడి డిస్ ప్లే. డిస్‌ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ సపోర్ట్ వస్తుంది. టెన్సర్ ప్రాసెసర్, 8 జిబి LPDDR5 ర్యామ్, 256జిబి వరకు స్టోరేజ్ ఉంది.
పిక్సెల్ 6లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్స్, ఎపర్చరు f / 1.85. ఈ లెన్స్‌తో వైడ్ యాంగిల్ సపోర్ట్ చేస్తుంది. రెండవ లెన్స్ 12 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్. వెనుక కెమెరాకు లేజర్ డిటెక్ట్ ఆటోఫోకస్ (LDAF), ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉంది. ముందు భాగంలో f/2.0 అపెర్చర్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
కనెక్టివిటీ కోసం ఫోన్‌లో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ v5.2, GPS / A-GPS, NFC, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ ప్రీ-లోడెడ్ లైవ్ ట్రాన్స్‌లేట్ సదుపాయంతో కూడా వస్తుంది. 30W వైర్డ్ అండ్ 21W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4614mAh బ్యాటరీ ఉంది. ఏదైనా ఇతర ఫోన్‌ను కూడా ఫోన్ నుండి ఛార్జ్ చేయవచ్చు. ఫోన్ బరువు 207 గ్రాములు.
పిక్సెల్ 6 ప్రో స్పెసిఫికేషన్‌లు
పిక్సెల్ 6 ప్రో (pixel 6pro)ఒక ఇ-సిమ్‌తో డ్యూయల్ సిమ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో ఆండ్రాయిడ్ 12 ఇచ్చారు. పిక్సెల్ 6 ప్రో 6.40-అంగుళాల QHD+ LTPO OLED డిస్‌ప్లేతో 1440x3120 పిక్సెల్స్ రిజల్యూషన్, డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 10Hz నుండి 120Hz వరకు ఉంటుంది. డిస్ ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంది. గూగుల్ టెన్సర్ ప్రాసెసర్, 12 జిబి వరకు LPDDR5 ర్యామ్, 512 జిబి స్టోరేజ్ ఇచ్చారు.
పిక్సెల్ 6 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్ టెలిఫోటో. మరోవైపు రెండవ లెన్స్ 50 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ అండ్ మూడవది 12 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ యాంగిల్. టెలిఫోటో లెన్స్ కోసం 20x సూపర్ రిజల్యూషన్ జూమ్, 4x ఆప్టికల్ జూమ్ లభిస్తుంది. సెల్ఫీల కోసం పిక్సెల్ 6 ప్రోలో 11.1 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. మ్యాజిక్ ఎరేజర్, మోషన్ మోడ్, రియల్ టోన్, ఫేస్ అన్ బ్లర్ వంటి ఎన్నో ఫీచర్లు కెమెరాతో అందుబాటులో ఉంటాయి.
కనెక్టివిటీ కోసం పిక్సెల్ 6 ప్రోలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 23W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5003mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. దీనితో పాటు పవర్ షేరింగ్ కోసం సపోర్ట్ కూడా ఉంది. ఫోన్ బరువు 210 గ్రాములు.