MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • iphone: ఆపిల్ ఉత్పత్తులు iphone , ipad లలో i అంటే ఏమిటో తెలుసా?

iphone: ఆపిల్ ఉత్పత్తులు iphone , ipad లలో i అంటే ఏమిటో తెలుసా?

iphone: ఆపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్ లలో 'i' అంటే కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న 5 ఆసక్తికరమైన అర్థాలు, స్టీవ్ జాబ్స్ ఆడిన మైండ్ గేమ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Apr 09 2026, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆపిల్ ప్రోడక్టులలో i వెనుక ఉన్న అసలు సీక్రెట్
Image Credit : Asianet News

ఆపిల్ ప్రోడక్టులలో i వెనుక ఉన్న అసలు సీక్రెట్

ప్రపంచ టెక్నాలజీ మార్కెట్‌లో ఆపిల్ ప్రోడక్టులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐఫోన్, ఐప్యాడ్, ఐమాక్ వంటి పరికరాలు ప్రస్తుతం కోట్లాది మంది ప్రజల జీవితాల్లో అంతర్భాగమయ్యాయి. అయితే, ఈ ప్రోడక్టుల పేర్ల ముందు ఉండే చిన్న అక్షరం i వెనుక ఉన్న అసలు అర్థం చాలా మందికి ఇప్పటికీ తెలియదు. చాలా మంది i అంటే కేవలం ఇంటర్నెట్ అని మాత్రమే భావిస్తారు. కానీ, ఆపిల్ సంస్థ ప్రకారం ఈ అక్షరం వెనుక ఐదు విభిన్నమైన అర్థాలు ఉన్నాయి. ఇవి ఆపిల్ విజన్‌ను ప్రతిబింబిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్టీవ్ జాబ్స్ మైండ్ గేమ్
Image Credit : Getty

స్టీవ్ జాబ్స్ మైండ్ గేమ్

ఆపిల్ ఉత్పత్తుల్లో i ప్రయాణం 1998లో ‘ఐమాక్’ విడుదలతో ప్రారంభమైంది. ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఈ ప్రోడక్టును పరిచయం చేస్తూ, ఈ i అక్షరం ప్రాముఖ్యతను వివరించారు. ఆ సమయంలో ఆపిల్ సంస్థ వినియోగదారులకు అందించాలనుకున్న విలువలను ఈ అక్షరం సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. స్టీవ్ జాబ్స్ చెప్పిన ప్రకారం.. i అంటే ప్రధానంగా ఇంటర్నెట్ అని అర్థం వచ్చినప్పటికీ, దానితో పాటు మరో నాలుగు కీలక పదాలను కూడా ఆయన ప్రస్తావించారు. అవే ఇండివిడ్యువల్, ఇన్‌స్ట్రక్ట్, ఇన్‌ఫార్మ్, ఇన్‌స్పైర్.

Related Articles

Related image1
AI అతిగా వాడుతున్నారా? జ్ఞాపకశక్తి మటాష్.. మీ మెదడుకు ఏం జరుగుతుందో తెలుసా?
Related image2
AI Impact : పిల్లల భవిష్యత్తును ఏఐ మార్చేస్తోందా? బెన్నెట్ యూనివర్సిటీ గ్లోబల్ కాన్ఫరెన్స్
35
ఇంటర్నెట్, వ్యక్తిగత గుర్తింపు
Image Credit : our own

ఇంటర్నెట్, వ్యక్తిగత గుర్తింపు

ఐమాక్ విడుదలైన సమయంలో ఇంటర్నెట్ విప్లవం అప్పుడప్పుడే మొదలవుతోంది. కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్‌ను సులభంగా అనుసంధానించడమే లక్ష్యంగా ఆపిల్ ఈ పరికరాన్ని రూపొందించింది. అందుకే i అంటే ఇంటర్నెట్ అని అర్థం చెప్పారు.

అలాగే, i అనేది ఒక వ్యక్తిగత గుర్తింపు అని కూడా జాబ్స్ చెప్పారు. ప్రతి వినియోగదారుడికి వారి అవసరాలకు తగ్గట్టుగా ఆపిల్ ప్రోడక్టులను మలుచుకునే వీలుండాలని, అంటే వ్యక్తిగత గుర్తింపునకు కు ఆపిల్ ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

45
విజ్ఞానం, సమాచార మార్పిడి
Image Credit : Getty

విజ్ఞానం, సమాచార మార్పిడి

కేవలం వినోదం లేదా పని కోసం మాత్రమే కాకుండా, విద్యార్థులకు, నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఆపిల్ ఉత్పత్తులు ఉపయోగపడాలని i లోని ఇన్‌స్ట్రక్ట్ అనే పదాన్ని చేర్చారు. కంప్యూటర్లు కేవలం మిషన్లు మాత్రమే కాదని, అవి మనకు నేర్పించేవిగా కూడా మారాలని ఆపిల్ భావించింది.

అలాగే ఇన్‌ఫార్మ్ అంటే సమాచారాన్ని అందించడం. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని వేగంగా తెలుసుకోవడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయని ఆపిల్ తన విజన్‌లో భాగంగా పేర్కొంది. నేడు మనం వాడుతున్న సఫారీ బ్రౌజర్ లేదా న్యూస్ నోటిఫికేషన్లు ఈ లక్ష్యానికి నిదర్శనాలు.

55
ఇన్‌స్పైరింగ్ డిజైన్
Image Credit : Getty

ఇన్‌స్పైరింగ్ డిజైన్

ఆపిల్ ఉత్పత్తుల వెనుక ఉన్న ఐదో ముఖ్యమైన అర్థం ఇన్‌స్పైర్. కొత్తగా ఏదైనా సృష్టించాలనుకునే వారికి, వినూత్నంగా ఆలోచించే వారికి ఆపిల్ ప్రోడక్టులు ఒక ప్రేరణగా నిలవాలని కంపెనీ ఆశించింది. ఆపిల్ సూపర్ డిజైన్, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ వినియోగదారులను కొత్త విషయాలను అన్వేషించేలా, సృజనాత్మకంగా ఆలోచించేలా ప్రోత్సహిస్తాయి. ఈ ఐదు పదాల కలయికే ఆపిల్ బ్రాండ్‌ను ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా మార్చింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone 17: ఐఫోన్ కొనాల‌నే మీ క‌ల నెర‌వేరిన‌ట్లే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో క‌ళ్లు చెదిరే డిస్కౌంట్
Recommended image2
Crane: క్రేన్లు టన్నుల బరువును ఎలా బ్యాలెన్స్ చేస్తాయి? అయినా ఎందుకు కిందపడదు?
Recommended image3
Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ హంగామా.. వన్‌ప్లస్, రెడ్‌మీ ఫోన్లపై ఊహించని ఆఫర్లు
Related Stories
Recommended image1
AI అతిగా వాడుతున్నారా? జ్ఞాపకశక్తి మటాష్.. మీ మెదడుకు ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
AI Impact : పిల్లల భవిష్యత్తును ఏఐ మార్చేస్తోందా? బెన్నెట్ యూనివర్సిటీ గ్లోబల్ కాన్ఫరెన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved