వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్ తో నోకియా సరికొత్త ఫోన్.. దీని ఫీచర్స్ మిమ్మలి వావ్ అనిపిస్తాయి..
సాధారణంగా స్మార్ట్ ఫోన్ కిందపడితేనే ఒకోసారి డిస్ ప్లే పగిలిపోతుంది. అలాంటిది మంటల్లో లేదా నీటిలో పడితే ఖచ్చితంగా సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని హెచ్‌ఎండి గ్లోబల్ (hmd global) మిలిటరీ గ్రేడ్ స్మార్ట్‌ఫోన్ నోకియా ఎక్స్‌ఆర్20ని భారత మార్కెట్లో విడుదల చేసింది. నోకియా ఎక్స్‌ఆర్ 20కి సంబంధించి ప్రత్యేకమైన విషయం ఏంటంటే 55 డిగ్రీల వేడి కూడా ఈ ఫోన్‌ను పాడు చేయదని పేర్కొంది.
అలాగే ఈ ఫోన్ 1.5 మీటర్ల లోతు నీటిలో ఒక గంట పాటు ఉన్న సురక్షితంగా ఉంటుంది. నోకియా ఎక్స్‌ఆర్20(nokia xr20)కి సంబంధించి వచ్చే నాలుగు సంవత్సరాలకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు, మూడు సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. మరో విషయం ఏంటంటే 5జి కూడా ఫోన్‌లో సపోర్ట్ చేస్తుంది.
నోకియా ఎక్స్‌ఆర్20 ధర
భారతదేశంలో నోకియా ఎక్స్‌ఆర్20 ధర రూ. 46,999. ఈ ధరలో 128జిబి స్టోరేజ్ 6జిబి ర్యామ్ లభిస్తుంది. ఫోన్ ప్రీ-బుకింగ్ అక్టోబర్ 20 నుండి ప్రారంభవుతాయి, అయితే నోకియా(nokia) ఆన్‌లైన్ స్టోర్, ఇ-కామర్స్ సైట్, రిటైల్ స్టోర్ ద్వారా అక్టోబర్ 30 నుండి విక్రయించనుంది. లాంచింగ్ ఆఫర్ కింద నోకియా పవర్ ఇయర్‌బడ్స్ లైట్ నోకియా ఎక్స్‌ఆర్ 20తో ఉచితంగా లభిస్తుంది, దీని ధర రూ. 3,599. అంతేకాకుండా, ఫోన్‌తో ఒక సంవత్సరం వరకు స్క్రీన్ ప్రొటెక్షన్ ఉచితంగా లభిస్తుంది.
నోకియా ఎక్స్‌ఆర్20 స్పెసిఫికేషన్
నోకియా ఎక్స్‌ఆర్20లో అండ్రాయిడ్ 11, 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్, డిస్‌ప్లేతో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టన్ ప్రొటెక్షన్, స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ లభిస్తుంది, అలాగే మెమరీ కార్డ్ సహాయంతో 1 టిబి వరకు పెంచవచ్చు.
నోకియా ఎక్స్‌ఆర్20 కెమెరా
కెమెరా గురించి మాట్లాడితే ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్, రెండవ లెన్స్ 13 మెగాపిక్సెల్స్. జీస్ ఆప్టిక్స్ కెమెరా సపోర్ట్ లభిస్తుంది. ముందు భాగంలో, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. యాక్షన్ క్యామ్ మోడ్ కూడా కెమెరాలో అందించారు.
నోకియా ఎక్స్‌ఆర్20 బ్యాటరీ
కనెక్టివిటీ కోసం, నోకియా ఎక్స్‌ఆర్20 లో 5జి, 4జి ఎల్‌టిఈ, వై-ఫై 6, బ్లూటూత్ v5.1, GPS/A-GPS, NavIC, NFC, USB టైప్-సి పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫోన్ మిలిటరీ గ్రేడ్ కోసం MIL-STD810H సర్టిఫికేషన్, వాటర్‌ప్రూఫ్ కోసం IP68 రేటింగ్‌ను పొందింది. 18W వైర్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 4630mAh బ్యాటరీ ఉంది. ఫోన్ బరువు 248 గ్రాములు.