ఆండ్రాయిడ్ యూజర్లను బయపెట్టిస్తున్న కొత్త యాప్.. ఎంత ప్రమాదకరమో తెలుసా ?
తాజాగా ఒక కొత్త వాట్సాప్ స్కామ్ భారతదేశం అంతటా వ్యాపించింది. వాట్సాప్ పింక్ స్కామ్ అనే ఈ స్కామ్ ద్వారా చాలా మంది మోసపోయారని వెల్లడైంది. ముఖ్యంగా ముంబై, కేరళ ఇంకా కర్ణాటకతో సహా భారతదేశంలోని అనేక ప్రధాన నగరాల్లో ప్రభుత్వం అలాగే పోలీసులు ఈ మోసానికి వ్యతిరేకంగా హెచ్చరిస్తున్నారు.
"WhatsApp పింక్ అనేది ఆండ్రాయిడ్ వినియోగదారులకు రెడ్ అలర్ట్" అని నార్తర్న్ టెరిటరీ సైబర్ పోలీస్ క్రైమ్ స్క్వాడ్ నుండి ఒక ట్వీట్ హెచ్చరించింది. అయితే ఈ స్కాం ఏంటి ? దీని నుండి మీ ఫోన్ ని ఎలా రక్షించుకోవాలంటే..?
వాట్సాప్ పింక్ అంటే ఏమిటి?
వాట్సాప్ పింక్ అనేది ఒక పాపులర్ ఫేక్ వెర్షన్ అప్లికేషన్, ఈ యాప్ అడ్వాన్స్డ్ ఫీచర్లను అందిస్తున్నట్లు పేర్కొంది.
ఎలాంటి మోసం జరుగుతోంది?
ఈ కొత్త పింక్ వాట్సాప్‌ను అడ్వాన్స్డ్ ఫీచర్లతో డౌన్‌లోడ్ చేసుకోమని హ్యాకర్లు యూజర్లకు మెసేజ్ చేస్తారు. అయితే ఈ వాట్సాప్ పింగ్ డౌన్‌లోడ్ చేసుకున్న వారి ఫోన్‌లను హ్యాక్ చేయడానికి హ్యాకర్లు సహకరిస్తుందనే చెప్పాలి. దీని ద్వారా బ్యాంకు వివరాలు, కాంటాక్ట్స్, పర్సనల్ ఫోటోలు ఇలా ముఖ్యమైన సమాచారం హ్యాక్ కీ గురవుతుంది.
హ్యాకర్లు పంపిన మెసేజ్ ఏంటి ?
"కొత్త పింక్ వాట్సాప్ మరిన్ని ఫీచర్లతో అధికారికంగా లాంచ్ చేసింది. దీనిని ట్రై చేయండి" అని ఓ మెసేజ్ హ్యాకర్ల వస్తుంది. కాబట్టి మీ వాట్సాప్‌ను పింక్ కలర్‌లో ఉపయోగించడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి అంటూ కోరుతుంది.
మరొక విషయం.. ఇప్పటికే హ్యాక్ చేయబడిన మీ ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులు, బంధువుల నంబర్ నుండి కూడా ఈ పింక్ వాట్సాప్ గురించి మెసేజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
దీని వల్ల కలిగే నష్టమేంటి?
ముందుగా మీ ఫోన్ పూర్తిగా హ్యాక్ చేయబడుతుంది. మీ ముఖ్యమైన OTPతో సహా మీ వ్యక్తిగత డేటా మొత్తం హ్యాక్ అవుతుంది. హ్యాకర్లు మీ ఫోటోలను హ్యాక్మి చేసి మీమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. అలాగే మీ ఫోన్‌కి లింక్ చేయబడిన మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా హ్యాక్ అవుతాయి.
ఆండ్రాయిడ్ వినియోగదారులను మాత్రమే
ఆండ్రాయిడ్ ఫోన్లలో లాగా థర్డ్ పార్టీ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవడానికి Apple iOS అంగీకరించదు.
మీకు తెలియకుండా ఇప్పటికే డౌన్‌లోడ్ చేసి ఉంటే?
పొరపాటున ఇప్పటికే దీన్ని డౌన్‌లోడ్ చేసిన వారు వెంటనే డిలీట్ చేసి, మీ ఫోన్‌లో మీకు కావాల్సిన డేటాను బ్యాకప్ తీసుకొని, మీ ఫోన్‌ను పూర్తిగా ఫార్మాట్ చేయండి. అప్పుడే మీ ఫోన్ లో సీక్రెట్ గా డౌన్ లోడైన హ్యాకింగ్ యాప్స్ డిలీట్ అవుతాయి.
కాబట్టి ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లోని యాప్‌లను మాత్రమే ఉపయోగించడం ద్వారా మీ డేటాను రక్షించుకోవడం మంచిది.