ట్విట్టర్ కి పోటీగా దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం "కూ యాప్".. దీని స్పెషల్ ఫీచర్స్ ఎంటో తెలుసుకోండి..
సుమారు 250 చైనీస్ యాప్స్ లను నిషేధించిన తరువాత ఇండియాలో స్థానిక దేశీయ యాప్స్ ఆదరణ పెరిగింది. చైనాపై డిజిటల్ స్ట్రైక్ తరువాత అత్యధిక సంఖ్యలో లోకల్ షార్ట్ వీడియో యాప్స్ లాంచ్ అయ్యాయి. అయితే ట్విటర్ కి పోటీగా కూ పేరుతో స్వదేశీ మైక్రోబ్లాగింగ్ సైట్ కూడా ప్రారంభించారు.
గత కొన్ని నెలలుగా కూ యాప్ బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే దీనిని ప్రభుత్వం అధికారిక సోషల్ మీడియా వేదికగా ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్లు కూడా సమాచారం. కూ యాప్ ను స్థానిక ట్విట్టర్‌గా పిలుస్తారు. ఎందుకంటే దీని ఫీచర్స్ కూడా ఎక్కువగా ట్విట్టర్‌తో సమానంగా ఉంటాయి. తాజాగా కూపే యాప్‌ను డిజిటల్ ఇండియా ఆత్మనిర్భర్ ఇండియా ఇన్నోవేట్ ఛాలెంజ్ విజేతగా ప్రకటించారు. కూ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ఇంకా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ యాప్ లో ప్రత్యేకమైన ఫీచర్స్ ఏంటంటే మీరు వివిధ వర్గాలలోని వ్యక్తులను ఫాలో కావొచ్చు. కు యాప్ లో వినియోగదారులు పదాలను భారతీయ భాషలలో 400 అక్షరాలతో పోస్ట్ చేయవచ్చు, అయితే ట్విట్టర్‌లో 250 పదాల పరిమితి మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈ యాప్ ని హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ మరియు బెంగాలీ భాషలలో అందుబాటులో ఉంది. కూ యాప్ లో వినియోగదారులు పోస్టులను వ్రాతపూర్వక రూపంలోనే కాకుండా ఆడియో ఇంకా వీడియోలను కూడా షేర్ చేయవచ్చు. ట్విట్టర్ పోస్టులను ట్వీట్లు అలాగే కులో పోస్ట్ చేసిన పోస్టులకు కు అని పేరు పెట్టారు.
వినియోగదారులకు భారతీయ భాషలలో పోస్టులను ఎలా రాయాలో తెలియకపోతే వారు ఇంగ్లీష్ పదాల టైప్ మోడ్ తో వారి స్వంత భాషలో కూడా టైప్ చేయవచ్చు. ఈ యాప్ వినియోగదారులు "కు" ను తమ స్నేహితులకు నేరుగా వాట్సాప్ ఇంకా ఫేస్‌బుక్‌లో షేర్ చేయగల ప్రత్యేకమైన ఫీచర్ కూడా ఉంది. ట్విట్టర్‌లో ఈ ఫీచర్ లేదు. కూని వాట్సాప్ స్టేటస్‌లో కూడా షేర్ చేసుకోవచ్చు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు కూను కూడా ఎడిట్ చేయవచ్చు.
"కు" యాప్ లో మీరు తెలియని కు యూజర్‌లకు మెసేజ్ చేయలేరు. మీరు ఎవరికైనా మెసేజ్ చేయలనుకుంటే మీరు వారి నుండి ముందు అనుమతి తీసుకోవాలి. వినియోగదారులు కుపై మీకు అనుమతి ఇస్తేనే మీరు వారితో చాట్ చేయవచ్చు. కు యాప్ లో ట్రేడింగ్ ట్యాగ్స్, హ్యాష్‌ట్యాగ్‌లు, ట్యాగ్‌లను కూడా ఉపయోగించవచ్చు. కు యాప్ లో అఫిషియల్ సర్టిఫై అక్కౌంట్స్ కూడా చాలా సులభం. మీకు మంచి సంఖ్యలో ఫాలోవర్స్ ఉంటే మీ ఖాతా అఫిషియల్ అక్కౌంట్ గా భావిస్తే మీరు కు యాప్ నుండే సర్టిఫై కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కు అఫిషియల్ సర్టిఫై అక్కౌంట్ పసుపు టిక్‌తో ఉంటుంది.