గాలి ద్వారా ఫోన్ ను చార్జ్ చేసే షియోమి వైర్ లెస్ రిమోట్ చార్జర్ వచ్చేసింది.. ఎలా పనిచేస్తుందంటే ?

First Published Jan 29, 2021, 7:11 PM IST

ఎలెక్త్రోనిక్ తయారీ సంస్థ షియోమి తాజాగా ఒక కొత్త వైర్‌లెస్ ఛార్జర్ ఎం‌ఐ ఎయిర్ ఛార్జ్‌ను విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి వైర్‌లెస్ ఛార్జర్, దీని ద్వారా మీరు మీ స్మార్ట్ ఫోన్ ఛార్జ్ చేయడానికి ఛార్జర్‌ లేదా ఇతర డివైజ్ తాకనవసరం లేదు. నిజం చెప్పాలంటే మీ ఫోన్‌ను రిమోట్‌గా ఛార్జ్ చేసే విధంగా  ఎం‌ఐ ఎయిర్ ఛార్జ్ రూపొందించారు.