ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త అప్‌డేట్: త్వరలో మరో లేటెస్ట్ ఫీచర్.. అదేంటంటే ?
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్ తీసుకురాబోతుంది. అదేంటంటే ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు కొత్తగా లైక్ బటన్‌పై పనిచేస్తోంది. ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కి రిప్లయ్ ఎవడానికి ప్రత్యేకంగా ఎలాంటి బటన్ లేదు, కానీ ఇన్‌స్టాగ్రామ్ త్వరలో లైక్ బటన్ భర్తీ చేయనుంది.
నివేదిక ప్రకారం కొత్త 'లైక్' బటన్ ఇప్పుడు స్టోరీస్ పేజీలో కనిపిస్తుంది. ఇంకా స్టోరీస్ లైకుల సంఖ్య చూపిస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కి ఎవరైనా యూజర్ లేదా ఫాలోవర్ ఎన్ని సార్లు లైక్ చేశారో చూపిస్తుంది. పాపులర్ డెవలపర్ అలెశాండ్రో పలుజీ ట్వీట్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్ గురించి సమాచారం ఇచ్చారు, అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ మోడ్‌లో ఉందని ఇంకా లాంచ్ పై సమాచారం లేదని వెల్లడించారు.
అలెశాండ్రో పలుజీ కొత్త ఫీచర్ స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేశారు దీనిలో టెక్స్ట్ బార్‌కు కుడి వైపున కొత్త లైక్ బటన్‌ని చూడవచ్చు. లైక్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా యానిమేషన్ కూడా చూపిస్తుంది. ఇంకా WABetaInfo నివేదికలో కూడా ఎవరి స్టోరీస్ నచ్చుతాయో, వారికి ప్రైవేట్ మెసేజ్ అందదు, కానీ స్టోరీస్ తో లైక్స్ కౌంట్ మొత్తం చూపిస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లింక్‌ను ఓపెన్ చేయడానికి స్వైప్ అప్ గెశ్చర్ ని ఇన్‌స్టాగ్రామ్ తొలగించబోతోందనే వార్తలు ఉన్నాయి. దీనికి బదులుగా స్టిక్కర్ తీసుకురానుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా యూజర్లు యాప్‌లో పొందారు, ఇంకా కొత్త ఫీచర్ ఆగస్టు 30 నుండి అందరికీ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
Instagram is now working on a new Like button. As of now, there is no special button to react on Instagram Stories, but Instagram will soon make up for the lack of new likes.